![TPCC Chief Revanth Reddy Distributes Cheques To Families Of Deceased Congress Cadre - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/REVANTH-REDDY.jpg.webp?itok=XETZpkf0)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయినా, గాయపడినా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి ప్రమాద బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కార్యకర్తల కుటుంబాలను కోరారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 9 మంది సభ్యుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
రేవంత్ మాట్లాడుతూ పార్టీలో సభ్యులుగా చేరిన వారందరికీ బీమాసౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీమా సదుపాయం ఉన్నవారిలో ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్, నేతలు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, రాజనర్సింహ, అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
బూర్గులకు నివాళి: గాంధీభవన్‌లో మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, సీతక్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment