Ramakrishna rao
-
కాళేశ్వరం రుణాల లెక్కలెందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మంగళవారం కమిషన్ ఆయనను ప్రశ్నించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు రామకృష్ణారావు తడబడటంతో ‘మీ మీదేమీ వేసుకోవద్దు’అని అసహనం వ్యక్తంచేసింది. 2015లో జారీ చేసిన ఓ జీవో ప్రకారం కోర్ కమిటీ తరచుగా మీతో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించిందా? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా, కమిటీలోని ఇంజనీర్లు తనను కలిసి ప్రాజెక్టు పురోగతిని వివరించి బిల్లులకు నిధులు కోరేవారని రామకృష్ణారావు బదులిచ్చారు. ఆ సమావేశాల మినిట్స్ ఏమయ్యాయి? అని కమిషన్ అడగటంతో సమాధానమివ్వలేక ఆయన తడబడ్డారు. దీంతో మీ మీదేమీ వేసుకోవద్దు అని కమిషన్ సూచించింది. బడ్జెట్లో కాళేశ్వరం రుణాలెందుకు చూపలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2021–22లో తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాలను రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపగా, 2022–23లో రూ.9,596 కోట్లు, 2023–24లో రూ.2,545 కోట్ల బడ్జెటేతర రుణాలను ఎందుకు చూపలేదని కమిషన్ ప్రశ్నించింది. ఆ రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపితే రాష్ట్ర రుణపరిమితికి కేంద్రం కోతలు విధించే అవకాశం ఉండడంతో వాటిని బడ్జెట్లో చూపలేదని రామకృష్ణారావు వివరించారు. దీంతో ఇది తెలంగాణ ఫిస్కల్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి విరుద్ధమని కమిషన్ మండిపడింది.ప్రభుత్వమే రుణాలు తిరిగి చెల్లిస్తుంది.. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాల విషయంలో ఆర్థిక శాఖ బాధ్యత ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, వాటికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినందున ఆర్థిక శాఖ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుందని రామకృష్ణా రావు బదులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.6,519 కోట్లు, అసలు రూ.7,382 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రుణాలను 9 నుంచి 10.5 శాతం వడ్డీలతో తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటైందని చెప్పారు. కేఐపీసీఎల్‌కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లను విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రుణాల సమీకరణ బాధ్యత కేఐపీసీఎల్‌దేనని చెప్పారు. బరాజ్‌ల నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు బరాజ్‌లను టర్న్‌కీ పద్ధతిలో కట్టాలని జీవో 145 పేర్కొంటుండగా, ప్రభుత్వం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కమిషన్ తప్పుబట్టింది. జీవోలో అలా ఉందని, ప్రాజెక్టును మాత్రం పీస్ రేటు విధానంలో నిర్మించారని రామకృష్ణారావు తెలిపారు. బరాజ్‌లకు అనుమతిచ్చే విషయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం తీసుకుంటారా? అని కమిషన్ ప్రశ్నించగా, అది తప్పనిసరి అని వివరించారు. బరాజ్‌ల పాలసీలను శాసనసభ ముందు ప్రభుత్వం ఉంచిందా? అని ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు. నేటి నుంచి వరుసగా...జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్‌ను ప్రశ్నించనుంది. గురు, శుక్ర, శనివారాల్లో వరుసగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన నవయుగ, అఫ్కాన్స్, ఎల్ అండ్ టీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. -
బడ్జెట్లో భారీ అంచనాలొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో ఆర్భాటాలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిపాదనల తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాలను పంపాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు 52 పేజీలతో కూడిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపారు. ఈ నెల 9లోగా ఆన్లైన్లో ఈ ప్రతిపాదనలను పరిపాలన విభాగాల నుంచి సచివాలయానికి పంపాలని, ప్రతిపాదనలను పరిశీలించి అదే నెల 11లోగా సచివాలయ అధికారులు ఆర్థిక శాఖకు పంపించాలని ఆ విధివిధానాల్లో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలివే: ♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగించాలో వద్దో నిశితంగా పరిశీలించాలి. ♦కొత్త పథకాలను ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎప్పటి నుంచి అమలు కావాలి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుందన్నది స్పష్టంగా పొందుపర్చాలి. ♦ ప్రభుత్వ శాఖల పరిధిలో పూర్తి కావాల్సిన పనుల వివరాలను పేర్కొనాలి. వాస్తవిక అవసరాల మేరకే వాటికి ప్రతిపాదనలివ్వాలి. ♦ అన్ని ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, పనుల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను వివరంగా తెలపాలి. ♦ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అమలు చేసిన పథకాల వివరాలు, వాటి అమలు కోసం సంవత్సరాలవారీగా అయిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్యను తెలియపర్చాలి. ♦2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 30 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో పంపించాలి. ♦కేంద్ర ప్రాయోజిత పథకాల (సీసీఎస్)ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమయ్యే ప్రతిపా దనలను పొందుపర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్య క్రమాలతో కలిసి కేంద్ర పథకాలను వినియో గించుకునే క్రమంలో ఈ ప్రతిపాదనలుండాలి. ♦ ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా అ న్ని శాఖలు ఆస్తుల వివరాలు, పన్ను రాబడు లు, రుణాల వివరాలను పొందుపర్చాలి. ♦ అన్ని శాఖలకు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పంపాలి. ♦ బడ్జెట్ ప్రతిపాదనలు పంపే క్రమంలో వాస్తవిక అంచనాలుండాలే తప్ప గొప్పలకు పోయి భారీ అంచనాలను పంపొద్దు. గ్రాంట్ఇన్ ఎయిడ్ ఖర్చును తగ్గించి పంపాలి. అన్ని విభాగాల ఖర్చులను ఒక్క శాఖ కిందనే పంపాలి. ♦ కార్యాలయ నిర్వహణ, వాహనాలు, అద్దెలు, నీరు, విద్యుత్ ఖర్చులు, స్టేషనరీ, అవుట్ సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాల ప్రతిపాదనలు వాస్తవ అవసరాలకే పరిమితం కావాలి. ♦ ప్రభుత్వ రాబడులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్ల ప్రకారమే అంచనాలను పంపాలి. ♦ ప్రతి శాఖల్లోని ఉద్యోగుల వివరాలను వారు వేతనాలు తీసుకొనే పద్దులవారీగా విభజించి పంపాలి. హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, వీఆర్ఏలు, రోజువారీ వేతన ఉద్యోగులు, ఫుల్‌టైం, పార్ట్‌టైం కంటింజెంట్ ఉద్యోగులు, మినిమమ్ టైం స్కేల్ సిబ్బంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్లో పంపాలి. ♦ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ శాఖలోకి వచ్చే అవకాశమున్న ఉద్యోగుల వివరాలను కేడర్‌వారీగా పంపాలి. -
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు. రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు. -
మరో 2,440 సర్కారీ కొలువులు
సాక్షి, హైదరాబాద్: విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ విద్య, కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ విద్యలో.. అరబిక్–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్ (మల్టీమీడియం)–1, కామర్స్–50, కామర్స్ (ఉర్దూ)–7, ఎకనామిక్స్–81, ఎకనామిక్స్ (ఉర్దూ)–15, ఇంగ్లిష్–153, ఫ్రెంచ్–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్–17, హిస్టరీ/సివిక్స్ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్ (మల్టీమీడియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతికశాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలుగు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక విద్యలో 359 పోస్టులు.. సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్–4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్–15, బయోమెడికల్ ఇంజనీరింగ్–3, కెమికల్ ఇంజనీరింగ్–1, కెమిస్ట్రీ–8, సివిల్ ఇంజనీరింగ్–82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్–24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్–41, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–1, ఫుట్‌వేర్ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్ ప్రెస్–5, మెకానికల్ ఇంజనీరింగ్ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్–5, ట్యానరీ–3, టెక్స్టైల్ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్ ఇన్స్ట్రక్టర్–14, లైబ్రేరియన్–31, మ్యాట్రన్–5, ఫిజికల్ డైరెక్టర్–37, ఎలక్టీష్రియన్–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. ఉన్నత విద్యలో.. కమిషనర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్ విభాగంలో ఇంగ్లిష్–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్డ్ న్యూట్రిషియన్–5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్–39, కామర్స్–బిజినెస్ అనలటిక్స్(స్పెషలైజేషన్)–8, డెయిరీ సైన్స్–8, క్రాప్ ప్రొడక్షన్–4, డేటా సైన్స్–12, ఫిషరీస్–3, కామర్స్–ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్ గెజిటర్స్ విభాగంలో 6 రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్–24, ఫిజికల్ డైరెక్టర్–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్కివ్స్‌లో 8 పోస్టులు.. డైరెక్టర్ స్టేట్ ఆర్కివ్స్ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ ఆర్కివిస్ట్–2, అసిస్టెంట్ లైబ్రేరియన్–1, జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్(ఉర్వూ, పర్షియన్)–1, రిసెర్చ్ అసిస్టెంట్–1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (ఉర్దూ, పర్షియన్)–1 పోస్టులున్నాయి. -
1,663 కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు శుభవార్త. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 1,663 కొలువుల నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా భర్తీకి అనుమతులిచ్చిన పోస్టుల్లో 90 శాతం కొలువులు ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించినవే. ఇరిగేషన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్ (ఐ–క్యాడ్), ట్రాన్స్పోర్ట్–ఆర్అండ్బీ, ఆర్థిక శాఖల పరిధిలోని ఈ ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అనుమతిచ్చిన పోస్టుల్లో ఐ–క్యాడ్‌కు సంబంధించి 1,326 ఉద్యోగాలు, ట్రాన్స్పోర్ట్–ఆర్అండ్ బీ శాఖకు సంబంధించి 284 ఉద్యోగాలు, ఆర్థిక శాఖకు సంబంధించి 53 ఉద్యోగాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అనుమతులతో కలిపి ఇప్పటివరకు 46,988 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లైంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,526 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ద్వారా 18,279 ఉద్యోగాలు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 10,028 ఉద్యోగాలు, జిల్లా నియామకాల కమిటీ ద్వారా 59, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 9,096 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వీటిలో పోలీసు, గ్రూప్–1, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. మిగతా పోస్టులకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది. -
మరో 10,105 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారీగా జీవో నంబర్ 83 నుంచి 97 వరకు మొత్తం 15 జీవోలను విడివిడిగా జారీ చేశారు. ఈసారి అనుమతి ఇచ్చిన వాటిలో 9,096 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకు లాల్లోనే ఉన్నాయి. ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడడమేనని ధ్వజమెత్తింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సోమ వారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మూలధన వ్యయం కోసం 2022–23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథ కాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఇది కొనసాగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుని, ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఆ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్రమే చెప్పింది.. మూలధన వ్యయం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లు , 2021–22లో రూ.15 వేల కోట్లు , 2022–23లో లక్ష కోట్లను రుణాల రూపేణా రాష్ట్రాలకు ఇస్తూ.. వాటిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనికి రాదని గతంలో కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మూలధన వ్యయానికి సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెందిన వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగల స్థితికి వస్తాయని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సీడీసీలు ఇచ్చే రుణాల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కానీ వాటిలో కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం వివక్షే అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షపూరిత చర్యలు సరికావని పేర్కొన్నారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యంత కక్షపూరిత చర్య 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’ (ప్రభుత్వం నేరుగా తీసుకోని అప్పులు) అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని రామకృష్ణా రావు పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగానే భావించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలుపరచదలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి కానీ గత సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పడం ఏ మాత్రం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు అవసరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిబం ధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పారు. -
కడుపుకోతల్లో కరీంనగర్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60.7శాతం ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతున్నాయని తెలంగాణ జనాభా, ఆరోగ్య నివేదిక వెల్లడించింది. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రచురించిన ఈ రిపోర్టును గణాంకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. నివేదిక ప్రకారం... సిజేరియన్ ప్రసవాలు కుమ్రం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 27.2% జరుగుతున్నాయి. అత్యంత అధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4% జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రు ల్లో 81.5% ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతుండగా, అందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా లో 92.8% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మొత్తం 44.5% మాత్రమే సిజేరియన్‌లుండగా, అత్యధికంగా జనగాంజిల్లాలో 73% సిజేరియన్ ప్రసవాలు అవుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు... ►15 ఏళ్ల లోపు జనాభా అధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. అక్కడి జనాభాలో 27.8% మంది ఆ వయస్సులోపు వారే. ఆ వయస్సువారి తెలంగాణ సరాసరి జనాభా 22.5%. ►రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు 1,049 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 1,219 మంది ఉండగా, హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 959 మంది ఉన్నారు. ►తెలంగాణలో 95.8 శాతం మంది ఇళ్లల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 99.1శాతం మంది వాడుతున్నారు. ►రాష్ట్రంలో 60.8శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో 72శాతం మందికి ఉంది. ►రాష్ట్రంలో 15–19ఏళ్ల వయస్సులో తల్లులైనవారు, గర్భిణీలుగా ఉన్నవారు 5.8% ఉండగా, వీరిలో అత్యంత తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఒక శాతం ఉన్నారు. అత్యంత ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 15.9శాతం ఉన్నారు. ►రాష్ట్రంలోఆసుపత్రుల్లో ప్రసవాలు సరాసరి 97% ఉండగా, వరంగల్ రూరల్ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ►రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 49.7% జరుగుతుండగా, ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 66.8శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలో 15ఏళ్లు పైబడినవారిలో తీవ్రమైన షుగర్ వ్యాధితో మందులు వాడుతున్న పురు షులు 18.1శాతం ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 26.8 శాతం మంది ఉన్నారు. కాగా, మహిళల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 14.7శాతం ఉండగా, హైదరాబాద్‌లో 21.2శాతం ఉన్నారు. -
2031 నాటికి జనాభా 3.92 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్ర జనాభా మరో 15 లక్షల మేర పెరుగుతుందని.. మొత్తం జనాభా సంఖ్య 2026 నాటికి 3.86 కోట్లకు, 2031 నాటికి 3.92 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 1.97 కోట్ల మంది పురుషులు, 1.95 కోట్ల మంది మహిళలు ఉంటారని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్లుగా ఉన్న తెలంగాణ జనాభా.. 2021 నాటికి 3.77 కోట్లకు చేరిందని వివరించింది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విశేషాలను వెల్లడించింది. శనివారం హైదరాబాద్‌లోని అర్థగణాంకశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో గత కొన్నేళ్లకు సంబంధించిన పలు గణాంకాలను, ప్రస్తుతం వివిధ రంగాల్లో పురోగతి, భవిష్యత్ అంచనాలను వివరించారు. ‘తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్’ నివేదికలో 2020–21 గణాంకాలివే.. ∙ రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 905.4 మిల్లీమీటర్లుకాగా.. 2020–21లో 1,322.5 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణంతో పోలిస్తే ఇది 46 శాతం ఎక్కువ. ∙ 2014–15లో 66,276 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరగ్గా.. 2020–21 నాటికి 1.45 లక్షల కోట్లు దాటింది. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే ఈసారి 7.99 శాతం ఐటీ ఎగుమతులు పెరిగాయి. ఈ రంగంలో ప్రస్తుతం 6,28,615 మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో 1,04,23,177 ఎకరాల్లో వరి సాగయింది. వానాకాలంలో 52,51,261 ఎకరాల్లో, యాసంగిలో 51,71,916 ఎకరాల్లో వరి వేశారు. ఆ తర్వాత అత్యధికంగా మొక్కజొన్న 6.39 లక్షల ఎకరాల్లో, జొన్నలు 2.24లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ∙ మొత్తంగా 2,18,51,471 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇందులో వానాకాలంలో 96,31,057 టన్నులు, యాసంగిలో 1,22,20,414 టన్నులు వచ్చింది. ఇందులో 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ∙ రాష్ట్రంలో మొత్తం రూ.11,886.70 కోట్ల విలువైన 485.17 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీశారు. రూ.806 కోట్ల విలువైన 239 లక్షల టన్నుల సున్నపురాయి ఉత్పత్తి చేశారు. అన్నిరకాల ఖనిజ వనరులు కలిపి 29,962 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. ∙ ఉపాధి విషయానికి వస్తే.. 2020–21లో మొత్తం 12.7 లక్షల మందికి పలు వ్యాపార/వాణిజ్య సంస్థల ద్వారా ఉపాధి లభించింది. ఇందులో దుకాణాల్లో పనిచేసేవారు 5.72 లక్షలుకాగా.. వాణిజ్యసంస్థల్లో 5.76 లక్షలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో 1.22లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ∙ 2020–21లో మొత్తం 66,555 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. 57,007 మిలియన్ యూనిట్లు వినియోగించారు. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో విద్యుత్ వినియోగం 39,519 మిలియన్ యూనిట్లు మాత్రమే. ∙రాష్ట్రంలో రోడ్డెక్కిన కొత్త వాహనాలు 8,22,416. ఇందులో టూవీలర్లు 5.58 లక్షలకుపైగా ఉండగా.. కార్లు/మినీ వ్యాన్లు వంటివి 1.17 లక్షలు, ట్రాక్టర్లు 23,160, రోడ్డు రోలర్లు 61, వ్యవసాయ ట్రాలర్లు 10,891 ఉన్నాయి. ∙ రవాణా వాహనాల విషయానికి వస్తే.. గూడ్స్ క్యారేజీలు 97,633, 5,836 ఆటోలు, 1,458 క్యాబ్‌లు, 43 విద్యాసంస్థల వాహనాలు ఉన్నాయి. ∙ 2020–21లో కొత్తగా రిజిస్టరైన ఆర్టీసీ బస్సుల సంఖ్య 4 మాత్రమే. -
క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణారావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ది కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా పీ రామకృష్ణా రావు, జనరల్ సెక్రటరీగా వీ రాజశేఖర్ రెడ్డిలు పునరి్నయమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా జీ ఆనంద్ రెడ్డి, కాచం రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావులు నియమితులయ్యారు. ట్రెజరర్‌గా ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబులు ఎంపికయ్యారు. 2021–23 గాను వీళ్లు ఆయా పదవులలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం అనిశి్చత వాతావరణంలోకి వెళ్లిపోయిందని.. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ మార్కెట్ మాత్రం స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన క్రెడాయ్ ప్రాపర్టీ షో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సీఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలి: ఉప రాష్ట్రపతి
సాక్షి, విశాఖపట్నం : ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. విశాఖ గీతం విశ్వ విద్యాలయంలో శనివారం ‘ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ ఆన్ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతంలో ఏడాదిన్నరకాలం పాటు ఉంటూ జీవితంలో ఏ విధంగా అడుగులు వేయాలో నేర్చుకున్నానని తెలిపారు. మహత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు నేటి తరానికి అందిస్తున్న వ్యక్తిగా రామకృష్ణ నిలిచారని, అందుకే ఆయన అంటే చాలా ఇష్టమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సమాజంలో మానవ ప్రమాణాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని, వనరులు పుష్కలంగా ఉన్న దేశం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జీడీపీలో 5వ స్థానంలో ఇండియా ఉందని, భారత విద్యా వ్యవస్థలో మార్పు రావాలని భావించారు. భారతీయ పౌరులకు ఎవరిపై వివక్షత లేదని, భారతదేశం ఎవరిపైన దండయాత్ర చేయలేదని ప్రస్తావించారు. అదే విధంగా సీఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలని సూచించారు. -
3.144 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మూల వేతనంపై కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెరిగింది. 2019, జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబర్లో చెల్లించనున్న ప్రస్తుత నవంబర్ వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.డీఏ బకాయిల చెల్లింపు ఇలా..: 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ వివరణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో నగదు రూపంలో చెల్లించనుంది. 2015, పీఆర్సీ ఉద్యోగులకు..: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెంపు వర్తించనుంది. 2010, పీఆర్సీ ఉద్యోగులకు ..: జీవో 36 ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992 శాతం నుంచి 118.128 శాతానికి పెరిగింది. అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992 శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నం.171 ప్రకారం.. వేతనం రూ.3850 నుంచి రూ.6700కు పెరిగిన ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది. 2006 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148 శాతం నుంచి 154 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.2016 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది. యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్తోపాటుఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందు తున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992 శాతం నుంచి 118.128 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100 వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది. -
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన షురూ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజన ప్రక్రియ మొదలైంది. నగదు భారం పడకుండా ఏపీ భవన్‌ను 58:42 లో పంచునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రా లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సచివాలయం లో బుధవారం జరిగిన రెండు రాష్ట్రాల విభజన విభా గం అధికారుల తొలి భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ నుంచి విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఏపీ భవన్‌కు 19.437 ఎకరాల భూములున్నాయి. ఇందులో 3.73 ఎకరాల్లో శబరి బ్లాక్, 4.196 ఎకరాల్లో గోదావరి –స్వర్ణముఖి బ్లాకులతో పాటు ఏపీ సీఎం కాటేజీ ప్రాంగణం, 3.412 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.564 ఎకరాల్లో పటౌడీహౌస్ ఉన్నాయి. మధ్యలో 0.535 ఎకరాల మేర సర్వీసు రోడ్డు ఉంది. విభజన చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నీ రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీ 58%, తెలంగాణ 42% నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచనలమేర పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే పంపిణీపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందని గతంలో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్రం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి భవన్‌ను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని గతేడాది మార్చిలోనే సూచించింది. -
సీనియర్ ఐఏఎస్ సంతకం ఫోర్జరీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఏపీ సీఎం కుమారుడు, మంత్రి నారా లోకేశ్.. ఇలా అనేక మంది ప్రముఖులతో దిగిన ఫొటోలు.. కాస్త మాటకారితనం.. ఫార్మా రంగంలో అనుభవం.. ఇవే పెట్టుబడిగా ఓ ఘరానా మోసగాడు భారీ చీటింగ్‌కు ప్రయత్నించాడు. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు పేరిట లెటర్ హెడ్ సృష్టించి ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. వీటి ఆధారంగా ఓ ప్రైవేట్ కంపెనీకి రూ.7.7 కోట్ల చెల్లింపునకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆఖరి నిమిషంలో చెల్లింపు ఆగిపోగా.. నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు పూర్తి వివరాలు వెల్లడించారు. అలా ఏర్పడ్డ పరిచయాలు.. తూర్పుగోదావరి జిల్లా నడకుదురుకు చెందిన కనుకుటూరి రామకృష్ణ చంద్రశేఖర్ కాకినాడలో బీఫార్మసీ చదివాడు. విద్యార్థి దశ నుంచే తరచు రాజకీయ పార్టీల సభలకు వెళ్లేవాడు. కొన్నాళ్లకు ఆయా పార్టీ సమావేశాల్లో ప్రసంగించే వక్తగా మారడంతో కొందరు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దగ్గరయ్యాడు. ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వెంటే తిరుగుతూ ఆయనకు స్పీచ్‌లు రాసివ్వడం వంటివి చేసేవాడు. ప్రతి సందర్భలోనూ వారితో ఫొటోలు దిగి వాటిని ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్ చేసుకుంటూ తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. తన పలుకుబడితో టెండర్లు ఇప్పించడం, బదిలీలు చేయించడం, పోస్టింగ్స్ వేయించడం వంటివి తేలిగ్గా చేయగలనంటూ ప్రచారం చేసుకున్నాడు. గతంలో ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెందిన కాన్ఫిడెన్షియల్ ప్రింటింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తానంటూ కోల్‌కతాకు చెందిన కౌశిక్ నుంచి రూ.50 లక్షలు గుంజాడు. బాధితుడు అప్పట్లో నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడంతో కేసు మూతబడింది. ఉద్యోగం పొంది.. నకిలీ ఆర్డర్ ఇచ్చి.. కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్‌కు తార్నాకలోని పల్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ కె.సురేష్‌బాబుతో పరిచయమైంది. తనకు ప్రముఖులతో ఉన్న పరిచయాలతో అనేక విధాగుఆ ఉపయోగపడతానంటూ అతడిని నమ్మించాడు. పల్స్ ఫార్మా కంపెనీకి అప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి మందుల సరఫరాకు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి. తన పలుకుబడితో ఆర్డర్స్ పెంచడంతో పాటు భారీగా అడ్వాన్సులు వచ్చేలా, బిల్లులు త్వరగా పాస్ అయ్యేలా చూస్తానంటూ నమ్మబలికాడు. దీంతో సురేష్‌బాబు తమ కంపెనీలో లైజనింగ్ ఆఫీసర్/మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. ప్రభుత్వ విభాగాల నుంచి త్వరగా పనులు పూర్తి చేసుకురావడానికి రూ.12.75 లక్షలు చెల్లించారు. సురేష్‌బాబును పూర్తిగా నమ్మించడానికి చంద్రశేఖర్ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినట్లు రూ.7.77 కోట్లకు మొబిలైజేషన్ ఆర్డర్ రూపొందించాడు. అలానే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈఎస్ఐ విభాగం నుంచి మరో రూ.9 కోట్లకు ఉత్తర్వులు సృష్టించాడు. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు, ఆయన లెటర్ హెడ్ తదితరాలు సృష్టించాడు. హోదా తప్పుగా ఉండటంతో... సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు సంతకం ఫోర్జరీ చేస్తూ పల్స్ ఫార్మా కంపెనీ పేరిట రూ.7.72 కోట్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రిలీజ్ ఆర్డర్ రూపొందించాడు. దీన్ని అందుకున్న పల్స్ సంస్థ మల్లాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో డిపాజిట్ చేసింది. అక్కడి అధికారులు వెరిఫికేషన్ కోసం ఈ లెటర్స్‌ను సచివాలయంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌కు పంపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ప్రస్తుత హోదా ప్రిన్సిపల్ సెక్రటరీ. అయితే ఈ లెటర్స్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అని ఉండటంతో బ్యాంకు ఏజీఎంకు అనుమానం వచ్చింది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి ఆయన నేరుగా రామకృష్ణారావుతో మాట్లాడటంతో అసలు మోసం బయటపడింది. ప్రభుత్వాధికారుల ఫిర్యాదుతో సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం శుక్రవారం చంద్రశేఖర్‌ను పట్టుకుంది. నిందితుడి నుంచి కారు తదితరాలు స్వాధీనం చేసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. -
రామకృష్ణారావుకు సేవాభారతి పురస్కారం
చేవెళ్ల రూరల్: పలు సామాజిక, విద్యాసంబంధమైన సేవా కార్యక్రమాలను చేసినందుకు చేవెళ్లకు చెందిన ఉపాద్యాయుడు పి.రామకృష్ణారావుకు శిఖరం ఆర్ట్ అసోసియేషన్ పురస్కారాన్ని అందజేసింది. ఈ అవార్డును బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, మల్లాది చంద్రమౌళిల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు గురువారం చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసిన పెద్దలకు, శిఖరం అర్ట్ థియేటర్స్ అసోసియేషకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పురస్కారం అందించి మరింత బాధ్యతను పెంచినట్లు చెప్పారు. అవార్డు కార్యక్రమంలో శిఖరం అర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాచం సత్యనారాణగుప్త తదితరులు పాల్గొన్నారని రామకృష్ణారావు తెలిపారు. -
'రెండో రోజూ ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు'
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో రెండో రోజు కూడా ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిసింది. ఉన్నతాధికారుల దగ్గర పీఎస్లుగా పనిచేస్తున్న వారిని తప్పించాలని టీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
ఏడు శాఖల్లో ఉద్యోగుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏడు శాఖల ఉద్యోగుల విభజన పూర్తయింది. డెరైక్డర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, కమిషనర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్, కమిషనరేట్ ఆఫ్ హాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, కమిషనరేట్ ఆఫ్ సెరీ కల్చర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డెలివరీ సర్వీసెస్, కామర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్స్ శాఖల్లో విభజన పూర్తయిందని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మొత్తం244 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 104, ఆంధ్రకు 140 మందిని కేటాయించారని ఆయన అన్నారు. ఇంకా 45 శాఖల విభజన జరగాల్సి ఉందని, ఆప్షన్ల కోసం ఆయా శాఖల ఉద్యోగులకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. అన్ని శాఖల విభజనకు మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు. -
సీఆర్డీఏ కోర్ టీమ్ రెడీ
10 మంది అధికారులతో ఏర్పాటు ప్లానింగ్ విభాగం హెడ్‌గా రామకృష్ణారావు ల్యాండ్ పూలింగ్‌కు 27 మంది డిప్యూటీ కలెక్టర్లు జనవరి 19 నుంచి సింగపూర్ కమిటీ శిక్షణ రెండు రోజుల్లో సీఆర్డీఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం సాక్షి, విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కార్యకలాపాలు పూర్తి స్థాయి లో ప్రారంభించటానికి రంగం సిద్ధమైంది. వివిధ కీలక విభాగాలకు సంబంధించి అధికారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యం గా ప్లానింగ్ విభాగం, అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ పూలింగ్, ఎకౌంట్స్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాలను 20 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేయటానికి కసరత్తు సాగిస్తోంది. మొదట కోర్ టీమ్‌ను సిద్ధం చేశారు. అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పైన తీసుకుంటారు. రెండు రోజుల్లో సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కోర్ టీమ్ రెడీ అయిందని చెప్పారు. నైపుణ్యం ఉండి సీఆర్డీఏలో పనిచేసే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. నిపుణులైన అధికారుల కోసం... ఇప్పటికే నిపుణులైన అధికారుల కోసం రాష్ట్రంలోని అన్ని కీలక విభాగాల అధికారులతో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఆర్డీఏలో ప్లానింగ్ విభాగం హెడ్‌గా ప్రస్తుతం హెచ్ఎండీఏలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణారావును ఎంపిక చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన సీఆర్డీఏ విధుల్లోకి రానున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌ను హెడ్‌గా ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఆడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్ విభాగాల హెడ్లతో కలిపి 10 మంది కోర్ టీమ్‌లో ఉంటారు.ల్యాండ్ పూలింగ్ విభాగంలో 27 మంది డిప్యూటీ కలెక్టర్లు పనిచేయనున్నారు. వీరికి సింగపూర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. బిల్లును న్యాయ శాఖకు పంపిన గవర్నర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు(సీఆర్డీఏ)ను గవర్నర్ నరసింహన్ న్యాయ శాఖకు పంపించారు. న్యాయ శాఖ అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించిన తరువాత మళ్లీ సీఆర్డీఏ బిల్లు సంబంధిత శాఖ కార్యదర్శి, మంత్రికి వెళ్తుంది. అక్కడ నుంచి ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తుంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత గవర్నర్ నరసింహన్ ఆమోదానికి బిల్లును పంపుతారు. ఇదంతా పూర్తి అయిన తరువాతనే గజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు!
విభజనపై ప్రతి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయం కొత్తగా జాబితాలు రూపొందించాలని సీఎస్ల ఆదేశం జూన్ 1 నాటికి సీనియారిటీ పరిగణనలోకి.. హైదరాబాద్: ఆప్షన్ల ఆధారంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరుగనుంది. ఇందుకోసం కేడర్, డిప్యూటేషన్లు, దీర్ఘకాలిక సెలవులు సహా ఉద్యోగుల పూర్తి వివరాలతోపాటు జూన్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల సీనియారిటీతో జాబితాలను రూపొందించనున్నారు. కేడర్ సహా ఉద్యోగుల జాబితాను తయారుచేయడంపై వివిధ శాఖల ప్రత్యేక కార్యదర్శులు, అధిపతులతో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్ఆర్) విభాగం అధికారులు పీవీ రమేష్, రామకృష్ణారావు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రధానికి పంపించామని.. అనుమతి రాగానే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎస్‌లు సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియ రెండు నెలల్లో ముగుస్తుందని తెలిపారు. మార్గదర్శకాలకనుగుణంగా ప్రతీ ఉద్యోగికీ ఆప్షన్ పత్రాలు, ఆప్షన్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కేడర్‌లో 51 వేల పోస్టులుండగా వెయ్యి మంది ఉద్యోగుల పంపిణీకే ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. రాష్ర్టపతి ఉత్తర్వులే ప్రామాణికం.. రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని... ఎంత మంది ఉద్యోగులను నోటిఫై చేశారు? ఆర్థికశాఖ మంజూరు చేసిన పోస్టులెన్ని? ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను నివేదికలో పొందుపర్చాలని సీఎస్‌లు సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కమల్‌నాథన్ నేతృత్వంలోని సలహా మండలి దృష్టికి తేవాలని సూచించారు. ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా సమర్పించాలని చెప్పారు. కొత్తగా జాబితాలు! జూన్ 1వ తేదీ నాటికి ఉన్న వివరాలన్నింటినీ పరిగణించి జాబితాను తయారుచేయాలని.. పాత నివేదికలతో సంబంధం లేకుండా కొత్తగా జాబితాలను రూపొందించాలని అధికారులను సీఎస్‌లు, ఎస్ఆర్ అధికారులు ఆదేశించారు. ఇందుకోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభజన ప్రక్రియ ప్రారంభమైతే రెండు నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. ఎస్ఆర్ విభాగానికి పూర్తిస్థాయి అధికారి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగానికి పూర్తిస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించి, బాధ్యతలు అప్పగిస్తామని సీఎస్‌లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంట్లో ఇరు రాష్ట్రాల అధికారులూ ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ విభాగానికి సభ్య కార్యదర్శిగా పీవీ రమేష్ ఉన్నారు. కాగా... విభజనను త్వరగా పూర్తిచేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీలు పాల్గొన్నారు. -
‘బడ్జెట్’పై స్పందించని శాఖలు..
93 శాఖల్లో 77 నుంచే సమాచారం ఆర్థిక శాఖ అసంతృప్తి నేటిలోగా పూర్తి సమాచారం తెప్పించాలని తాజాగా లేఖ హైదరాబాద్: అరకొర సిబ్బంది.. ఒక్కో అధికారికి మూడు నాలుగు శాఖల అప్పగింత.. ఇదంతా బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాల తయారీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సంబంధిత శాఖల అధికారుల నుంచి బడ్టెట్ ప్రతిపాదనలు, ఉద్యోగుల వివరాలను జూన్ 30 లోగా కచ్చితంగా పంపించాలని ఆర్థిక శాఖ గత నెల 12నే ఉత్తర్వులు జారీ చేసింది. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది. 93 శాఖలకుగాను.. 77 శాఖల నుంచే సమాచారం లభించింది. మిగిలిన శాఖలు స్పందించకపోవడంపై ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధిపతులు ఆయా విభాగాల అధిపతుల నుంచి గురువారంలోగా పూర్తి సమాచారం తెప్పించాలని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తాజాగా లేఖ రాశారు. -
కోనేరు హంపి వధువు కాబోతోంది
-
తెలంగాణ బ్యాంకర్‌గా ఆర్బీఐ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను ఎంపిక చేశారు. ఈ మేరకు నోటిఫై చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్న ఆర్బీఐ ఇకపై జనరల్ బ్యాంకింగ్ బిజినెస్ నిర్వహిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్బీఐలో ఖాతా తెరవడానికి ఆమోదించిందని, నాగ్‌పూర్ శాఖలో తెలంగాణ రాష్ట్ర ఖాతాను రూ. 1.38 కోట్లతో ప్రారంభించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జారీ అయిన తొలి ఉత్తర్వు ఇదే కావడం విశేషం. ఆర్బీఐ ఇతర శాఖల్లో సబ్సిడరీ జనరల్ లెడ్జర్ అకౌంట్‌ను తెరవడానికి కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర మిగులు నిధులను, అనుమతించిన సెక్యూరిటీలను పెట్టుబడిగా పెట్టడానికి ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించారు. -
వైద్య విధాన పరిషత్‌లకు విభజన సెగ
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా స్థాయి పెంచేందుకు రాష్ట్ర విభజన సెగ అడ్డంకిగా మారింది. దీంతో ప్రజలకు గతంలో మాదిరిగానే సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. జిల్లాలో 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్‌లుగా మార్చాల్సి ఉంది. కోవెలకుంట్లలోని 30 పడకల ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్య విధాన పరిషత్ ద్వారా వైద్య సేవలు అందాల్సి ఉండగా రాష్ట్రాల విభజన, సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా ఈ ఫైల్ ముందుకు కదలడం లేదు. గత జనవరి 22న ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రామకృష్ణరావుతో కూడిన బృందం జిల్లాలోని డోన్, కోడుమూరు, కోవెలకుంట్ల, మిడుతూరు, నందికొట్కూరు, పాణ్యం, ఓర్వకల్లు, పత్తికొండ, సున్నిపెంట, వెల్దుర్తి, వెలుగోడు, యాళ్లూరు, అవుకు కమ్యూనిటీ ఆసుపత్రులను పరిశీలించి ఆయా కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో ఉన్న సౌకర్యాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. భవనాల సముదాయాలు, వసతులు ఉన్న ఆసుపత్రులలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్యవిధాన పరిషత్‌లతో రోగులకు వైద్య సేవలు అందుతాయని పరిశీలన అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ వైద్య విధాన పరిషత్‌ల మార్పు ఫైల్‌ను పక్కనపెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. స్థాయిని పెంచడం వల్ల 24 గంటల వైద్యసేవలు, గైనకాలజిస్టులు, అన్ని రకాల సర్జన్లకు సంబంధించి డాక్టర్లతో పాటు 31 మంది వైద్య సిబ్బంది, గర్భిణులు, చిన్న పిల్లలకు అన్ని రకాల రోగాలకు సంబంధించి వైద్య విధాన పరిషత్‌ల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఊరట చెందారు. అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన, ఉద్యోగులు, రాష్ట్రస్థాయి ఆఫీసుల పంపకాలు, తదితర వాటిపై గందరగోళం నెలకొనడం ఆరోగ్య శాఖకు సంబంధించి వివాదం కొనసాగుతుండటంతో వైద్య విధాన పరిషత్ మార్పు జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే జిల్లా ప్రజలకు వైద్య విధాన పరిషత్‌ల కల నెరవేరుతుంది. -
హంపీ పెళ్లంట
విజయవాడ : చెస్ క్వీన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వధువు కాబోతోంది. ఆగస్టు 14వ తేదీ తెల్లవారుజామున దాసరి అన్వేష్‌ను పరిణయమాడబోతోంది. ఎఫ్ట్రానిక్స్ (విజయవాడ) కంపెనీ అధినేత దాసరి రామకృష్ణారావు ఏకైక కుమారుడు అన్వేష్‌తో ఈ నెల 22న ఓ హోటల్లో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. తమ ఇద్దరి రంగాలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతామని హంపి తెలిపింది. పెళ్లి తర్వాత కూడా చెస్‌లో కొనసాగుతానని పేర్కొంది.