సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియా రోడ్లపై మేడిన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దూసుకుపోనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నున్న సమీపంలోని విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ‘అవేరా’ తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆ్రస్టేలియాలో అడుగుపెడుతోంది.
కాన్‌బెర్రా రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్టు కింద 100 ఎలక్ట్రిక్ స్కూటర్లను అవేరా సంస్థ ఎగుమతి చేయబోతోంది. ఈ విషయాన్ని అవేరా వ్యవస్థాపక సీఈవో డాక్టర్ వెంకటరమణ ‘సాక్షి’ కి తెలిపారు.
ఇటీవల ప్రధాని మోదీ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చర్చలు జరిగాయని చెప్పారు. కాన్‌బెర్రా సీఎం ఆండ్రూ భారత్ పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది ఏపీకి వస్తారని, అప్పుదీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.
చదవండి: వైఎస్సార్ షాదీ తోఫాలో మార్పులు.. సీఎం జగన్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment