
మలేషియా- హాంకాంగ్-బహ్రెయిన్ మధ్య జరుగుతున్న టైసిరీస్‌లో సంచలనం నమోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్ వేదికగా హాంకాంగ్, బహ్రెయిన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సూపర్ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా సాధించని జట్టుగా బహ్రెయిన్ చెత్త రికార్డును నెలకొల్పింది. 16 ఏళ్ల సూపర్ ఓవర్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ (29), షాహిద్ వాసిఫ్ (31), నస్రుల్లా రాణా (14) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్ ప్రశాంత్ కురుప్ (37 బంతుల్లో 31) బహ్రెయిన్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
అయితే ఆ తర్వాత బహ్రెయిన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బహ్రెయిన్ విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.
తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో బహ్రెయిన్ విజయసమీకరణం చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఐదో బంతికి అహ్మర్ బిన్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను టై చేశాడు. అయితే ఆఖరి బంతికి బిన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు.
ఎహ్సాన్ అదుర్స్..
ఈ క్రమంలో సూపర్ ఓవర్‌లో ఛేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ కెప్టెన్ బిన్, సోహైల్ అహ్మద్ లు సూపర్ ఓవర్‌ను ఎదుర్కోనేందుకు వచ్చారు. అదేవిధంగా ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ ఈ సూపర్ ఓవర్ వేసే బాధ్యతను స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్‌కు అప్పగించాడు.
ఈ క్రమంలో ఎహ్సాన్ రెండవ బంతికి బిన్ ను, మూడవ బంతికి సోహైల్ అహ్మద్‌ను ఔట్ చేయడంతో పరుగులు ఏమి రాకుండా సూపర్ ఓవర్ ముగిసింది. దీంతో బహ్రెయిన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు రెండు వికెట్లు కోల్పోతే సూపర్ ఓవర్ ముగుస్తుంది.
చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి'
Comments
Please login to add a commentAdd a comment