కార్మికులకు పునరావాస చెక్కుల పంపిణీ
Published Mon, Aug 8 2016 11:26 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమిళనాడు నుంచి తిరిగివచ్చిన జిల్లాకు చెందిన ఆరుగురు కార్మికులకు కలెక్టర్ లక్ష్మీనరసింహం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పునరావాస చెక్కులు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఒక్కొక్కరికి రూ.19వేలు చొప్పున బ్యాంకర్ చెక్‌లను మంజూరు చేసింది. అదేవిధంగా ఊపాధి కూలీలుగా జాబ్ కార్డులను జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ధనుంజయరావు పేర్కొన్నారు. బాండెడ్ కార్మికులైన ఆరుగురు మెళియాపుట్టి మండలానికి చెందిన వారని చెప్పారు. అందులో కొసలి గ్రామం నుంచి ఓలేటి కుమారి, మిన్నారావు, దిమ్మిడిజోల ప్రాంతానికి చెందిన వి.ఆనంద్, బి.ఉమ, బి. వెంకటరమణ, కీసర గ్రామానికి చెందిన వి. తవిటినాయుడు ఉన్నారన్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణానగర్ జిల్లాలో దొరికారని, వీరికి దారి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ. 1000లు మంజూరు చేసి రప్పించినట్లు చెప్పారు. అదేవిధంగా పునరావాసం కింద రూ. 19వేలు వెరసి ఒక్కొక్కరికి రూ. 20వేలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు.
Advertisement
Advertisement