హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment