CREDAI
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు. -
హోమ్ లోన్‌పై నూరు శాతం పన్ను ప్రయోజనం..
న్యూఢిల్లీ: గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తంపైనా ఆదాయపన్ను ప్రయోజనం కల్పించాలని రియల్టర్ల మండలి ‘క్రెడాయ్’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఇలా చేయడం వల్ల అందుబాటు ధరల ఇళ్లు, మధ్య శ్రేణి ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.అలాగే, రూ.45 లక్షలుగా ఉన్న అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని రూ.75–80 లక్షలకు పెంచాలని కోరింది. క్రెడాయ్ 25వ వ్యవస్థాపక దినం సందర్భంగా ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మీడియాతో మాట్లాడారు. నిర్మాణంలోని రూ.75–80 లక్షల ధరల్లోని ఇళ్ల ప్రాజెక్టులకు ఒక శాతం జీఎస్టీని అమలు చేయాలని, తద్వారా డిమాండ్‌కు ఊతం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రూ.45 లక్షల ధరల్లోపు నిర్మాణంలోని ఇళ్లకే ఒక శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఇంతకుమించిన ఇళ్లకు 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పైగా డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీల్లేదు.‘‘ఎప్పుడో 2017లో రూ.45 లక్షల్లోపు ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా నిర్ణయించారు. నాటి నుంచి వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా, ఈ ధరల పరిమితి రూ.75–80లక్షలకు సవరించాల్సి ఉంది’’అని బొమన్ ఇరానీ పేర్కొన్నారు. ధరల పరిమితిని పెంచడం వల్ల కొనుగోలు దారులు తక్కువ జీఎస్టీ నుంచి ప్రయోజనం పొందుతారని చెప్పారు. మరో కీలక సూచన.. ఇక అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరల పరిమితి విధించొద్దని క్రెడాయ్ మరో కీలక సూచన చేసింది. దీనికి బదులు మెట్రోల్లో 60 మీటర్ల కార్పెట్ ఏరియా, నాన్ మెట్రోల్లో 90 మీటర్ల కార్పెట్ ఏరియాను అందుబాటు ధరలకు పరిమితిగా కొనసాగించాలని కోరింది. పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని బొమన్ ఇరానీ ప్రభుత్వానికి సూచించారు.ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉండగా, దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి (నూరు శాతం) పన్ను మినహాయింపు ఇవ్వాలని క్రెడాయ్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శేఖర్ పటేల్ కోరారు. నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్‌ను పెద్ద ఎత్తున పెంచుతుందని ఇరానీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి వివిధ రకాల ఆమోదాల కోసం 12–18 నెలల సమయం పడుతోందని, ఈ విషయంలో వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా చర్యలు తీసుకోవాలని క్రెడాయ్ చైర్మన్ మనోజ్ గౌర్ డిమాండ్ చేశారు. -
రియల్ బూమ్!
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో రెండు దశాబ్దాల పాటు భారీ బూమ్‌ను చూడనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్ డాలర్లు (రూ.16.6 లక్షల కోట్లు సుమారు)గా ఉన్న మార్కెట్.. 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఇళ్లకు బలమైన డిమాండ్ కొనసాగుతోందని, మందగమన సంకేతాలు లేవని క్రెడాయ్ స్పష్టం చేసింది. ‘‘2021 నాటికి 0.2 ట్రిలియన్ డాలర్లతో భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగ వాటా 6–8 శాతం మధ్య ఉంది. గణనీయంగా పెరిగి 2031 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఇది కనీస అంచనా మాత్రమే. వాస్తవానికి 5–7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఆశావహంగా చూస్తే 7–10 ట్రిలియన్ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటికి భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 14–20 శాతం మధ్య ఉంటుంది’’ అని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా నివేదిక తన అంచనాలను విడుదల చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ స్థిరీకరణకు తోడు సంస్థల పాత్ర పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆఫీస్, నివాస రియల్ ఎస్టేట్‌తోపాటు, డేటా సెంటర్లు, వృద్ధుల ప్రత్యేక నివాసాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. చిన్న పట్టణాలకూ విస్తరణ.. రియల్ ఎస్టేట్ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని క్రెడాయ్–కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టాం’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్ వసతులకు ఊహించనంత డిమాండ్ ఏర్పడనున్నట్టు తెలిపారు.జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అవసరం రియల్టీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం కలి్పంచాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ డిమాండ్ చేశారు. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా 2017లో రూ.45 లక్షల వరకు ధరల్లోని వాటిని అందుబాటు ధరల ఇళ్లుగా పేర్కొనడం గమనార్హం. ఈ వృద్ధి నాన్‌స్టాప్!ఇళ్లకు డిమాండ్ బలంగా కొన సాగుతోందని, మందగమన సంకేతాల్లేవని క్రెడాయ్ స్పష్టం చే సింది. క్రెడాయ్ నాట్కాన్ సదస్సు సోమవారం ఢిల్లీలో మొదలైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. డిమాండ్‌కు తగ్గ ఇళ్ల సరఫరా అవసరం ఉందని క్రెడాయ్ తెలిపింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అన్నది, కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత ఇళ్లకు మొదలైన డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు వివరించింది. డిమాండ్‌కు తగ్గ నిల్వలు లేవని ప్రెస్టీజ్ గ్రూప్ సీఎండీ, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ రజాక్ తెలిపారు. -
తెలంగాణ సీఎం సహాయనిధికి క్రెడాయ్ భారీ విరాళం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య క్రెడాయ్ (కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) రూ.కోటి విరాళం అందించింది. క్రెడాయ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతినింది. పలు జిల్లాలలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీగా విరాళాలు అందిస్తున్నారు. -
ఇళ్ల ధరలు 12 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా 30 శాతం ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షిక ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలకు గాను ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ‘గత కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో బుల్ రన్ కొనసాగుతోంది. టాప్ 8 నగరాల్లో నమోదవుతున్న లావాదేవీల పరిమాణం, హౌసింగ్‌పై సానుకూల సెంటిమెంట్ దీన్ని ధృవీకరిస్తోంది. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతుండటమనేది హౌసింగ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది‘ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగి్నక్ పేర్కొన్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఇటీవల బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనలు చేయడం మొదలైనవి హౌసింగ్ మార్కెట్‌కి ఊతమిచ్చినట్లు వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → హైదరాబాద్‌లో హౌసింగ్ ధరలు 7 శాతం పెరిగాయి. చ.అ.కు రేటు రూ. 10,530 నుంచి రూ. 11,290కి చేరింది. → బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి. → చెన్నైలో పెద్దగా మార్పులు లేకుండా చ.అ. రేటు రూ. 7,690 స్థాయిలోనే ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లో అత్యధికంగా 30 శాతం పెరిగి రూ. 8,652 నుంచి రూ. 11,279కి చేరింది. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు చ.అ.కి 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి. → కోల్‌కతాలో 7 శాతం వృద్ధి చెంది రూ. 7,315 నుంచి రూ. 7,745కి చేరాయి. → పుణెలో రెసిడెన్షియల్ ప్రాపరీ్టల రేట్లు 13% పెరిగి రూ. 9,656కి చేరాయి. → అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13% వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి. -
ప్రాపర్టీ షోల పండుగ!
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించనుంది. క్రెడాయబిలిటీ నేపథ్యంలో ఆగస్టు నెలలో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తి ప్రదర్శనలు జరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి, అవకాశాలను గృహ కొనుగోలుదారులకు వివరించడంతో పాటు వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాంతాల ప్రాధాన్యతలు, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాపర్టీల ఎంపికకు వీలుంటుంది. క్రెడాయ్ సభ్యులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయి కాబట్టి పారదర్శకత, విశ్వసనీయత ఉంటుంది. మూడు ప్రాపర్టీ షోలలో కలిపి సుమారు 200 నిర్మాణ సంస్థలు, 600–700 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని రకాల నివాస సముదాయాలు షోలో ఉంటాయి. ఈమేరకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన స్థిరమైన పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిభావంతులైన శ్రామికశక్తిని కలిగిన ప్రపంచ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు అపార వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. జనరల్ సెక్రటరీ బీ జగన్నాథరావు మాట్లాడుతూ.. స్థిరాస్తి పెట్టుబడులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ సురక్షితమైన పని వాతావరణం, కాస్మోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్నాయని గుర్తు చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్ జైదీప్ రెడ్డి.. క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమబద్ధమైన, స్థిరమైన వృద్ధిని కలిగిన హైదరాబాద్ మెరుగైన జీవన నాణ్యతను, ఆర్ధిక స్థిరత్వాన్ని, సప్టెయినబులిటీతో ఉందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 884 ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లు ఉండగా.. వీటిలో ఎక్కువ భాగం క్రెడాయ్ సభ్యుల ప్రాజెక్టులేనని గుర్తు చేశారు. ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అన్ని ప్రాజెక్ట్‌లు గ్రీన్ లివింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మితమైనవేని చెప్పారు.ప్రాపర్టీ షోలు ఎప్పుడంటే..» ఆగస్టు 2 – 4న మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో » ఆగస్టు 9 – 11న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్స్‌లో » ఆగస్టు 23 – 25న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ సెంటర్లోమూడు షోలు ఎందుకంటే...» ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉండటంతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఇలాంటి తరుణంలో నగర రియల్టీ మార్కెట్ అభివృద్ధి, అవకాశాలను నగరవాసులకు తెలియజేయాలి.» హైదరాబాద్‌లో 70 శాతం అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్టే. అయా ప్రాపర్టీల వివరాలతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత రేటు ఉందో తెలిసిపోతుంది. ఎప్పటిలాగే ఒకే ప్రాంతంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తే కేవలం లగ్జరీ, ఎగువ మధ్యతరగతి ప్రాపర్టీలే ప్రదర్శనలో ఉంటాయి. అందుకే ప్రాంతాల వారీగా ప్రాపర్టీ షో నిర్వహిస్తే ఆయా ప్రాంతాల్లోని అన్ని తరగతుల గృహాలు ప్రదర్శనలో ఉంటాయి.» క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విశ్వసనీయత ఉంది. ఇలాంటి వేదిక మీదుగా స్థిరాస్తి రంగం, నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రతిపాదనలను ప్రజలకు చేరవేసే వీలుంటుంది. -
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో.. ప్రారంభం ఎప్పటి నుంచంటే
సాక్షి, హైదరాబాద్: నగరంలో వచ్చే 2–3 ఏళ్లలో 1.30 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రతినిధులు తెలిపారు. గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, కోకాపేట్, పుప్పాలగూడ, నార్సింగి, తెల్లాపూర్, కొంపల్లి, శామీర్‌పేట్ వంటి ప్రాంతాలలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో ఐటీ కేంద్రాలు, ఔట్సోర్సింగ్ సెంటర్లు, ఆర్ అండ్ డీ యూనిట్లు, బహుళ జాతి సంస్థలు ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలను స్థాపించడానికి నగరంలో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్ మరింత పెరిగిందని, 2022లో 10 కోట్ల చ.అ. లావాదేవీలను అధిగమించగా.. 2023లో 11.9 కోట్ల చ.అ.లకు దాటిందని వివరించారు. మార్చి 8–10 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, స్థిరాస్తి ధరలు పెరుగుతున్నప్పటికీ నగరం గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని తెలిపారు. క్రితం సంవత్సరంతో పోల్చితే 2023లో ప్రాపర్టీ లావాదేవీలలో 25 శాతం వృద్ధి నమోదయిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుందని, ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించిందని చెప్పారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే క్రమంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ కారిడార్ అభివృద్ధి, టౌన్‌షిప్‌ల నిర్మాణం వంటి చోదకశక్తి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 3.5–3.8 కోట్ల చ.అ.లలో హై–క్వాలిటీ బిజినెస్ పార్కులు రానున్నాయని, దీంతో వచ్చే రెండేళ్లలో స్థిరాస్తి రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. నేడే బీఏఐ కన్వెన్షన్ హైటెక్స్‌లో ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ 31వ సదస్సు (ఏఐబిసి)– 2024 మాదా పూర్లోని హైటెక్స్‌లో శనివారం ప్రారంభంకానుంది. మూడు రోజుల ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. గౌరవ అతిధులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారు. నిర్మాణ రంగంలో అధునాతన సాంకేతికత వినియోగం వంటి పలు అంశాలపై చర్చలు, ప్రదర్శనలుంటాయి. బీఏఐ జాతీయ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షులు బొల్లినేని శీనయ్య, రాష్ట్ర అధ్యక్షులు కె.దేవేందర్ రెడ్డిలు తదితరులు పాల్గొననున్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో శుక్రవారం క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘2014 లోనే తెలంగాణలో మార్పు వచ్చింది. కొవిడ్, ఎన్నికలు మినహా మిగతా ఆరున్నరెళ్ల పాలన ప్రజల ముందుంది. 65 ఏళ్లుపాటు గత సీఎంలు పాలించిన పనితీరుతో కేసీఆర్ పనితీరును గమనించి రానున్న ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ‘ప్రో రూరల్ ప్రో అర్బన్, ప్రో అగ్రికల్చర్ ప్రో బిజినెస్’ అనే పంథాపై కేసీఆర్ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనుమానాలు వీడి ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతులు పెరిగాయి. 2021-22 సంవత్సరానికిగాను ఐటీ ఎగుమతుల వల్ల రాష్ట్రానికి రూ.57వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ ఉత్పత్తులు పుంజుకున్నాయి. రాష్ట్ర సంపద హెచ్చయింది. 2014లో వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం 14వ స్థానంలో ఉండేది. కానీ 2022లో 3.5 కోట్ల టన్నుల వరి పండించి మొదటిస్థానంలో ఉంది. టీఎస్ఐపాస్ ద్వారా 27వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏటా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతోంది. గతంలో క్రెడాయ్‌కు సంబంధించి కేసీఆర్ ఒకేరోజు ఏకంగా దాదాపు 6 జీవోలు విడుదల చేశారు. కానీ స్పష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే అలాంటి అవకాశం ఉండదు’ అని కేటీఆర్ అన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తిరిగి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో కేటీఆర్ వివరించారు. ‘100 శాతం అక్షరాస్యత, ‘అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాం. గతంలో హైదరాబాద్‌కు గుర్తుగా ఛార్మినార్ చూపించేవారు. కానీ ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకు క్రెడాయ్ ఎంతో సహకారం చేసింది. 2047 వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో పూర్తి సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యం ఉంది. 2040 వరకు పూర్తి గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌గా మార్చాలి. వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ వాటర్ ప్లాంట్లు పెంచాలి. వాహన, శబ్ద కాలుష్యం తగ్గించాలి. హైదరాబాద్‌ను మరింత సురక్షితంగా ఉంచేందుకు కెమెరాల సంఖ్యను పెంచాలి. 24 గంటలు నీటివసతి కల్పించాలి. హైదరాబాద్‌లో రానున్న పదేళ్లలో 415 కిలోమీటర్లకు మెట్రో విస్తరించాలి. రాష్ట్రంలో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ తీసుకురానున్నాం. దాని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్‌కు కేవలం గంటలో చేరుకునే అవకాశం ఉంది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలుచేయనున్నాం. హైదరాబాద్ చుట్టూ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలి. 2030 వరకు హైదరాబాద్‌ను ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతాం. శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలి. అందులో అన్ని సౌకర్యాలు ఉండాలే రూపొందించాలి’ అని ఆయన వివరించారు. -
క్రెడాయ్ నూతన కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా వీ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా బీ జగన్నాథరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్ జైదీప్‌రెడ్డి ఎన్నికయ్యా రు. వైస్ ప్రెసిడెంట్లుగా బీ ప్రదీప్‌రెడ్డి, సీజీ మురళీ మోహన్, కొత్తపల్లి రాంబాబు, ఎం శ్రీకాత్‌లు, ట్రెజరర్‌గా మనోజ్ కుమార్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీలు జీ నితీష్ రెడ్డి, క్రాంతికి రణ్‌రెడ్డిలు ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఏ వెంకట్ రెడ్డి, బీ జైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ బన్సల్, సీ అమరేందర్‌రెడ్డి, సుశీ ష్ కుమార్ జైన్, మోరిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్, ఎన్ వంశీధర్‌రెడ్డిలు వ్యవహరిస్తారు. 2023–25 సంవత్సరాలకు ఈ పదవిలో కొనసాగుతారు. -
చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది!
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95–100 సీట్లను కచ్చితంగా గెలిచి తీరుతామని మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పట్లేదని, తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నానక్‌రాంగూడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నామని, ఆ సమయంలో 10 సీట్లు అటుఇటు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొందరు కుయుక్తులు చేశారని కేటీఆర్ ఆరోపించారు. చిన్న రాష్ట్ర ఏర్పాటే విఫలమని ప్రకటించి ఏదో చేద్దామని ప్రయత్నించారని, కానీ ప్రజలకు స్పష్టత ఉండటంతో 2018 ఎన్నికల్లో తమకు 88 సీట్లిచ్చి గెలిపించారని చెప్పారు. అభివృద్ధి కేవలం డైలాగ్‌లు కొడితేనే, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తేనో జరగదని, నాయకుడికి స్థిరచిత్తం, ధృడసంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే ఆరాటం ఉంటేనే సాక్షాత్కారం అవుతుందన్నారు. సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధికి తార్కాణం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లకు టెంపర్.. ‘రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తే తొలి ఏడాది విధానాలను అర్థం చేసుకోవడానికి, కుర్చీ సర్దుకోవడానికే సరిపోతుంది. చివరి ఏడాది మళ్లీ ఎన్నికల హడావుడి ఉంటుంది. మధ్యలో ఉండేది మూడేళ్లే. ఈ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు నాయకులకేం తెలుసు.. మేము కదా పర్మినెంట్ ఆర్టిస్టులం.. వాళ్లు గెస్ట్ అర్టిస్టులు. ఐదేళ్లకొకసారి మారిపోతారని అనకుంటారు. వాళ్ల టెంపర్ వాళ్లది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 250 కి.మీ. వరకూ మెట్రో విస్తరణ... హైదరాబాద్‌లో మెట్రో రైలును 250 కి.మీ. వరకూ విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 31 కి.మీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి హయత్‌నగర్ వరకు, ఈసీఐఎల్ నుంచి నానక్‌రాంగూడ వరకూ మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. జేబీఎస్ నుంచి తుర్కపల్లి వరకు, ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు ఒక్కోటి 18.5 కి.మీ. మేర స్కైవాక్‌ను నిర్మించనున్నామని... భవిష్యత్తు అవసరాల రీత్యా ఈ స్కైవాక్‌ల మధ్యలో మెట్రో పిల్లర్లను సైతం నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టిన 16 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ల నిర్మాణం సెపె్టంబర్‌కు పూర్తవుతుందన్న కేటీఆర్... ఎస్టీపీల నుంచి వచ్చే నీటిని నిర్మాణరంగ అవసరాలకు వినియోగించుకోవాలని డెవలపర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి.రాంరెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్ రాంచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్.. హైదరాబాద్‌లో 108.2 మిలియన్ ఎస్ఎఫ్టీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో గ్రేడ్ ఏ ప్రీమియం కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లభ్యత మార్చి చివరికి 700 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) దాటింది. ఇందులో బెంగళూరు వాటా 28 శాతంగా ఉంది. ఈ వివరాలతో రియల్టర్ల సంఘం క్రెడాయ్, డేటా అనలైటిక్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా ఓ నివేదిక విడుదల చేశాయి. 2022 డిసెంబర్ నాటికి గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాల నిల్వలు (లీజుకు అందుబాటులో ఉన్న) 692.91 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. (వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర) ఇక 2021 డిసెంబర్ నాటికి ఇది 643.84 ఎస్ఎఫ్టీ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరులో 195.8 మిలియన్ ఎస్ఎఫ్టీ, ఢిల్లీ ఎన్సీఆర్లో 139.6 మిలియన్ చ.అడుగులు, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ లో 118.1 మిలియన్ చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 108.2 మిలియన్ చదరపు అడుగులు, పుణెలో 72.4, చెన్నైలో 67.5 ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్ ఏ ప్రీమియం ఆఫీసు స్థలాల నిల్వలున్నాయి. స్థిరమైన డిమాండ్ మద్దతుతో 2030 నాటికి గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లభ్యత బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. (రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు)) కోవర్కింగ్ స్పేస్ 7 శాతం కోవర్కింగ్ స్పేస్ గత ఐదేళ్లలో అపార వృద్ధిని చూసిందని, ఇది 50 మిలియన్ చదరపు అడుగులు దాటినట్టు ఈ నివేదిక తెలిపింది. ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీసు స్థలాల్లో 7 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తుండడం అభినందనీయం. ఈ పెరుగుదలకు అనేక కారణాలను చెప్పొచ్చు. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండడం, నూతన తరం పరిశ్రమల వృద్ధి, బహుళజాతి సంస్థల రాక పెరగడాన్ని చెప్పుకోవచ్చు. వినూత్నమైన కార్యాలయ డిజైన్లు, ప్రంపచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ అనుసంధానత అన్నీ కలసి మన వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ను ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి’’ క్రెడాయ్ ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ తెలిపారు. ‘‘700 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీ అంటే గణనీయమైనది. ఇందులో 25 శాతం గత ఐదేళ్ల కాలంలో అందుబాటులోకి వచి్చందే. డెవలపర్లు భవన నిర్మాణాల్లో ఎంతో వినూత్నతతో, ఈఎస్జీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు’’అని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ ట్యాప్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. -
హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు పెరిగాయి. దీంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 12 శాతం మేర వృద్ధి చెందాయి. ఇన్వెంటరీలో 95 శాతం యూనిట్లు నిర్మాణంలో ఉన్నవే. ఏడాదిలో హైదరాబాద్‌లో ఇన్వెంటరీ 38 శాతం పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి ప్రాంతాలలో కొత్త ప్రాజెక్ట్‌లు భారీ స్థాయిలో ప్రారంభం కావటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణమని క్రెడాయ్ - కొల్లియర్స్ నివేదిక వెల్లడించింది. (హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!) గత తొమ్మిది త్రైమాసికాలుగా నగరంలో గృహాల ధరలు స్థిరంగానే ఉన్నాయని, 2023 తొలి త్రైమాసికం (క్యూ1)లో మాత్రం రేట్లు 13 శాతం మేర పెరిగాయి. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 8 నగరాలలో ఇళ్ల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. అత్యధికంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో ధరలు 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం మేర పెరిగాయి. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) గత కొన్ని త్రైమాసికాలుగా గృహ కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి వ్యయాల వృద్ధి గృహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. -
రియల్టీ స్టార్టప్స్‌కు మంచిరోజులు: రూ.800 కోట్ల ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో మరో మైలురాయి.ఈ పరిశ్రమలో వినూత్న పరిష్కారాలు,సేవలను పరిచయం చేసేందుకు సిద్ధమైన స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), ఇంక్యుబేటర్, స్టార్టప్స్ యాక్సిలరేటర్ అయిన వెంచర్ క్యాటలిస్ట్స్ ముందుకు వచ్చాయి. ఇరు సంస్థలు రూ.800 కోట్ల ప్రాపర్టీ టెక్నాలజీ ఫండ్‌ను ఏర్పాటు చేశాయి. సాంకేతికత, డేటా అనలిటిక్స్, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా పరిశ్రమను మార్చగల సామర్థ్యం ఉన్న ప్రారంభ, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌కు ఈ ఫండ్ ద్వారా నిధులను సమకూరుస్తాయి. గృహ, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక విభాగాలకు సేవలు అందించే స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తాయి. ప్రస్తుతం భారత రియల్టీ రంగం 300 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి దోహదం చేస్తుందని క్రెడాయ్ తెలిపింది. క్రెడాయ్‌లో డెవలపర్స్, వెండార్స్, చానెల్ పార్ట్నర్స్, ప్రమోటర్స్ వంటి 256 విభాగాల నుంచి 13,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఓయో, బేసిక్, షేర్నెస్ట్, హోమ్ క్యాపిటల్ వంటి రియల్టీ రంగ స్టార్టప్స్‌లో వెంచర్ క్యాటలిస్ట్ పెట్టుబడి చేసింది. -
కేంద్రం కీలక నిర్ణయం, మరింత తగ్గనున్న స్టీల్ ధరలు!
న్యూఢిల్లీ: స్టీల్, సిమెంట్ ధరలు దిగొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను రియల్ ఎస్టేట్ పరిశ్రమ జాతీయ సంఘాలైన క్రెడాయ్, నరెడ్కో కొనియాడాయి. తయారీదారులు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. స్టీల్, సిమెంట్ ధరలు గడచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోవడం పట్ల ఈ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వీటి కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయని, వినియోగదారులపై భారం పడుతోందంటూ ప్రభుత్వం దృష్టికి ఈ సంఘాలు పలు పర్యాయాలు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో స్టీల్ తయారీకి ముడి పదార్థాలైన కోకింగ్ కోల్, ఫెర్రో నికెల్ తదితర వాటిపై కస్టమర్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ గత శనివారం నిర్ణయాన్ని ప్రకటించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని, అంతిమంగా ఉత్పత్తుల ధరలు దిగొచ్చేందుకు సాయపడతాయని క్రెడాయ్, నరెడ్కో అంచనా వేస్తున్నాయి. ఐరన్‌ఓర్ ఎగుమతులపై సుంకాన్ని 50 శాతం వరకు, స్టీల్ ఇంటర్మీడియరీలపైనా 15 శాతం కేంద్రం పెంచింది. భాగస్వాములు అందరికీ ప్రయోజనం ‘‘తయారీ వ్యయాల పెరుగుదలపై ఆర్థిక మంత్రి, ప్రభుత్వ జోక్యాన్ని మేము కోరుతూనే ఉన్నాం. పెరిగిపోయిన వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడింది. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం భాగస్వాములు అందరికీ ఉపశమనం ఇస్తుంది’’అని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి అదనంగా ముడి ఇనుము, స్టీల్ ఇంటర్మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. చదవండి👉 సామాన్యులకు మరో శుభవార్త! నూనెలతో పాటు వీటి ధరలు తగ్గనున్నాయ్! -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..?
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.9,232గా ఉంది. ముంబై తర్వాత చదరపు అడుగు ధర అధికంగా ఉన్నది హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. అదే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య సగటున 11% పెరిగాయి. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లయసెస్ ఫొరాస్ నివేదిక రూపంలో వెల్లడించాయి. డిమాండ్ పెరగడానికితోడు, నిర్మాణరంగంలో వాడే ముడి సరు కుల ధరలకు రెక్కలు రావడం ఇళ్ల ధరలు ప్రియం కావడానికి కారణాలుగా నివేదిక తెలిపింది. ఢిల్లీలో అధికం.. ఢిల్లీ మార్కెట్లో ఇళ్ల ధరలు అంతకుముందు ఏడాది ఇదే మూడు నెలల కాలంతో పోలిస్తే (2021 జనవరి–మార్చి) అత్యధికంగా 11 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది. అహ్మదాబాద్‌లో ధరలు 8% పెరిగి చదరపు అడుగుకు రూ.5,721కి చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల ధరలు ఒక్క శాతమే వృద్ధిని చూశాయి. చదరపు అడుగు ధర బెంగళూరులో రూ.7,595, చెన్నైలో రూ.7,017గా ఉండగా, ముంబై ఎంఎంఆర్‌లో రూ. 19,557గా ఉంది. పుణె మార్కెట్లో ధరలు 3% పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,485గా ఉంది. ‘‘చాలా పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరిగింది. రెండేళ్లలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులే వార్షికంగా ధరలు పెరగడానికి దారితీశాయి. ఫలితంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు కరోనా ముందున్న స్థాయిని దాటేశాయి’’అని ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 4 శాతం ‘‘దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు జనవరి–మార్చి కాలంలో సగటున 4 శాతం పెరిగాయి. దీర్ఘకాలం పాటు మందగమన పరిస్థితుల నుంచి నివాసిత ఇళ్ల మార్కెట్ ఇంకా కోలుకోవాల్సి ఉంది’’అని క్రెడాయ్, కొలియర్స్ నివేదిక తెలియజేసింది. పూర్వపు స్థాయి కంటే ఎక్కువ 2022 జనవరి – మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందు నాటికంటే ఎక్కువగా ఉన్నట్టు లయసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. కొత్త సరఫరాతో ఇళ్ల యూనిట్ల లభ్యత పెరుగుతుందన్నారు. గృహ రుణాలపై ఇటీవల వడ్డీ రేట్లు పెరిగినా కానీ, ఇళ్ల విక్రయాలు కూడా వృద్ధిని చూపిస్తాయని చెప్పారు. రియల్టీకి మద్దతుగా నిలవాలి.. పెరిగిపోయిన నిర్మాణ వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో గత 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడినట్టు క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం.. ముడి ఇనుము, స్టీల్ ఇంటర్మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం యూ షేప్‌లో రికవరీ అయ్యేందుకు మద్దతుగా నిలవాలి’ అని ఆయన కోరారు 5–10 శాతం పెరగొచ్చు.. వచ్చే 6–9 నెలల కాలంలో ఇళ్ల ధరలు మరో 5–10 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ అంచనా వేశారు. ‘‘భారత నివాస మార్కెట్ మంచి పనితీరు చూపించడం ఉత్సాహంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత మార్కెట్ అంచనాలను అధిగమిస్తోంది. విశ్వసనీయమైన సంస్థలు ఈ ఏడాది ఎక్కువ విక్రయాలు చూస్తాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారులు డెవలపర్ల మంచి పేరును కూడా చూస్తున్నారు’’ అని నాయర్ చెప్పారు. -
షాకింగ్ న్యూస్..భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు..కారణం అదే..?
న్యూఢిల్లీ: ఇళ్ల ధరలు 5–7 శాతం పెరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వెల్లడించింది. నిర్మాణ వ్యయం దూసుకెళ్లడంతో ఈ ఏడాది ఇప్పటికే 5–8 శాతం ధరలు అధికం అయ్యాయని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష వర్ధన్ పటోడియా తెలిపారు. బిల్డింగ్ మెటీరియల్‌పై జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు/మాఫీ, వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ధరల పెరుగుదల ప్రభావంపై క్రెడాయ్ ఇటీవల చేపట్టిన సర్వేలో 1,849 నిర్మాణ సంస్థలు పాలుపంచుకున్నాయి. ‘నిర్మాణంలో వాడే ముడి సరుకుల ధరల నుండి ఉపశమనానికై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్టులను సమయానికి అందించలేమని 39 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు భావిస్తున్నారు. ధరలు ప్రస్తుత స్థాయిల నుండి తగ్గకపోతే గరిష్టంగా ఆరు నెలల వరకు మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణాలను కొనసాగించగలమని 76 శాతం మంది తెలిపారు’ అని సర్వేలో తేలిందని పటోడియా వివరించారు. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్‌లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్‌ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో భారం
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్రాపర్టీ విలువలను 30 శాతం నుంచి 100 శాతం కంటే ఎక్కువ పెంచారు. స్టాంప్ డ్యూటీని 37.5 శాతం, నాలా చార్జీలను 50 శాతం నుంచి 67 శాతం వరకు సవరించారు. దీంతో గృహ కొనుగోలుదారులపై తీవ్రమైన ప్రభావం పడింది. తాజాగా మరోసారి విలువ పెంపు నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని క్రెడాయ్, ట్రెడా డెవలపర్ల సంఘాలు తెలిపాయి. మార్కెట్ విలువ సవరణ ప్రక్రియలో రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్లు, వాటాదారులతో చర్చించకుండా పెంచడం హేతుబద్ధం కాదని ఆరోపించాయి. ఇప్పటికే పెంచిన చార్జీల ప్రభావం మార్కెట్‌పై, కొనుగోలుదారులపై ఎంత మేర ప్రభావం చూపించిందో అధ్యయనం చేపట్టకుండా మరోసారి సవరణ నిర్ణయాన్ని తీసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించింది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఇటీవలే 3 లక్షలకు పైగా ప్రాపర్టీలను నిషేదిత జాబితా నుంచి తొలగించారని.. ఇంకా చాలా విడుదల చేయాల్సి ఉందని తెలిపాయి. కార్డ్ సిస్టమ్ నుంచి లక్షలాది ప్రాపర్టీలు విడుదల కావాల్సి ఉందని.. దీంతో ఈ ఖాతాలో లక్షల లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడానికి భయపడుతున్నారని, కరోనా సమయంలోనూ సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న యూడీఎస్, ప్రీలాంచ్ విక్రయాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించలేదని ఆరోపించాయి. -
కెడాయ్కి సంపూర్ణ సహకారం
తిరుపతి మంగళం: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి తన వంతు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2022 బ్రోచర్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన సంస్థగా క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో జరిగే క్రెడాయ్ కార్యక్రమాలకు దేశ ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, ప్రాంతీయ స్థాయిల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న నష్టాలను నివారించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు రాంప్రసాద్, రాజేష్‌గుప్తా, రాజేష్‌బాబు, ప్రభాకర్, రాజశేఖర్‌రావు, వివిధ బ్యాంకుల అధికారులు, బిల్డర్లు పాల్గొన్నారు. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
నిర్మాణ అనుమతుల కలెక్టర్లకు అప్పగింతపై పునరాలోచించండి!
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాలలోని పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న కలెక్టర్లకు అదనంగా భవన నిర్మాణ అనుమతులు అప్పగించడం సరైంది కాదు. డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో ఉన్నట్టు సాంకేతిక నిపుణులు, ఇన్ఫ్రా జిల్లా కేంద్రాలలో లేవు. భవన నిర్మాణ అనుమతుల ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వారంలో రెండు రోజులను కేటాయించారు. అయితే ఆ రోజుల్లో మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం ఉంటే గనక ఇక అంతే సంగతులు. ప్రతి జిల్లాలోను టీఎస్‌బీపాస్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దాని పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని’ క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం కోరింది. ఈ విషయంపై సంబంధింత మంత్రిని సంప్రదించనున్నామని తెలిపింది. క్రెడాయ్ తెలంగాణ నూతన ప్రెసిడెంట్ ఎన్నికైన డీ మురళీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భూముల సమగ్రత, సులభతర క్రయ విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ధరణిపై సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని.. కాకపోతే దీన్ని దశల వారీగా అమలు చేస్తే మరింత సమర్థవంతంగా ఉండేదని సూచించారు. ధరణిలో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటివరకు పాత పద్ధతులను సైతం కొనసాగించాలని కోరారు. టీఎస్‌బీపాస్‌ను జిల్లాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి, అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇతర నగరాల్లో రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, హైదరాబాద్‌లో మాత్రం డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమగ్రవంతమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో భూముల ధరలు వంటివి ఇందుకు కారణమని తెలిపారు. టీఎస్‌ఐసీతో జిల్లాలలో అభివృద్ధి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)ని తీసుకొచ్చారని.. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. జిల్లాల విభజన, మౌలిక వసతుల అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. అయినప్పటికీ ఇతర నగరాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలతో పోలిస్తే ఆయా జిల్లాలలో అందుబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో గృహాలకు, గిడ్డంగి సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌తో డిమాండ్.. ఇప్పటివరకు ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఏరోస్పేస్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని సెక్రటరీ కే. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు, జిల్లాలలో పారిశ్రామిక జోన్ల అభివృద్ధి కోసం ‘వన్ డిస్ట్రిక్ట్– వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్టీ రంగానికి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. క్రెడాయ్ నూతన కార్యవర్గం కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్‌గా సీహెచ్. రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‌గా డీ. మురళీ కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఈ. ప్రేమ్‌సాగర్ రెడ్డి, సెక్రటరీగా కే. ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షులుగా జీ. అజయ్ కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వీ. మధుసూదన్ రెడ్డి, బీ. పాండు రంగారెడ్డి, జాయింట్ సెక్రటరీగా జీ. శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్‌గా ఎం. ప్రశాంత రావు ఎన్నికయ్యారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో–ఆర్డినేటర్‌గా సీ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీగా రోహిత్ ఆశ్రిత్ నియమితులయ్యారు. 2021–23 సంవత్సరానికి గాను ఈ నూతన కార్యవర్గం పదవిలో ఉంటుంది. ప్రోత్సాహకర విధానాలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహకర విధానాలతో రాష్ట్రం వృద్ధిపథంలో దూసుకుపోతుందని చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి చెప్పారు. టీఎస్ఐపాస్తో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలలోను చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు వచ్చాయని, దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ–హబ్, ఎస్సీ, ఎస్టీల కోసం టీప్రైడ్ వంటి వినూత్న పథకాలతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరిగిందని.. దీంతో స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు పెరిగాయని, పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని తెలిపారు. వీటన్నింటి ప్రయోజనాలతో హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలలోను గృహలకు, వాణిజ్య కేంద్రాలు, గిడ్డంగులకు డిమాండ్ పెరిగిందని వివరించారు. నిర్మాణ రంగంలో సాంకేతిక వినియోగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను జిల్లా చాప్టర్లకు సైతం విస్తరించేందుకు కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సభ్యులకు శిక్షణ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, నీటి పొదుపు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలపై మెంబర్లకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సంఘటిత డెవలపర్ల ప్రాజెక్ట్‌లు, అందుబాటు ధరల్లో నాణ్యమైన గృహాలను ఒకే వేదికగా సామాన్యులకు సైతం చేరేలా అన్ని జిల్లా చాప్టర్లలోను ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 క్రెడాయ్ చాప్టర్లున్నాయని, ఈ రెండేళ్ల కాలపరిమితిలో వీటిని 20కి విస్తరిస్తామని పేర్కొన్నారు. -
అందుబాటు గృహాలు కట్టండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని.. ఇది ఎల్లకాలం ఉండదని గృహ విక్రయాలలో స్థిరత్వం ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావులతో చర్చిస్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల 20–30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20–30 ఏళ్లు ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు. రెరాకు శాశ్వత చైర్మన్.. త్వరలోనే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమించడంతో పాటు రిటైర్డ్ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుదిదశకు చేరుకుందని మంత్రి వివరించారు. ధరణిలో అర్బన్ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా.. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని దీంతో ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15–20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సాఫ్ట్వేర్, బ్యాండ్‌విడ్త్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ధరణిలో నమోదైన భూములకు చట్టబద్ధత వస్తుందని.. దీంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు. ధరణిలో లీగల్ ప్రొవిజన్స్ లేవు.. ఇప్పటికీ ధరణిలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని... ప్రధానంగా న్యాయమపరమైన నిబంధనలు (లీగల్ ప్రొవిజన్స్) లేవని తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో భూ యజమానులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)లతో కలిపి మరొక సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. ధరణి విధానాన్ని ముందుగా ఒకట్రెండు జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి వాటి ఫలితాలను అంచనా వేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు సూచించారు. ప్రతి 10 ప్రాపర్టీలలో 7 ధరణి సమస్యలలో చిక్కుకున్నాయన్నారు. వేలాది దరఖాస్తుల కరెక్షన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించే సమయం కలెక్టర్లకు ఉండటం లేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 5–6 నెలల సమయం పడుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తే పది రోజుల్లో పరిష్కరించవచ్చని చెప్పారు. టీఎస్–బీపాస్ పర్మిషన్స్ సంపూర్ణంగా లేవు.. టీఎస్–బీపాస్‌తో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు వస్తున్నప్పటికీ అవి సంపూర్ణంగా లేవని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్మెంటల్, వాటర్ బోర్డ్ విభాగాలు టీఎస్–బీపాస్‌లో అనుబంధమై లేవని.. దీంతో ఆయా విభాగాల కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో లేదా అర్బన్ ఏరియా ప్రాంతాలలో కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) విధానాన్నే ఉంచాలని కోరారు. గ్రిడ్, వేర్‌హౌస్ పాలసీలు, ఈ–సిటీ, ఎంఎస్ఎంఈ, మెడికల్ డివైజ్ వంటి పార్క్‌లు, ఫార్మా సిటీ వంటి కొత్త కొత్త అభివృద్ధి పనులు జరుగుతున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. దీంతో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా విస్తరిస్తుందని తెలిపారు. పాలసీల రూపకల్పనలో రియల్టీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. నేడు, రేపు కూడా ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ 10వ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వంద స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. శని, ఆదివారాలలో కూడా ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి బ్యాంక్‌లు, పలు నిర్మాణ సామగ్రి సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మూడు రోజుల్లో కలిపి సుమారు 60 వేల మంది సందర్శకులు వస్తారని క్రెడాయ్ హైదరాబాద్ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబు, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.