Telangana CM K Chandrashekar Rao Bihar Tour Latest News Updates And Highlights - Sakshi
Sakshi News home page

బీహార్‌ పర్యటన.. పాట్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అప్‌డేట్స్‌

Published Wed, Aug 31 2022 2:13 PM | Last Updated on Wed, Aug 31 2022 6:37 PM

Telangana CM K Chandrashekar Rao Bihar Visit Updates - Sakshi

సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన అప్‌డేట్స్‌

► బీహార్‌ పర్యటనలో భాగంగా..  ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

► తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యమైందన్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌.. బీజేపీ విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు.

► బీజేపీ వ్యతిరేక పోరాటంలో.. మాతో కలిసి వచ్చేవాళ్లతో ముందుకు వెళ్తాం. కలిసి రానివాళ్లను పక్కన పెడతాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

► దేశంలో గుణాత్మక మార్పు అవసరం అన్న సీఎం కేసీఆర్‌.. బీజేపీ ముక్త్‌ భారత్‌తోనే అది సాధ్యమని, ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, అయితే ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర అవసరం లేదని ఆయన అన్నారు.

► శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి జొరబడడం ఏంటని సీఎం కేసీఆర్‌.. దర్యాప్తు సంస్థల తీరును ఉద్దేశించి విమర్శించారు.

► ఇచ్చిన ఏ హామీ నెరవర్చలేదని ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

► బీజేపీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని  దేశం ఎదుర్కొంటోంది. అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయ్‌. అప్పులు పెరిగిపోవడంతో పాటు రూపాయి విలువ పడిపోయింది. 

► ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ దేశానికి చేసింది ఏం లేదని.. పైగా వినాశక పరిస్థితులు సృష్టించిందని మండిపడ్డారు కేసీఆర్‌.

► బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తో భేటీ అనంతరం.. జాతీయ మీడియాతో మాట్లాడారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

► బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తో భేటీ కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం.

► పాట్నాలో ముగిసిన చెక్‌ పంపిణీల కార్యక్రమం

► కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బీహార్‌కు తెలంగాణ మేలు చేసింది. ఇప్పుడు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్‌ ప్రయత్నానికి అభినందనలు: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌

► బీహార్‌ అమర వీరులకు, కార్మికుల కుటుంబాలకు చేయూత ఇచ్చే ఈ చెక్‌ పంపిణీ కార్యక్రమం.. తెలంగాణ- బీహార్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అన్ని రాష్ట్రాలు ఇలా కలిసి కట్టుగా ముందుకెళ్తే.. దేశం పురోగతి సాధించడం ఖాయం.. : డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌

► కేంద్రం కరోనా టైంలో వలస కూలీలను, కార్మికులను ఇబ్బంది పెట్టింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా వాళ్లను స్వస్థలానికి తరలించింది: సీఎం కేసీఆర్‌

► గాల్వాన్‌ వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌, పాట్నాలో ఇవాళ అమర వీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్‌ ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు. బీహార్‌ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందే. దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

►  బాధిత కుటుంబాలకు చెక్‌లను పంపిణీ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. కార్యక్రమంలో పాల్గొన్న బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌,  తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ తదితరులు

► చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తో పాటు హాజరైన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌.

► తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికిన బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌. 

► పాట్నాలో గాల్వాన్‌ అమర జవాన్‌లతో పాటు హైదరాబాద్‌లో మరణించిన వలస కూలీల కుటంబాలకు  చెక్కు పంపిణీ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

పాట్నా/హైదరాబాద్‌: బీహార్‌ పర్యటనలో భాగంగా.. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పాట్నాకు చేరుకున్నారు. బీహారీలకు చెక్‌ పంపిణీల కోసం ఆయన ఇవాళ అక్కడికి వెళ్తున్నారన్నది తెలిసిందే.

గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన భారత సైనికులు ఐదుగురు బీహార్‌కు చెందడం, జవాన్ల కుటుంబాలకు  ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు. అలాగే.. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ అందజేస్తారు. 

చెక్‌ల పంపిణీ అనంతరం.. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో లంచ్‌ కార్యక్రమం.. ఆపై జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించనున్నారు. వీళ్ల భేటీ నేపథ్యంలో జాతీయ మీడియా ఫోకస్‌ ఇప్పుడు పాట్నా వద్దే ఉంది.

ఇదీ చదవండి: ఆ ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement