సీఎం జగన్‌కు సమస్య వివరిస్తున్న సుజాత
అనంతపురం: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24 గంటలు గడవకముందే బాధితులకు చెక్కులు అందించారు.
► అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయింది. ఇద్దరు పిల్లలున్నారని, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. సమస్యను సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ గౌతమిని పిలిచి వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్‌లో బాధితురాలు సుజాతకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. బాధితురాలికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు, పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.
► అనంతపురం రూరల్‌లోని విద్యారణ్య నగర్‌కు చెందిన దివ్యాంగురాలు రాచూరి ఝాన్సీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి రూ.లక్ష చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఆర్‌వో రామకృష్ణారెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎంకు తమ సమస్యలను చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఆదుకోవడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment