హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో రెండో రోజు కూడా ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిసింది. ఉన్నతాధికారుల దగ్గర పీఎస్‌లుగా పనిచేస్తున్న వారిని తప్పించాలని టీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది.