Property consultancy company
-
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 7 శాతం అప్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో సగటున 7 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో ఇళ్ల ధరలు 7– 57 శాతం మధ్య పెరిగాయని.. అతి తక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ప్రకటించింది. హైదరాబాద్ మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,050కు పెరిగింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.6,580గా ఉంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ధరల పెరుగుదల 57 శాతంగా ఉంది. అక్కడ చదరపు అడుగు ధర రూ.8,017కు చేరింది. డిమాండ్ పెరగడమే ధరల వృద్ధికి కారణమని వివరించింది. ‘‘ఆర్బీఐ గడిచిన 10 పాలసీ సమీక్షల్లో రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించడం ధరలపై మరింత ఒత్తిడికి దారితీసింది. రేట్ల తగ్గింపు లేకపోవడంతో డెవలపర్లు రుణాలపై అధిక వడ్డీ చెల్లింపులు చేయాల్సి వచి్చంది. ఇది ఇళ్ల ధరల అందుబాటుపై ప్రభావం చూపించింది’’అని ప్రాప్‌టైగర్ నివేదిక తెలిపింది. ఇతర పట్టణాల్లో ధరల పెరుగుదల.. → బెంగళూరులో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగి చదరపు అడుగు రూ.7,512కు చేరింది. → చెన్నైలో 22 శాతం మేర ధరలు పెరిగాయి. చదరపు అడుగు రూ.7,179కు చేరుకుంది. → కోల్‌కతాలో ఇళ్ల ధరలు చదరపు అడుగు రూ.5,844కు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ధరతో పోల్చి చూస్తే 22 శాతం అధికం. → ముంబైలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.12,590గా నమోదైంది. → పుణెలో 18 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.6,953కు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ధరలు 21 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,736గా నమోదైంది. బలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతుండడం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బలాన్ని, వృద్ధి అవకాశాలను తెలియజేస్తున్నట్టు బీపీటీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) హరీందర్ దిల్లాన్ పేర్కొన్నారు. నాణ్యమైన ప్రాపరీ్టలకు అధిక డిమాండ్ నెలకొనడం ఢిల్లీ ఎన్సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో ధరల పెరుగుదల అధికంగా ఉండడానికి కారణమని చెప్పారు. దక్షిణాది మార్కెట్లలో కొత్త ఇళ్ల ప్రారం¿ోత్సవాలు తగ్గడం మార్కెట్లో దిద్దుబాటును సూచిస్తున్నట్టు బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేదీ తెలిపారు. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
CBRE India: ఆకర్షించేలా ఉంటేనే మాల్స్‌కి మనుగడ
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతరత్రా రిటైల్ స్టోర్స్.. కస్టమర్లను ఆకట్టుకునేలా విశిష్టమైన అనుభూతిని అందించగలిగితేనే మనుగడ సాగించగలవని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ సీబీఆర్ఈ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘భౌతిక రిటైల్ స్టోర్స్‌కి వెడితే బాగుంటుందని కోరుకునేలా ఉండాలే తప్ప .. ఏదో అవసరార్ధం వెళ్లక తప్పదనే విధంగా ఉండకూడదు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటేనే రిటైల్ స్టోర్స్ విజయవంతం కాగలవు‘ అని సంస్థ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టే కొద్దీ రిటైల్ స్టోర్స్, వినోద కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) రిటైల్ రంగం గణనీయంగా కోలుకుంది. మొత్తం మీద 2022 ప్రథమార్ధంలో (జనవరి–జూన్) 160 శాతం పైగా వృద్ధి (గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రంగంలో సంస్థలు కస్టమర్లకు భౌతికంగా అనుభూతిని ఎంత మేర మెరుగుపర్చగలమనే అంశంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. స్టోర్ ఫార్మాట్లు, పనితీరులో వైవిధ్యం పాటించడం, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు రూపొందించేందుకు డేటా సైన్స్‌ను ఉపయోగించుకోవడం, వ్యక్తిగతంగా మెరుగైన అనుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రాండ్లు తమ భౌతిక స్టోర్ల వ్యూహాలను సవరించుకుంటున్నాయని, ప్రత్యేక ’అనుభూతి’ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చంద్నానీ తెలిపారు. -
లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్
న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్‌పురి వెల్లడించారు. వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం ‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు. పట్టణాల వారీగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్‌లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐల ఆసక్తి ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్ ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది. -
బ్లాక్‌మనీ తగ్గింది
75–80 శాతం తగ్గిన నల్లధనం లావాదేవీలు ∙తుది వినియోగదారులతో గృహాలకు డిమాండ్: అనరాక్ కన్సల్టెన్సీ పెద్ద నోట్ల రద్దు అనే చెట్టు ఫలాలు చేతికొస్తున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత దేశీయ గృహ విభాగం గతుకుల రోడ్ల మీద ప్రయాణంలా మొదలై.. నేడు హైవే మీద దూసుకెళుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, విక్రయాలు పూర్తిగా తొలగిపోయాయి. దేశీయ గృహ విభాగంలో నల్లధనం లేదా నగదు లావాదేవీలు 75–80 శాతం మేర క్షీణించాయి. తుది వినియోగదారులతో గృహ విభాగంలో అసలు డిమాండ్ ఏర్పడింది. ఇంటిని ఎందుకు కొంటున్నాం.. ఎందుకు విక్రయిస్తున్నామనే ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకునేలా నోట్ల రద్దు మార్చేసింది. సాక్షి, హైదరాబాద్: దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అమల్లోకి వచ్చింది. రియల్టీ రంగాన్ని డీమానిటైజేషన్‌కు ముందు, తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్ల రద్దు తర్వాత కొత్త గృహాల ప్రారంభాలు క్షీణించగా.. విక్రయాలు పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. తొలి ఏడాది కాలం పాటు గందరగోళం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని రియల్టీ మార్కెట్ ప్రతికూలంలోకి వెళ్లిపోయింది. దీంతో గృహాల ప్రారంభాలు గణనీయంగా తగ్గిపోయాయి. డీమానిటైజేషన్‌కు ముందు ((2013 నుంచి 2016 మూడో త్రైమాసికం– క్యూ3) దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 16.15 లక్షల యూనిట్లు లాంచింగ్ కాగా.. డీమో తర్వాత (2016 క్యూ4 నుంచి 2021 క్యూ3) 9.04 లక్షల యూనిట్లకు తగ్గాయి. సుమారు 44 శాతం లాంచింగ్‌లు క్షీణించాయి. విక్రయాలలో వృద్ధి.. పెద్ద నోట్ల రద్దుకు ముందు 11.78 లక్షల గృహాలు అమ్ముడుపోగా.. నోట్ల రద్దు తర్వాత 10.37 లక్షల గృహాలు సేలయ్యాయి. తుది వినియోగదారుల కొనుగోళ్లతో ప్రధాన నగరాల్లో రియల్టీ మార్కెట్ బలపడింది. డీమానిటైజేషన్ తర్వాత లగ్జరీ మార్కెట్ కూడా కాసింత ప్రభావానికి లోనైనప్పటికీ.. కరోనా మహమ్మారితో సానుకూల డిమాండ్‌ను కొనసాగిస్తుంది. డెవలపర్లు సప్లయి, డిమాండ్లను నిశితంగా పరిశీలిస్తున్నారని.. విక్రయాలను బట్టి కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. సరఫరా కంటే విక్రయాలకు డిమాండ్ ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రీసేల్‌పై ఎక్కువ ప్రభావం.. ప్రాథమిక మార్కెట్ కంటే సెకండరీ, రీసేల్ ప్రాపర్టీలపై డీమానిటైజేషన్ ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. ఈ విభాగంలోని లగ్జరీ ప్రాపర్టీలు కూడా నగదు లావాదేవీలను ఎక్కువగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. డెవలపర్లు విక్రయించే అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాలకు (ప్రాథమిక ప్రాపర్టీలు) డిమాండ్ పెరిగింది. అయితే దేశీయ రియల్టీ మార్కెట్లో నల్లధన లావాదేవీలు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. కాకపోతే గతంలో మాదిరిగా కాకుండా చాలా మంది తుది వినియోగదారులు ఆస్తి లావాదేవీలను పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న పట్టణాలు, పెరీ అర్బన్ ఏరియాలలో నేటికీ నల్లధన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ గృహాలకు డిమాండ్.. పెద్ద నోట్ల తర్వాత బ్రాండెడ్, లిస్టెడ్ రియల్టీ కంపెనీలు గృహ విక్రయాలపై మెజారీటీ వాటాను కైవసం చేసుకున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లో నల్లధన లావాదేవీలు క్షీణించాయి. మరోవైపు డీమానిటైజేషన్, రెరా, జీఎస్టీ తర్వాత గృహ కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలపర్ల ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో లగ్జరీ ప్రాపర్టీలపై దృష్టి పెట్టిన డెవలపర్లు.. ప్రస్తుతం అఫర్డబుల్, మధ్యస్థాయి గృహాల వైపు దృష్టిని మళ్లించారు. దీంతో ఈ తరహా గృహాల సప్లయి కంటే డిమాండ్ పెరిగింది. దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో 2017 ఆర్థిక సంవత్సరంలోని ప్రాపర్టీ విక్రయాలలో లిస్టెడ్ డెవలపర్ల విక్రయాల వాటా 6 శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ నాటికి 22 శాతానికి పెరిగింది. అలాగే ప్రముఖ నాన్ లిస్టెడ్ డెవలపర్ల వాటా 11 శాతం నుంచి 18 శాతానికి వృద్ధి చెందింది. -
కోలుకునేది రెండేళ్ల తర్వాతే
సాక్షి, హైదరాబాద్: దేశీయ నివాస విభాగం 2023లో తారా స్థాయికి చేరుకుంటుంది. 3.17 లక్షల గృహాల విక్రయాలు, 2.62 లక్షల లాంచింగ్స్ జరుగుతాయి. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 1.8 లక్షలకు చేరుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటం, స్టాక్ మార్కెట్ వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలు వంటివి ఈ వృద్ధికి కారణాలని తెలిపింది. కొనుగోలుదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, సాంకేతికత, డిజిటల్ మార్కెటింగ్, వినూత్న వ్యాపార పద్ధతులు దేశీయ నివాస రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో గతేడాది 1,38,344 యూనిట్లు విక్రయమయ్యాయని.. ఈ ఏడాది 1,79,527లకు పెరుగుతాయి. డిమాండ్ మాత్రం కరోనా పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. 2019లో అమ్మకాలు 2,61,358 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 2,64,625 యూనిట్లు, 2023లో 3,17,550 గృహాలు విక్రయం అవుతాయని అంచనా వేసింది. 2017 నుంచి వృద్ధి.. నివాస విభాగం 2017 నుంచి ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2019 నాటికి తారా స్థాయికి చేరింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020లో డీలా పడింది. గతేడాది రెండో అర్ధ భాగం నుంచి కాస్త మెరుగైన ప్రతిభను కనబర్చినప్పటికీ ఆశించిన స్థాయికి చేరలేదు. 2020లో గృహాల విక్రయాలు 1.38 లక్షలు, లాంచింగ్స్ 1.28 లక్షలకు తగ్గాయి. ఈ ఏడాది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గృహాల సప్లయ్ 35 శాతం, విక్రయాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. 2019తో పోలిస్తే మాత్రం సప్లయ్ 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సప్లయ్ కంటే సేల్స్ ఎక్కువ.. వ్యాక్సినేషన్ వేగవంతం కావటంతో 2023 నాటికి రియల్టీ మార్కెట్ పీక్ దశకు చేరుతుంది. 2019తో పోలిస్తే విక్రయాలలో 22 శాతం, సప్లయ్‌లో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2014–16లో గృహాల సప్లయ్ 11,85,000 ఉండగా.. విక్రయాలు 8,90,500లుగా ఉన్నాయి. సేల్స్/సప్లయ్ నిష్పత్తి 0.75 శాతంగా ఉంది. అదే 2017–19 నాటికి సప్లయ్ 5,78,,700 ఉండగా.. అమ్మకాలు 7,20,800లకు పెరిగాయి. నిష్పత్తి 1.25 శాతానికి వృద్ధి చెందింది. నగరంలో సేల్స్ 6 శాతం.. 2023లో జరిగే సేల్స్, లాంచింగ్స్ రెండింట్లోనూ ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో ఉంటాయి. ముంబై సేల్స్‌లో 28 శాతం, లాంచింగ్స్‌లో 30 శాతం వాటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు అమ్మకాలలో 20 శాతం, ప్రారంభాలలో 17 శాతం, ఎన్సీఆర్ వరుసగా 18 శాతం, 15 శాతం, పుణే 15 శాతం, 18 శాతం, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాలు విక్రయాలలో 6 శాతం, లాంచింగ్స్‌లో 8 శాతం వాటాలను సొంతం చేసుకుంటాయి. -
రియల్టీలో పెట్టుబడుల సునామీ, రూ.36,500 కోట్లకు..
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్) ఈ ఏడాది 4 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36,500 కోట్లు)గా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఇండియా అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో సంస్థాగత పెట్టుబడిదారులు 4.8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2020 మొదటి ఆరు నెలల్లో వచ్చిన గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు కొల్లియర్స్ ఇండియా తెలిపింది. కార్యాలయ సముదాయాలపై ఇన్వెస్ట్ చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 35 శాతం పెట్టుబడులు కార్యాలయ వసతుల ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. అలాగే, పారిశ్రామిక, గోదాముల విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 775 మిలియన్ డాలర్లు (రూ.5,657 కోట్ల)గా ఉన్నాయి’’ అని కొల్లియర్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకర్షణీయమైన విలువలకే ఆస్తులను సొంతం చేసుకునే ఆలోచనతో ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు కేవలం 4 శాతంగానే ఉన్నాయని పేర్కొంది. లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబ్‌లు, డేటా కేంద్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉండొచ్చని అంచనా వేసింది. చదవండి: మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుణే, బెంగళూరులో ఈ ఏడాది జూలై–సెప్టెంబరు కాలంలో కొత్తగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 54 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. గతేడాది ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 50% తక్కువ. కరోనా నేపథ్యంలో కార్పొరేట్స్, కో–వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల వాయిదాతోపాటు వర్క్ ఫ్రమ్ హోం విధానమూ ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64% వృద్ధి సాధించింది. ఈ 7 నగరాల్లో 2019 జనవరి–సెప్టెంబరులో పలు కంపెనీలు కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం 3.27 కోట్ల చదరపు అడుగులు. ఈ ఏడాది ఇది 47% తగ్గి 1.73 కోట్ల చదరపు అడుగులకు చేరింది. నగరాల వారీగా ఇలా..: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం విషయంలో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఈ నగరంలో 27.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ పోటీపడుతోంది. ఇక్కడ 15.4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను కంపెనీలు దక్కించుకున్నాయి. పుణేలో 4.6 లక్షలు, ముంబై 2.8 లక్షలు, చెన్నై 2.1 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 2 లక్షలు, కోల్‌కతాలో 20 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన 6 నగరాల్లో స్థిరంగా ఉన్నట్టు జేఎల్ఎల్ వెల్లడించింది. -
బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ క్రయవిక్రయాలు టాప్ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జూలై – డిసెంబర్ (హెచ్2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా.. హైదరాబాద్‌లో 89 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఏడాది మొత్తంగా చూస్తే 1.28 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన 12వ నివేదికలో తెలియజేసింది. ఇతర నగరాల్లో లావాదేవీలు చూస్తే.. ముంబైలో 51 లక్షల చ.అ., ఎన్సీఆర్లో 48 లక్షలు, పుణేలో 24 లక్షలు, అహ్మదాబాద్‌లో 10 లక్షలు, చెన్నైలో 34 లక్షలు, కోల్‌కతాలో 7 లక్షల చ.అ. మేర నమోదయ్యాయి. మంగళవారమిక్కడ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ నైట్‌ఫ్రాంక్ ఇండియా రియల్ ఎస్టేట్ రెండో అర్ధ సంవత్సర నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. జూలై – డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 8,065 గృహాలు ప్రారంభం కాగా.. 7,933 గృహాలు విక్రయమయ్యాయి. హెచ్1లో ప్రారంభాలు 5,430 కాగా.. అమ్మకాలు 8,334లుగా ఉన్నాయి. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఆరంభమయ్యాయి. రూ.80– కోటి రూపాయల ధర ఉండే ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కోటిన్నర పైన ధర ఉండే గృహాల్లో 17 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన గృహాలు (ఇన్వెంటరీ) 39 శాతం క్షీణించి 4,397 యూనిట్లుగా ఉన్నాయి. 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్.. హైదరాబాద్ కార్యాలయ స్థలాల లావాదేవీల్లో ఐటీ రంగానిదే హవా. 2018 హెచ్2లో మొత్తం లావాదేవీల్లో ఐటీ స్పేస్ వాటా 44 శాతంగా ఉండగా.. 2019 హెచ్2 నాటికి 58 శాతానికి పెరిగింది. గతేడాది హెచ్2లో నగరంలో 13.6 లక్షల చ.అ. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ ధరలు చ.అ.కు రూ.61గా ఉండగా... ఏడాదిలో 5 శాతం వృద్ధి కనిపించింది. దేశవ్యాప్తంగా..: దేశవ్యాప్తంగా హెచ్2లో 1,12,150 గృహాలు ప్రారంభం కాగా.. 1,16,576 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇన్వెంటరీ 5% క్షీణించి 4,45,836 యూనిట్లకు పరిమితమయింది. ఆఫీస్ స్పేస్‌లో 3.32 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. -
పట్టాలెక్కిన రియల్టీ
దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, వస్తు సేవల పన్నులతో రియల్టీలో పారదర్శకతతో పాటు సానుకూల వాతావరణం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, అమ్మకాల్లోనే కాదు.. పాత ప్రాజెక్ట్‌ల్లోని ఇన్వెంటరీ కూడా క్రమంగా తగ్గుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో కొత్త గృహాల ప్రారంభాలు 50 శాతం, అమ్మకాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది. ఆకర్షణీయమైన పథకాలు, రాయితీలతో కొన్నేళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ కూడా తగ్గుతుంది. ఈ ఏడాది క్యూ1లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతం తగ్గుదలతో 7 లక్షలకు చేరాయి. 50,100 కొత్త గృహాలు ప్రారంభం.. ఏడు ప్రధాన నగరాల్లో క్యూ2లో 50,100 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. క్యూ1లో ఇవి 33,400 యూనిట్లుగా ఉన్నాయి. క్యూ2లో ప్రారంభమైన కొత్త యూనిట్లలో 75 శాతం గృహాలు ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే నగరాల్లోనే ఉన్నాయి. నగరాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. పుణేలో క్యూ1లో 214 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 6,900 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఎన్సీఆర్లో క్యూ1లో 4,500 యూనిట్ల నుంచి క్యూ2లో 8,500 యూనిట్లు, ముంబైలో 8,600 గృహాల నుంచి 13,600 గృహాలు, బెంగళూరులో 6,850 యూనిట్ల నుంచి 8,800 యూనిట్లు, చెన్నైలో 2,100 యూనిట్ల నుంచి 4,200 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలో మాత్రం క్యూ1లో 6,500 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 61 శాతం తగ్గుదలతో కేవలం 2,550 యూనిట్లకు పరిమితమయ్యాయి. 60,800 గృహాల విక్రయం.. నిజమైన గృహ కొనుగోలుదారులు మార్కెట్ వైపు అడుగులు పెడుతున్నారని, పెట్టుబడిదారులు సరైన ప్రాంతం కోసం అన్వేషణ సాగిస్తుండటంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడు ప్రధాన నగరాల్లో క్యూ1లో 49 వేల యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికివి 24 శాతం వృద్ధితో 60,800 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తం విక్రయాల్లో 81 శాతం ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లోనే జరిగాయి. నగరాల వారీగా విక్రయ గణాంకాలను పరిశీలిస్తే.. ఎన్సీఆర్లో క్యూ1లో 9,100 యూనిట్లు విక్రయం కాగా క్యూ2లో 11,150 అయ్యాయి. ముంబైలో 12,050 నుంచి 15,200, బెంగళూరులో 11,500 నుంచి 14,600, పుణేలో 6,800 నుంచి 8,400, చెన్నైలో 2,320 నుంచి 2,700, కోల్‌కతాలో క్యూ1లో 3,420 యూనిట్లు అమ్ముడుపోగా క్యూ2లో 4 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. 46 శాతం అందుబాటు గృహాలే.. కొత్త గృహాల ప్రారంభాల్లోనైనా, అమ్మ కాల్లోనైనా సరే అఫోర్డబుల్, మిడ్ రేంజ్ గృహాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. క్యూ2లో 50,100 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 38,600 గృహాలు ఈ కేటగిరీలోనివే. ఇందులోనూ రూ.40 లక్షల లోపు ధర ఉన్న గృహాలు 46 శాతం వరకున్నాయి. అఫోర్డబుల్ హౌస్ విభాగానికి మౌలిక రంగ హోదాతో ఆయా గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆసక్తి చూపిస్తుంటే.. ఎంఐజీ–1, ఎంఐజీ–2 తరగతులకు వడ్డీ రాయితీలతో అమ్మకాలూబాగున్నాయి. – అనూజ్ పురీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ నగరంలో జోరు.. క్యూ2లో హైదరాబాద్‌లో గృహాల ప్రారంభాలు, అమ్మకాలు రెండింట్లోనూ వృద్ధి నమోదైంది. క్యూ1లో 2,650 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. క్యూ2లో 109 శాతం వృద్ధి రేటుతో 5,550 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇక, అమ్మకాల్లో క్యూ1లో 3,800 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 25 శాతం వృద్ధితో 4,750 యూనిట్లు విక్రయమయ్యాయి. నగరం లో గిడ్డంగి, వాణిజ్య, కార్యాలయాల మార్కెట్లు జోరందుకోవటంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో రైల్ అందుబాటులోకి రావటంతో నగరం నలువైపులా గృహాల కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో క్యూ1 నుంచి క్యూ2 నాటికి చెన్నై, కోల్‌కతాల్లో మినహా ఇతర అన్ని నగరాల్లోనూ ధరలు 1 శాతం మేర పెరిగాయి. -
10 రెట్లు పెరగనున్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆన్ైలైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు దాదాపు 10 రెట్లు పెరగనున్నాయి. గతేడాది 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి 14 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో గతేడాది ఉన్న 59.8 బిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి రెట్టింపు సంఖ్యతో 127.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని నైట్ ఫ్రాంక్ తన ‘థింక్ ఇండియా- థింక్ రిటైల్’ అనే నివేదికలో పేర్కొంది. అలాగే గతేడాది 2 శాతంగా ఉన్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ వాటా 2019 నాటికి 5 రెట్లు పెరిగి 11 శాతానికి చేరుతుందని తెలిపింది. ఇదే సమయంలో సాంప్రదాయక కిరాణ షాపుల మార్కెట్ వాటా మాత్రం 17 శాతం నుంచి 13 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. గత దశాబ్ద కాలం నుంచి వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు రావటంతో షాపింగ్ అనే భావనలో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు. ఊహించని వృద్ధి కారణంగా రిటైల్ మార్కెట్ స్టాక్ హోల్డర్లను, పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.