
క్రెడాయ్ హైదరాబాద్ కార్యవర్గం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ది కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా పీ రామకృష్ణా రావు, జనరల్ సెక్రటరీగా వీ రాజశేఖర్ రెడ్డిలు పునరి్నయమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా జీ ఆనంద్ రెడ్డి, కాచం రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావులు నియమితులయ్యారు. ట్రెజరర్‌గా ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబులు ఎంపికయ్యారు. 2021–23 గాను వీళ్లు ఆయా పదవులలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం అనిశి్చత వాతావరణంలోకి వెళ్లిపోయిందని.. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ మార్కెట్ మాత్రం స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన క్రెడాయ్ ప్రాపర్టీ షో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment