House prices
-
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సగటున 7 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7– 57 శాతం మధ్య పెరిగాయని.. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ప్రకటించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,050కు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ధరల పెరుగుదల 57 శాతంగా ఉంది. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని వివరించింది. ‘‘ఆర్బీఐ గడిచిన 10 పాలసీ సమీక్షల్లో రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించడం ధరలపై మరింత ఒత్తిడికి దారితీసింది. రేట్ల తగ్గింపు లేకపోవడంతో డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వచి్చంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపించింది’’అని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది. ఇతర పట్టణాల్లో ధరల పెరుగుదల.. → బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది. → చెన్నైలో 22 శాతం మేర ధరలు పెరిగాయి. చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది. → కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం. → ముంబైలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది. → పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది. బలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నట్టు బీపీటీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) హరీందర్ దిల్లాన్ పేర్కొన్నారు. నాణ్యమైన ప్రాపరీ్టలకు అధిక డిమాండ్ నెలకొనడం ఢిల్లీ ఎన్సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ధరల పెరుగుదల అధికంగా ఉండడానికి కారణమని చెప్పారు. దక్షిణాది మార్కెట్లలో కొత్త ఇళ్ల ప్రారం¿ోత్సవాలు తగ్గడం మార్కెట్లో దిద్దుబాటును సూచిస్తున్నట్టు బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేదీ తెలిపారు. -
ఇళ్ల ధరలు 12 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా 30 శాతం ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షిక ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలకు గాను ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ‘గత కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో బుల్ రన్ కొనసాగుతోంది. టాప్ 8 నగరాల్లో నమోదవుతున్న లావాదేవీల పరిమాణం, హౌసింగ్‌పై సానుకూల సెంటిమెంట్ దీన్ని ధృవీకరిస్తోంది. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతుండటమనేది హౌసింగ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది‘ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగి్నక్ పేర్కొన్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఇటీవల బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనలు చేయడం మొదలైనవి హౌసింగ్ మార్కెట్‌కి ఊతమిచ్చినట్లు వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → హైదరాబాద్‌లో హౌసింగ్ ధరలు 7 శాతం పెరిగాయి. చ.అ.కు రేటు రూ. 10,530 నుంచి రూ. 11,290కి చేరింది. → బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి. → చెన్నైలో పెద్దగా మార్పులు లేకుండా చ.అ. రేటు రూ. 7,690 స్థాయిలోనే ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లో అత్యధికంగా 30 శాతం పెరిగి రూ. 8,652 నుంచి రూ. 11,279కి చేరింది. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు చ.అ.కి 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి. → కోల్‌కతాలో 7 శాతం వృద్ధి చెంది రూ. 7,315 నుంచి రూ. 7,745కి చేరాయి. → పుణెలో రెసిడెన్షియల్ ప్రాపరీ్టల రేట్లు 13% పెరిగి రూ. 9,656కి చేరాయి. → అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13% వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి. -
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
5.9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇళ్ల ధరల పెరుగుదలలో భారత్ 14వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల ధరలు 5.9 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల సూచీలో భారత్ 18 స్థానాలు ముందుకు వచి్చంది. నైట్‌ఫ్రాంక్‌కు చెందిన గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ 56 దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వార్షికంగా అత్యధికంగా తుర్కియేలో 89.2 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత క్రొయేíÙయాలో 13.7 శాతం, గ్రీస్‌లో 11.9 శాతం, కొలంబియాలో 11.2 శాతం, నార్త్ మెసడోనియాలో 11 శాతం చొప్పున పెరిగాయి. ‘‘అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్‌లు అధిక వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సగటున ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా 3.5 శాతంగా ఉంది. కరోనా ముందు పదేళ్ల వార్షిక సగటు పెరుగుదల 3.7 శాతానికి సమీపానికి చేరుకుంది’’అని నైట్‌ఫ్రాంక్ తన తాజా నివేదికలో వివరించింది. నైట్‌ఫ్రాంక్ పరిశీలనలోని 56 దేశాలకు గాను 35 దేశాల్లో ఇళ్ల ధరలు గడిచిన ఏడాది కాలంలో పెరగ్గా, 21 దేశాల్లో తగ్గాయి. చెప్పుకోతగ్గ వృద్ధి ‘‘గృహ రుణాలపై అధిక రేట్లు, ద్రవ్యోల్బణం ముప్పు ఉన్నప్పటికీ భారత నివాస మార్కెట్ చెప్పుకోతగ్గ వృద్ధిని సాధించింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి అంతిమంగా వినియోగదారుల ఆర్థిక భద్రతకు దారితీసింది. సొంతిల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండడం, మౌలిక సదుపాయాల వృద్ధికి అదనపు తోడ్పాటును అందిస్తోందని, పట్టణాల్లో ప్రముఖ నివాస ప్రాంతాలకు ఇది అనుకూలమని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది. కరోనా తర్వాత ఇళ్లకు డిమాండ్ పెరిగినట్టు హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్‌రావు పేర్కొన్నారు. ‘‘ఇళ్ల ధరల పెరుగుదలకు కొన్ని అంశాలు దారితీశాయి. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, మెరుగైన వసతికి మారిపోవాలన్న ఆకాంక్ష, ఆధునిక వసతులతో కూడిన చక్కని ఇళ్లపై ఖర్చు చేసే ఆసక్తి ధరల పెరుగుదలకు అనుకూలించాయి. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదలలో ఇతర మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్ ముందుంది’’అని ప్రశాంత్ రావు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 19 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. ఇది ధరలకు మద్దతుగా నిలుస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం మేర పెరిగాయి. నివేదికలోని అంశాలు ► దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది. ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. ►అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. ►బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. ►చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. ►కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. ►పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది. సానుకూల సెంటిమెంట్ ‘‘2023లో ఇళ్ల కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. హౌసింగ్ రిజి్రస్టేషన్లు పెరగడంతో, అది పరోక్షంగా ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగడం పోటీతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిఫలిస్తోందని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ పేర్కొన్నారు. -
ఇళ్ల ధరలు కాదు... ఇళ్లే ఆకాశాన్ని అంటాయి!
‘ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి’ అంటుంటారు. ఈ ఆర్టిస్ట్ మాత్రం ‘ధరలు కాదు ఇళ్లే ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది!’ అనుకొని మాయజాలాన్ని సృష్టించాడు. మహా పట్టణాలు భవంతులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మాణాలతో నేల నిండిపోయింది. పైన ఆకాశం మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ‘ఫ్లోటింగ్ బిల్డింగ్స్’ ఏఐ ఆర్ట్ సిరీస్‌ను సృష్టించాడు. వీటికి ముంబై మహానగరాన్ని నేపథ్యంగా తీసుకొని ‘ముంబై సర్రియల్ ఎస్టేట్’ అనే కాప్షన్ ఇచ్చాడు. ‘మీరు సరదాకు ఇలా చేశారు గానీ ఆకాశం కూడా బిల్టింగ్లతో కిక్కిరిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’ అని భవిష్యవాణి చెప్పాడు ఒక నెటిజనుడు. -
ఇక ఇల్లు కొనడం కష్టమేనా? పోల్‌లో నిపుణుల అంచనాలు!
దేశంలో రానున్న రోజుల్లో మధ్య తరగతి వర్గాలు ఇల్లు కొనడం కష్టంగా మారొచ్చు. రాయిటర్స్ ప్రాపర్టీ అనలిస్ట్స్ పోల్ (Reuters poll of property analysts) ప్రకారం.. భారత్‌లో ఇల్లు కొనడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత క్షీణిస్తుంది. ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రాపర్టీ అనలిస్టులు ఇళ్ల ధరలు ఈ ఏడాది, వచ్చే సంవత్సరంలో సగటున 7 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పోల్‌లో ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే ఏడాది 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయగా ఈసారి ఆ అంచనాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఇళ్ల ధరలు తగ్గుముఖం పడతాయని లేదా స్తబ్దుగా అయినా ఉంటాయని వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అయితే భారత్‌లో మాత్రం గత మూడు సంవత్సరాలలో విపరీతమైన ప్రాపర్టీ కొనుగోళ్లు జరగలేదు. వార్షికంగా సగటున 2-3 శాతం మాత్రమే ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఇల్లు కొనేవారిపై ప్రభావం అనేక అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా హౌసింగ్ సప్లయిలో సవాళ్లు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా తక్కువ ధర ఇళ్ల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఇళ్ల డిమాండ్ ఎప్పుడూ సమస్య కానప్పటికీ సప్లయి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పోల్‌లో అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు స్పందిస్తూ మెజారిటీ మంది మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసే వారి స్థోమత రాబోయే సంవత్సరంలో మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. పెరగనున్న ఇంటి అద్దెలు ఇళ్ల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు స్థోమత తగ్గి చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఒక ప్రత్యేక ప్రశ్నకు స్పందిస్తూ పోల్‌లో పాల్గొన్నవారంతా ఇళ్ల అద్దెలు పెరుగుతాయని అంగీకరించారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుదల కారణంగా ఇళ్ల అద్దెల్లో గణనీయమైన పెరుగుదలను అంచనా వేశారు. -
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్‌హెచ్‌బీ నివేదిక వెల్లడించింది. -
షాకింగ్:హైదరాబాద్ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి. ► అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు జనవరి-మార్చి కాలంలో 16 శాతం పెరగ్గా, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 11వ త్రైమాసికంలోనూ నమోదైంది. చదరపు అడుగు ధర 16 శాతం వృద్ధి చెంది రూ.8,432కు చేరుకుంది. ► ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల ధరలు 59 శాతం మేర పెరిగాయి. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో 42 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. ►అహ్మదాబాద్ ప్రాంతంలో 11 శాతం వృద్ధి కనిపించింది. చదరపు అడుగు ధర రూ.6,324గా ఉంది. ►బెంగళూరులో చదరపు అడుగు ధర 14 శాతం పెరిగి రూ.8,748కి చేరుకుంది. చెన్నైలో చదరపు అడుగు ధర 4 శాతం వృద్ధితో రూ.7,395కు చేరింది. ► కోల్‌కతాలో 15 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,211గా ఉంది. ► పుణెలో 11 శాతం పెరిగి రూ.8,352గా నమోదైంది. ► ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో మాత్రం 2 శాతం తగ్గి చదరపు అడుగు ధర రూ.19,219గా నమోదైంది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) వృద్ధి కొనసాగుతుంది.. రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్ సర్వీసెస్ కు చెందిన అక్యుపయర్ సర్వీసెస్ ఎండీ పీయూష్ జైన్ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) -
హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్‌కతాలో 11 శాతం, అహ్మదాబాద్‌లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్‌హెచ్‌బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్–50లో అత్యధికంగా గాంధీనగర్‌లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఇదీ చదవండి: 1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
కళ్లు తిరిగేలా.. దేశంలో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: ఖరీదైన నివాస గృహాల ధరల పెరుగుదలలో అంతర్జాతీయంగా ముంబై నగరం 6వ స్థానంలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023 సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి సంబంధించి ఈ సంస్థ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ1, 2023’ను విడుదల చేసింది. ఈ కాలంలో ముంబైలో ఖరీదైన ఇళ్ల ధరలు 5.5 శాతం పెరిగాయి. అలాగే, బెంగళూరు, న్యూఢిల్లీలోనూ సగటున ధరలు పెరిగాయి. ఖరీదైన ఇళ్ల ధరల పెరుగుదల పరంగా 2022 మొదటి త్రైమాసికం జాబితాలో ముంబై 38వ ర్యాంకులో ఉండగా, ఏడాది తిరిగేసరికి 6వ స్థానానికి చేరుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గతేడాది ఇదే కాలంలో 37వ ర్యాంకులో ఉన్న బెంగళూరు తాజా జాబితాలో 16కు, న్యూఢిల్లీ 39 నుంచి 22వ ర్యాంకుకు చేరుకున్నాయి. ‘‘ముంబైలో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు 5.5 శాతం పెరగ్గా, బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరిగాయి. న్యూఢిల్లీలో ఈ పెరుగుదల 1.2 శాతంగా ఉంది’’అని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 46 పట్టణాల్లో ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరల పెరుగుదల ఆధారంగా వాటికి ర్యాంకులకు కేటాయిస్తుంటుంది. స్థానిక కరెన్సీలో సాధారణ ధరలను ప్రామాణికంగా తీసుకుంటుంది. ముంబైలో ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరగడమే సూచీలో మెరుగైన ర్యాంకుకు తీసుకెళ్లినట్టు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. ముంబై ఇళ్ల మార్కెట్లో అన్ని విభాగాల్లోనూ డిమాండ్ బలంగానే ఉందని, ఖరీదైన ఇళ్ల ధరలు ఎక్కువగా పెరిగినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా దుబాయిలో ఖరీదైన ఇళ్ల ధరలు 44.2 శాతం పెరగడంతో, ఈ నగరం మొదటి స్థానంలో నిలిచింది. చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా? -
ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ వెల్లడించింది. 2023–24లో 3–5 శాతం ధరలు దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తోంది. ముడి సరుకు వ్యయాలు, కూలీ, స్థలాల ధరలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. హైదరాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, బెంగళూరు, పుణే, కోల్‌కత నగరాల ఆధారంగా క్రిసిల్ రూపొందించిన నివేదిక ప్రకారం.. రెసిడెన్షియల్ విభాగంలో పెద్ద రియల్టర్లు 2022–23లో 25 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేయబోతున్నారు. అమ్మకం కాని ఇళ్ల స్థాయి 4 నుండి 2.5 సంవత్సరాలకు వచ్చి చేరింది. ఇది పెద్ద రియల్టర్ల క్రెడిట్ ప్రొఫైల్‌ను బలపరుస్తుంది. ఖరీదైన ఇళ్లకు డిమాండ్.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల్లో మహమ్మారి ముందు పెద్ద రియల్టర్ల వాటా 30 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 40–45 శాతం ఉండే అవకాశం ఉంది. పరిశ్రమలో పెద్ద రియల్టర్ల వాటా 2022–23లో 24 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి చేరనుంది. మహమ్మారి ముందు కాలంలో ఇది 14 శాతం నమోదైంది. 2020కి ముందు రూ.1.5 కోట్లు ఆపైన ఖరీదు చేసే ఇళ్ల వాటా 25–30 శాతం. ఇప్పుడు ఇది ఏకంగా 40–45 శాతానికి ఎగసింది. రూ.40 లక్షల లోపు ఉండే అందుబాటు ధరల గృహాల వాటా 30 నుంచి 10 శాతానికి పరిమితం అయింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద రియల్టర్లు వాటాల విక్రయం,ఆస్తుల అమ్మకం ద్వారా రూ.18,000 కోట్లు అందుకున్నారు. ఈ సంస్థల ఆస్తుల్లో అప్పుల నిష్పత్తి 2023 మార్చి నాటికి 23 శాతం, 2024 మార్చికల్లా 21 శాతంగా ఉండనుంది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
8 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు..ఎంతంటే?
కోవిడ్-19 కారణంగా ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఇంటి నిర్మాణ ఇన్ పుట్ కాస్ట్ ధరలు పెరగడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి సగటున ఇళ్ల ధరలు దాదాపు 5 శాతం పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఎనిమిది నగరాల్లోని ప్రైమరీ మార్కెట్లో రెసిడెన్షియల్ ధరలు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 6,600-రూ 6,800గా ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్ చివరి నాటికి రూ.6,300 - రూ 6,500గా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లోని కీలక మైట్రో మార్కెట్లలో ధరలు అధిక స్థాయిలో పెరిగాయని నివేదిక పేర్కొంది. ►రియల్ ఇన్సైట్ నివేదిక ప్రకారం, పూణే 2021 చివరినాటికి చదరపు అడుగుకు రూ. 5,100-రూ. 5,300 నుండి జూలై-సెప్టెంబర్ 2022లో చదరపు అడుగులకు రూ. 5,500-రూ. 5,700 (చదరపు అడుగులు) తో 7 శాతం పెరిగింది. ► హైదరాబాద్‌లో చదరపు అడుగుల 4శాతం పెరిగి రూ.5900 - 6,100 నుంచి రూ.6,100- రూ.6,300 వరకు పెరిగాయి. ►చెన్నైలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 5,400-రూ 5,600 నుండి రూ. 5,500-రూ 5,700 కి స్వల్పంగా 2 శాతం పెరిగాయి . ►బెంగళూరులో ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 5,900-రూ. 6,100కి చేరుకున్నాయి. ►ఢిల్లీ-ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ధరలు చదరపు అడుగుకు రూ.4,400 -రూ. 4,600 నుండి రూ. 4,700- రూ. 4,900కి 5 శాతం పెరిగాయి . ►గృహాల ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 6,100-రూ. 6,300కి చేరుకున్నాయి. ►కోల్‌కతాలో 3 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 4,400-రూ 4,600కి చేరుకుంది. ►ముంబైలో చదరపు అడుగు 3శాతం పెరిగి రూ. 9,900 రూ. 10,100కి చేరుకుంది. ►గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగస్టులో మొదటి ఎనిమిది నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ ఇన్వెంటరీ సగటు ధరలు 3-13 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
NAREDCO: రానున్న నెలల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు. ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు. బలంగా డిమాండ్.. పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..?
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.9,232గా ఉంది. ముంబై తర్వాత చదరపు అడుగు ధర అధికంగా ఉన్నది హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. అదే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య సగటున 11% పెరిగాయి. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లయసెస్ ఫొరాస్ నివేదిక రూపంలో వెల్లడించాయి. డిమాండ్ పెరగడానికితోడు, నిర్మాణరంగంలో వాడే ముడి సరు కుల ధరలకు రెక్కలు రావడం ఇళ్ల ధరలు ప్రియం కావడానికి కారణాలుగా నివేదిక తెలిపింది. ఢిల్లీలో అధికం.. ఢిల్లీ మార్కెట్లో ఇళ్ల ధరలు అంతకుముందు ఏడాది ఇదే మూడు నెలల కాలంతో పోలిస్తే (2021 జనవరి–మార్చి) అత్యధికంగా 11 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది. అహ్మదాబాద్‌లో ధరలు 8% పెరిగి చదరపు అడుగుకు రూ.5,721కి చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఇళ్ల ధరలు ఒక్క శాతమే వృద్ధిని చూశాయి. చదరపు అడుగు ధర బెంగళూరులో రూ.7,595, చెన్నైలో రూ.7,017గా ఉండగా, ముంబై ఎంఎంఆర్‌లో రూ. 19,557గా ఉంది. పుణె మార్కెట్లో ధరలు 3% పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,485గా ఉంది. ‘‘చాలా పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరిగింది. రెండేళ్లలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులే వార్షికంగా ధరలు పెరగడానికి దారితీశాయి. ఫలితంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు కరోనా ముందున్న స్థాయిని దాటేశాయి’’అని ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 4 శాతం ‘‘దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు జనవరి–మార్చి కాలంలో సగటున 4 శాతం పెరిగాయి. దీర్ఘకాలం పాటు మందగమన పరిస్థితుల నుంచి నివాసిత ఇళ్ల మార్కెట్ ఇంకా కోలుకోవాల్సి ఉంది’’అని క్రెడాయ్, కొలియర్స్ నివేదిక తెలియజేసింది. పూర్వపు స్థాయి కంటే ఎక్కువ 2022 జనవరి – మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందు నాటికంటే ఎక్కువగా ఉన్నట్టు లయసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. కొత్త సరఫరాతో ఇళ్ల యూనిట్ల లభ్యత పెరుగుతుందన్నారు. గృహ రుణాలపై ఇటీవల వడ్డీ రేట్లు పెరిగినా కానీ, ఇళ్ల విక్రయాలు కూడా వృద్ధిని చూపిస్తాయని చెప్పారు. రియల్టీకి మద్దతుగా నిలవాలి.. పెరిగిపోయిన నిర్మాణ వ్యయాలతో రియల్ ఎస్టేట్ రంగంలో గత 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడినట్టు క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్‡్షవర్ధన్ పటోడియా అన్నారు. స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం.. ముడి ఇనుము, స్టీల్ ఇంటర్మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం యూ షేప్‌లో రికవరీ అయ్యేందుకు మద్దతుగా నిలవాలి’ అని ఆయన కోరారు 5–10 శాతం పెరగొచ్చు.. వచ్చే 6–9 నెలల కాలంలో ఇళ్ల ధరలు మరో 5–10 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేశ్ నాయర్ అంచనా వేశారు. ‘‘భారత నివాస మార్కెట్ మంచి పనితీరు చూపించడం ఉత్సాహంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత మార్కెట్ అంచనాలను అధిగమిస్తోంది. విశ్వసనీయమైన సంస్థలు ఈ ఏడాది ఎక్కువ విక్రయాలు చూస్తాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారులు డెవలపర్ల మంచి పేరును కూడా చూస్తున్నారు’’ అని నాయర్ చెప్పారు. -
షాకింగ్,హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
కరోనా టైమ్‌లో ఇతర మెట్రోనగరాల కంటే హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు వేగంగా పుంజుకున్నాయి. కానీ ఓ వైపు ఆర్ధిక సంక్షోభం..మరోవైపు భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలతో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలు దారులు ఇళ్లను కొనుగోలుకు సుముఖంగా లేరు. దానికి తోడు హైదరాబాద్‌లో చదరపు అడుగు సరాసరీ రూ.6 వేల నుంచి రూ.6,200కు చేరడంతో రియల్ ఎస్టేట్‌లో క్రాష్ తప్పదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రియల్ఎస్టేట్ రారాజుగా వెలిగిన హైదరాబాద్‌లో ఇప్పుడు డౌన్ ఫాల్ మొదలైంది. కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్ టైగర్.కామ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7శాతం పెరిగినట్లు తెలిపింది. యావరేజ్‌గా రాజధానిలో చదరపు అడుగు సుమారు రూ.6వేలుగా ఉండగా.. ఈ ధరతో ఇండియాలో 8 ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. సేల్స్ పడిపోతున్నాయి హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోతున్నట్లు ప్రాప్‌టైగర్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 2022, 92శాతం సప్లయ్ పెరగ్గా..అమ్మకాలు 15శాతం పడిపోయినట్లు తెలిపింది. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా ఆ నివేదిక తెలిపింది. క్యూ1లో ఇలా 2022 ఏడాదికి మొదటి త్రైమాసికంలో హైదరాబాద్‌లో మొత్తం 14,572 ఇళ్లను నిర్మిస్తే అందులో అమ్ముడు పోయింది కేవలం 6,556 యూనిట్లేనని తెలిపింది. దీంతో చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాల (ఇన్వెంటరీ) సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. ఇక గడిచిన 42 నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 73,651యూనిట్లుగా ఉండగా.. 25 నెలల కాలంలో ఈ ట్రెండ్ మరింతగా పెరిగినట్టు ప్రాప్ టైగర్ పేర్కొంది. చదరపు అడుగు ఎంత దేశంలోని వివిధ నగరాల్లో చదరపు అడుగుకు విలువలను పరిశీలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ , స్టార్టప్, రియల్టీ బూమ్ ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న బెంగళూరులో కంటే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు రోజురోజుకీ పెరిపోతుండడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో చదరపు అడుగు ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో చదరపు అడుగు రూ.9,800 నుంచి రూ.10,000గా ఉంది హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.6వేల నుంచి రూ.6,200వరకు ఉంది చెన్నైలో చదరపు అడుగు రూ.5,700 నుంచి రూ.5,900గా ఉంది బెంగళూరులో చదరపు అడుగు రూ.5,600 నుంచి రూ.5,800గా ఉంది పూణేలో చదరపు అడుగు రూ.5,400 నుంచి రూ.5,600గా ఉంది ఢిల్లీ ఎన్ సీఆర్‌లో చదరపు అడుగు రూ.4,500 నుంచి రూ.4,700గా ఉంది కోల్ కతాలో చదరపు అడుగు రూ.4,300 నుంచి రూ.4,500గా ఉంది అహ్మదాబాద్‌లో చదరపు అడుగు రూ.3,500 నుంచి రూ.3,700గా ఉంది చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే! -
కొనుగోలుదారులకు భారీ షాక్!! పెరగనున్న ఇళ్ల ధరలు..రీజనేంటి?ఎవరికి దెబ్బ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు..కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
ఇళ్ల ధరలు: భారత్ ఎన్నో స్థానంలో అంటే..
న్యూఢిల్లీ: ఇళ్ల ధరల సూచీలో 55 దేశాలకు గాను భారత్ 54 వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్‌లో ఇళ్ల ధరలు 0.5 శాతం తగ్గినట్టు పేర్కొంది. ఈ ఏడాది (2021) మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ 55వ స్థానంలో ఉండడం గమనార్హం. టర్కీలో ఇళ్ల ధరలు 29.2 శాతం పెరగడంతో ర్యాంకుల్లో ఈ దేశం మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌లో ధరలు 25.9 శాతం వృద్ధి చెందడంతో రెండో స్థానంలోనూ, యూఎస్ మూడో స్థానంలో (ఇళ్ల ధరలు 18.6 శాతం పెరుగుదల) ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలను ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్’ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలను ప్రతీ త్రైమాసికానికి విడుదల చేస్తుంటుంది. 2021 రెండో త్రైమాసికంలో 18 దేశాల్లో ఇళ్ల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఇళ్ల ధరలు కేవలం భారత్, స్పెయిన్‌లో మాత్రమే తగ్గాయి. రానున్న త్రైమాసికాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ విశ్లేషించారు. చదవండి: ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
భారత్‌లో తగ్గిన ఇళ్ల ధరలు
దేశంలో గృహాల ధరలు పడిపోయాయి. గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో ధరలు 1.6 శాతం మేర క్షీణించాయి. వార్షిక ధరల వృద్ధి ప్రాతిపదికన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఇండియా 55వ స్థానంలో ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ రిపోర్ట్ ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ క్యూ1, 2021’ తెలిపింది. మొత్తం 56 దేశాలలోని గృహాల ధరల వృద్ధిని పరిశోధన చేయగా.. చిట్ట చివరి స్థానంలో 1.8 శాతం ధరల క్షీణతతో స్పెయిన్ నిలవగా.. దానికంటే ముందు ఇండియా నిలిచింది. గతేడాది జనవరి-మార్చిలో గ్లోబల్ ధరల సూచికలో ఇండియాది 43వ స్థానం. ఏడాదిలో 12 స్థానాలకు పడిపోయింది. కరోనా సెకండ్ వేవ్, కొత్త వేరియంట్ల ముప్పు, వ్యాక్సినేషన్లలో హెచ్చుతగ్గులతో విక్రయాలు, ధరల పెరుగుదలపై ఒత్తిడి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. ఈ ఏడాది క్యూ1లో దేశంలో గృహాల విక్రయాలలో రికవరీ కనిపిస్తుందని.. దీంతో ధరలు స్థిరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. 56 దేశాలలో ఈ ఏడాది క్యూ1లో నివాస ధరలు 7.3 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 32 శాతం ధరల వృద్ధితో టర్కీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 22.1 శాతం వృద్ధితో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 16.6 శాతం వృద్ధితో లక్సెంబర్గ్ మూడో స్థానంలో నిలిచాయి. 2005 నుంచి యూఎస్ అత్యధిక వార్షిక ధరల వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఏటా ఇక్కడ గృహాల ధరలలో 13.2 శాతం వృద్ధి నమోదవుతుంది. చదవండి: కోవిడ్ ఔషధాల ధరలు తగ్గేనా? -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్, చెన్నై నగరాలు మినహా దేశంలోని ఇతర మెట్రోలన్నింట్లోనూ గృహాల ధరలు క్షీణించాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 2021 జనవరి–మార్చి (క్యూ1)లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 5 శాతం, చెన్నైలో 8 శాతం మేర వృద్ధి చెందాయి. ఇదే కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభం కాగా.. 71,963 గృహాలు విక్రయం అయ్యాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా క్యూ1 నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ పన్ను రాయితీలు విక్రయాల వృద్ధికి కారణమని పేర్కొంది. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 9,349 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 7,170, క్యూ3లో 1,234, క్యూ2లో 1,420 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి 211 శాతం లాంచింగ్స్‌లో వృద్ధి నమోదయింది. అదేవిధంగా విక్రయాల గణాంకాలు చూ స్తే.. నగరంలో 2021 క్యూ1లో 6,909 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 3,651, క్యూ3లో 1,609, క్యూ2లో 974 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి సేల్స్‌లో 81 శాతం వృద్ధిని సాధించింది. లాంచింగ్స్, సేల్స్‌లో ముంబై టాప్.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ1లో 76,006 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధి. గతేడాది క్యూ4లో లాంచింగ్స్ 55,033, క్యూ3లో 31,106, క్యూ2లో 5,584 యూనిట్లుగా ఉన్నాయి. సేల్స్ చూస్తే.. 2021 క్యూ1లో 71,963 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 44 శాతం ఎక్కువ. 2020 క్యూ4లో 61,593 యూనిట్లు, క్యూ3లో 33,403, క్యూ2లో 9,632 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో గృహాల ప్రారంభం, విక్రయాలలో ముంబై, పుణే నగరాలు టాప్ స్థానంలో నిలిచాయి. ముంబైలో 31,515 యూనిట్లు లాంచింగ్ కాగా.. పుణేలో 18,042 యూనిట్లయ్యాయి. బెంగళూరులో 7,467, చెన్నైలో 2,981, అహ్మదాబాద్‌లో 3,977, ఎన్సీఆర్లో 1,626, కోల్‌కతాలో 1,439 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పైపైకి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరిలో ఇళ్ల ధరలు పైపైకి వెళ్తున్నాయి. 2013తో పోలిస్తే 26 శాతం ధర అధికమైందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. గతంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంటు బలహీనంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ ధరల్లో పెరుగుదల ఉందని తెలియజేసింది. ‘జనాభాతోపాటు ఐటీ, ఐటీ సర్వీసుల కంపెనీలకు హైదరాబాద్ కేంద్రం. నివాసయోగ్యం కూడా. మెగాసిటీగా త్వరితగతిన అవతరణ చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా నగరం వెలుపల అభివృద్ధి ఊపందుకుంది. ఈ ప్రయోజనాలను భాగ్యనగరి అందిపుచ్చుకుంది. విభిన్న మార్గాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడింది’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరీ వెల్లడించారు. ఏటా 5 శాతం వృద్ధి..: నివేదిక ప్రకారం 2012–17 కాలంలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో సగటు ధరలు ఏటా 5 శాతం పెరిగాయి. ఐటీలో ఉద్యోగాలు అధికం కావడంతో మార్కెట్ సెంటిమెంటు బలపడింది. దీని కారణంగా ప్రధానంగా వెస్ట్ జోన్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 2016తో పోలిస్తే 2017లో ఇళ్ల విక్రయాల్లో 21 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకానికి నోచుకోని (ఇన్వెంటరీ) ఇళ్ల సంఖ్య 2017 నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ విషయంలో దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరి ఉత్తమంగా ఉంది. 2016 రెండో త్రైమాసికంలో ఇన్వెంటరీ 35,560 యూనిట్లు నమోదైంది. 2017 వచ్చేసరికి ఇది 14 శాతం తగ్గింది. 2018 రెండో త్రైమాసికం వచ్చేసరికి మరో 13 శాతం తగ్గింది. 2016 తర్వాత గృహ అమ్మకాల్లో మంచి వృద్ధి సుస్పష్టంగా ఉంది. భారీ పెట్టుబడుల రాక, మౌలిక వసతులు మెరుగు పడడంతో హైదరాబాద్‌కు పునరుజ్జీవం వచ్చిందని నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2007-2013 మధ్య కాలంలో 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరగగా.. రెండు నగరాల్లో మాత్రం తగ్గాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొచ్చిలో 15 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నివాస స్థలాలు, ఇళ్ల ధరలు తగ్గాయని పేర్కొంది. చెన్నైలో అత్యధికంగా 230 శాతం, పూణేలో 123, ముంబైలో 122 శాతం పెరిగాయని పేర్కొంది. -
‘స్వగృహా’లకు కొత్త ధరలు
బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్ ప్రాజెక్టులకు భారీగా తగ్గింపు సాక్షి, హైదరాబాద్: స్వగృహ ఇళ్ల ధరలను భారీగా తగ్గించి విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. నగరంలోని బండ్లగూడ, పోచారం, జవహర్నగర్లలోని ఇళ్లకు కొత్త ధరలు ప్రతిపాదిస్తూ వివరాలను ప్రభుత్వానికి పంపింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫైలు ను పంపినప్పటికీ, అదే సమయంలో ఆయన రాజీనామా చేయటంతో దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో అదే ప్రతిపాదనను ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 21చోట్ల స్వగృహ ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ.. ప్రధాన నిర్మాణాలు పూర్తిస్థాయిలో సిద్ధమైంది ఈ మూడు చోట్లనే. వీటిల్లోనూ బండ్లగూడలో మాత్రమే కొంతవరకు మౌలిక వసతులు ఏర్పాటయ్యాయి. అందులో 600 ఇళ్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. బండ్లగూడ ప్రాజెక్టు లో గత డిసెంబర్ వరకు చదరపు అడుగు ధర రూ.2,350, పోచారంలో రూ.2,250, జవహర్‌నగర్‌లో రూ.2,000గా ఉండేది. కానీ, అప్పు తాలూకు వడ్డీని లెక్కిస్తే నష్టాలొస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం గత డిసెంబర్లో వీటి ధరలను భారీగా పెంచేసింది. బండ్లగూడలో ధరను రూ.2,950, పోచారం ధరను రూ.2,850 పేర్కొంటూ ప్రతికల్లో ప్రకటనలిచ్చింది. అసలే ఇళ్ల అమ్మకాలు జరగకుండా ఉన్న తరుణంలో ధరలను భారీగా పెంచటంతో ఒక్క ఇల్లు కూడా అమ్ముడవలేదు. దీంతో ధరలను తగ్గిస్తే తప్ప ఇళ్ల అమ్మకాలు సాధ్యం కాదని పేర్కొంటూ అధికారులు కొత్త ధరలను ప్రతిపాదించారు. దీని ప్రకారం బండ్లగూడలో చ.అ. ధరను రూ.2,000 పోచారంలో రూ.1,800, జవహర్ నగర్లో రూ.1,600గా పేర్కొం టూ ప్రతిపాదనలు పంపారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ తతంగం పూర్తి అయ్యే లోపే వీలైనన్ని ఇళ్లను అమ్మి వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలన్న ఆలోచనలో అధికారులున్నారు. -
ఇళ్ల ధరలకు కళ్లెం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బిల్డర్ల పట్ల కఠినంగా వ్యవహరిం చడం సామాన్యుడికి కొంతమేర మేలుచేసినట్టయింది. సీఎంగా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 2012తో పోలిస్తే 2013లో ఇళ్ల ధరలు మూడు శాతం మేర పెరిగాయి. అయితే చవాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పరిశీలిస్తే ప్రస్తుతం ఐదు నుంచి తొమ్మిది శాతం ఇళ్ల ధరలు తగ్గినట్లు తేలింది. ఇందుకు కారణం బిల్డర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ నియమనిబంధనల ప్రకా రం నడుచుకోవాలంటూ సీఎం ఆదేశించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నగరంలోని వర్లి, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాలు, ఠాణే, పన్వేల్ పరిసరాల్లో ఇళ్ల ధరలకు కళ్లెం పడింది. ‘నైంటినైన్ ఏకర్స్ డాట్ కామ్’ అనే సంస్థ రియల్ ఎస్టేట్ రంగంపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. చవాన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్మాణరంగానికి సంబంధించి పలు ఆంక్ష లు విధించారు. నియమనిబంధనల్లో పలు మార్పులు కూడా చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు బిల్డర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.