న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది.
పట్టణాల వారీగా..
►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది.
►ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది.
►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది.
►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది.
►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది.
►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది.
►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది.
►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది.
►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
Published Wed, Oct 5 2022 4:43 AM | Last Updated on Wed, Oct 5 2022 4:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment