
సాక్షి, అనంతపురం : నకిలీ చెక్కులు పంపిణీ చేసి రైతులను మోసం చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. రైతులు ఆ చెక్కులను మార్చకోవడానికి బ్యాంక్‌కు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాల కోసం రాప్తాడు రైతుల వద్ద నుంచి 13.20 ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక్కో బాధిత రైతుకు దాదాపు రూ. 29 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా, వాటిని మార్చి 2వ తేదిన రైతులకు స్వయంగా చెక్కులను పంపిణీ చేసింది. మంత్రి ఇచ్చిన చెక్కులను మార్చుకునేందుకు రైతులు బ్యాంక్‌కు వెళ్లగా, చెక్కులు చెల్లవని బ్యాంక్ అధికారులు చెప్పడంతో సునీతపై రైతులు మండిపడుతున్నారు. నకిలీ చెక్కులు ఇచ్చి మాజీ మంత్రి మమ్మల్ని మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment