ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఏకంగా 30 శాతం అధికం
హైదరాబాద్‌లో 7 శాతం వృద్ధి
ఏప్రిల్–జూన్ క్వార్టర్‌పై నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా 30 శాతం ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షిక ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలకు గాను ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ‘గత కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో బుల్ రన్ కొనసాగుతోంది.
టాప్ 8 నగరాల్లో నమోదవుతున్న లావాదేవీల పరిమాణం, హౌసింగ్‌పై సానుకూల సెంటిమెంట్ దీన్ని ధృవీకరిస్తోంది. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతుండటమనేది హౌసింగ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది‘ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగి్నక్ పేర్కొన్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఇటీవల బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనలు చేయడం మొదలైనవి హౌసింగ్ మార్కెట్‌కి ఊతమిచ్చినట్లు వివరించారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ హైదరాబాద్‌లో హౌసింగ్ ధరలు 7 శాతం పెరిగాయి. చ.అ.కు రేటు రూ. 10,530 నుంచి రూ. 11,290కి చేరింది.
→ బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి.
→ చెన్నైలో పెద్దగా మార్పులు లేకుండా చ.అ. రేటు రూ. 7,690 స్థాయిలోనే ఉంది.
→ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 30 శాతం పెరిగి రూ. 8,652 నుంచి రూ. 11,279కి చేరింది.
→ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు చ.అ.కి 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి.
→ కోల్‌కతాలో 7 శాతం వృద్ధి చెంది రూ. 7,315 నుంచి రూ. 7,745కి చేరాయి.
→ పుణెలో రెసిడెన్షియల్ ప్రాపరీ్టల రేట్లు 13% పెరిగి రూ. 9,656కి చేరాయి.
→ అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13% వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment