Knight Frank India
-
ఆ రంగంలో హైదరాబాద్ టాప్: ఆ తరువాతే అన్నీ..
భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. -
రికార్డు స్థాయిలో ఇళ్ల అమ్మకాలు, ఆఫీస్ లావాదేవీలు
దేశంలో ఈ ఏడాది ప్రథమార్థంలో ఇళ్ల అక్మకాలు, ఆఫీస్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ప్రకారం.. 2024 ప్రథమార్థంలో (హెచ్ 1) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ మార్కెట్ లావాదేవీలు రికార్డు స్థాయిలో 33 శాతం వార్షిక వృద్ధితో 34.7 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్థంలో ఇవి 26.1 మిలియన్ చదరపు అడుగులు ఉండేవి.2024 జనవరి నుంచి జూన్ వరకు ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస, కార్యాలయ మార్కెట్ పనితీరును విశ్లేషించిన ఈ నివేదిక 8.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలతో బెంగళూరు అతిపెద్ద కార్యాలయ మార్కెట్‌గా నిలిచిందని, ఇది దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ పరిమాణ లావాదేవీల్లో 26 శాతం అని వెల్లడించింది.ముంబై (5.8 మిలియన్ చదరపు అడుగులు), ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (5.7 మిలియన్ చదరపు అడుగులు), హైదరాబాద్ (5.0 మిలియన్ చదరపు అడుగులు) మార్కెట్లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి పరంగా చూస్తే అహ్మదాబాద్‌లో అత్యధికంగా 218 శాతం వృద్ధి నమోదైంది. గ్రేడ్-ఎ స్థలం తీవ్రమైన పరిమితి కారణంగా లావాదేవీ పరిమాణాలలో తగ్గుదల చూసిన ఏకైక మార్కెట్ చెన్నై.రెసిడెన్షియల్ విక్రయాలు 2024 ప్రథమార్థంలో మొత్తం 1,73,241 యూనిట్ల అమ్మకాలతో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాల పరిమాణాలు 11 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2024 హెచ్1లో అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ముంబైలో అత్యధికంగా 47,259 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వృద్ధి పరంగా చూస్తే కోల్‌కతాలో అత్యధికంగా 25 శాతం, హైదరాబాద్ 21 శాతం (18,573 యూనిట్లు) విక్రయాలు జరిగాయి. -
Wealth Report 2024: సంపన్నుల సంఖ్య పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు మరింతగా విస్తరిస్తున్నారు. గతేడాది (2023) అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/) సంఖ్య 6 శాతం పెరిగి 13,263కు చేరుకుంది. అంతేకాదు, 2028 నాటికి వీరి సంఖ్య 20,000కు పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను యూహెచ్ఎన్డబ్ల్యూఐ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుంది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2022 చివరికి దేశంలో సంపన్నుల సంఖ్య 12,495గా ఉన్నట్టు తెలిపింది. 2028 నాటికి 19,908కి వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భా రత్ సంపద సృష్టి, అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. సంపన్నుల జనాభా గణనీయంగా పెరగడం, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య మరో 50 శాతం వృద్ధి చెందడం దీనికి సూచిక’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. 2024 సానుకూలం.. తమ సంపద 2024లో వృద్ధి చెందుతుందని 90 శాతం మంది సంపన్నులు అంచనా వేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం మీద 63 శాతం మంది అయితే, తమ సంపద 10 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు (అన్నిరకాల విభాగాలు) మొత్తం మీద 5 శాతం పెరిగాయి. 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి. మధ్యస్థ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు నెలకొన్న డిమాండ్ అమ్మకాల్లో వృద్ధికి దారి తీసింది. అయితే రూ.50 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు (అందుబాటు ధరల) అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గాయి. 97,983 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైంది. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం వృద్ధిని చూశాయి. అమ్మకాల గణాంకాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ► ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణెలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి. ► చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► కోల్‌కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఖరీదైన ఇళ్లకు ఆదరణ ఇళ్ల విక్రయాల పరంగా 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశ బలమైన ఆర్థిక మూలాల నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లలో నమ్మకం నెలకొంటోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొంత ఒత్తిడి నెలకొంది. ఇది విక్రయాల్లో ప్రతిఫలిస్తోంది. –ఎండీ శిశిర్‌బైజాల్ ,నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ బలమైన పనితీరు వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశి్చతులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి ఆరంభ సవాళ్లు గతేడాది ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ పనితీరు చూపించింది. కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్ అసాధారణ స్థాయికి చేరుకుంది. 2023 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ నిలిపివేయడం కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోలుదారుల్లో సానుకూల ధోరణితో మధ్యస్థ ప్రీమియం, ఖరీదైన ఇళ్లకు బలమైన డిమాండ్‌ను తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో బడ్జెట్ ఇళ్ల (అఫర్డబుల్) విభాగం సవాళ్లను ఎదుర్కొంటోంది. –వికాస్ వాధ్వాన్, ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌కు హైదరాబాద్ ప్రముఖ మార్కెట్‌గా వృద్ధి చెందుతోంది. 2023 సంవత్సరానికి ఇళ్ల అమ్మకాల పరంగా దేశంలో హైదరాబాద్ రెండో అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరిగాయి. 2022లో హైదరాబాద్‌లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. 2023 చివరి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నూతన ఇళ్ల సరఫరా 2023లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు సరఫరాలోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. ఈ వివరాలను ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాలకు సంబంధించిన వివరాలతో వార్షిక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 33% వృద్ధి నమోదైంది. -
రియల్ఎస్టేట్ కింగ్ హైదరాబాద్! రికార్డ్‌స్థాయిలో అమ్ముడుపోయిన ఇళ్లు
రియల్ఎస్టేట్లో హైదరాబాద్ సత్తా చాటింది. గతేడాది నగరంలో ఇళ్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడైంది. ఆల్‌టైమ్ హై నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో హైదరాబాద్‌లో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 6 శాతం పెరిగాయి. ఇక హౌసింగ్ యూనిట్ల ప్రారంభంలోనూ కొత్త రికార్డును నెలకొల్పుతూ, నగరంలో రెసిడెన్షియల్ లాంచ్‌లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. గృహ కొనుగోలుదారులు జీవనశైలి అప్‌గ్రేడ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలు అధికంగా ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక ఇళ్ల బలమైన డిమాండ్-సరఫరా, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత పెరగడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఖరీదువారీగా చూస్తే.. రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి. రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి క్షీణించాయి. ఈ ధర విభాగంలో 2023లో దాదాపు 13,120 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లో 13,784 యూనిట్లతో పోల్చితే 5 శాతం తగ్గాయి. భారీగా పెరిగిన ధరలు నగరంలో ఇళ్ల ధరలు 2023లో భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్ ఫలితంగా ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల నమోదైంది. నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ప్రాంతాలవారీగా తీసుకుంటే వెస్ట్ రీజియన్‌లోని కోకాపేటలో అత్యధికంగా 39 శాతం పెరుగుదల ఉంది. 28 శాతం పెరుగుదలతో మణికొండ ఆ తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా నార్త్ రీజియన్‌లోని సైనిక్‌పురిలో 2 శాతం ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఆఫీస్ మార్కట్లోనూ.. ఆఫీస్ మార్కట్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో 52 శాతం, 4.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. నగరంలో 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లావాదేవీల జరగ్గా 2023 సంవత్సరంలో 8.8 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సాక్షన్లు నమోదు చేసింది. మరో వైపు నగరంలో 6.5 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్‌ల సరఫరా నమోదైంది. -
5.9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇళ్ల ధరల పెరుగుదలలో భారత్ 14వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల ధరలు 5.9 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల సూచీలో భారత్ 18 స్థానాలు ముందుకు వచి్చంది. నైట్‌ఫ్రాంక్‌కు చెందిన గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ 56 దేశాల్లో స్థానిక కరెన్సీలో ఇళ్ల ధరల చలనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వార్షికంగా అత్యధికంగా తుర్కియేలో 89.2 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. ఆ తర్వాత క్రొయేíÙయాలో 13.7 శాతం, గ్రీస్‌లో 11.9 శాతం, కొలంబియాలో 11.2 శాతం, నార్త్ మెసడోనియాలో 11 శాతం చొప్పున పెరిగాయి. ‘‘అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంక్‌లు అధిక వడ్డీ రేట్లతో ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సగటున ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా 3.5 శాతంగా ఉంది. కరోనా ముందు పదేళ్ల వార్షిక సగటు పెరుగుదల 3.7 శాతానికి సమీపానికి చేరుకుంది’’అని నైట్‌ఫ్రాంక్ తన తాజా నివేదికలో వివరించింది. నైట్‌ఫ్రాంక్ పరిశీలనలోని 56 దేశాలకు గాను 35 దేశాల్లో ఇళ్ల ధరలు గడిచిన ఏడాది కాలంలో పెరగ్గా, 21 దేశాల్లో తగ్గాయి. చెప్పుకోతగ్గ వృద్ధి ‘‘గృహ రుణాలపై అధిక రేట్లు, ద్రవ్యోల్బణం ముప్పు ఉన్నప్పటికీ భారత నివాస మార్కెట్ చెప్పుకోతగ్గ వృద్ధిని సాధించింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి అంతిమంగా వినియోగదారుల ఆర్థిక భద్రతకు దారితీసింది. సొంతిల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. పట్టణీకరణ పెరుగుతుండడం, మౌలిక సదుపాయాల వృద్ధికి అదనపు తోడ్పాటును అందిస్తోందని, పట్టణాల్లో ప్రముఖ నివాస ప్రాంతాలకు ఇది అనుకూలమని నైట్‌ఫ్రాంక్ పేర్కొంది. కరోనా తర్వాత ఇళ్లకు డిమాండ్ పెరిగినట్టు హైదరాబాద్‌కు చెందిన రియల్టీ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ ఎండీ ప్రశాంత్‌రావు పేర్కొన్నారు. ‘‘ఇళ్ల ధరల పెరుగుదలకు కొన్ని అంశాలు దారితీశాయి. గతంలో నిలిచిన డిమాండ్ తోడు కావడం, మెరుగైన వసతికి మారిపోవాలన్న ఆకాంక్ష, ఆధునిక వసతులతో కూడిన చక్కని ఇళ్లపై ఖర్చు చేసే ఆసక్తి ధరల పెరుగుదలకు అనుకూలించాయి. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదలలో ఇతర మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్ ముందుంది’’అని ప్రశాంత్ రావు తెలిపారు. -
రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ పరిశ్రమ పెద్ద ఆదాయ వనరుగా మారింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఈ పరిశ్రమ నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు తదితర రూపంలో ప్రభుత్వాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వాటా 5.4 శాతంగా ఉంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’తో కలసి రియల్ ఎస్టేట్ కౌన్సిల్ ‘నరెడ్కో’ విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 12 రెట్లు పెరిగి 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 477 బిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి దేశ జీడీపీలో 15 శాతం వాటాను సమకూరుస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ వాటా జీడీపీలో 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 33–40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. నివాస మార్కెట్ 3.5 ట్రిలియన్ డాలర్లు నివాస గృహాల మార్కెట్ పరిమాణం గత ఆర్థిక సంవత్సరం నాటికి 299 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు.. వేర్ హౌసింగ్ మార్కెట్ సైజు 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేసింది. -
అంబానీ.. అదానీ ఓకే.. మరి మనం?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా.. అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్. చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ -
దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి?
ఫోర్బ్స్ ఇండియా -2023 నివేదిక ప్రకారం..భారత్‌లో మొత్తం 169 మంది (ఏప్రిల్ 5 నాటికి) బిలియనీర్లు ఉన్నారు. వారి వద్ద 675 బిలియన్ల డాలర్ల ధనం ఉంది. అయితే వారితో సమానంగా మేం కూడా ధనవంతులమే అని నిరూపించుకోవాలంటే సామాన్యుల వద్ద ఎంత డబ్బు ఉండాలి? అసలు ఎంత డబ్బు ఉంటే ధనవంతులని పరిగణలోకి తీసుకుంటారు? అని ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అవును! ప్రపంచంలోని 25 దేశాల్లో ఆయా దేశాల్ని బట్టి ధనవంతుల సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. మరి మన దేశంలో మొత్తం కాకపోయినా కనీసం 1 శాతం ధనవంతుల్లో మనమూ ఒకరిగా పేరు సంపాదించాలంటే మన వద్ద కనీసం రూ.1.44 కోట్లు ఉండాలి. ఆ మొత్తం ఉంటే ఆ ఒక్క శాతం కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా - 2023 రూపొందించిన తాజా నివేదికలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్ (uhnwi) ఈ విషయాన్ని వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ధనవంతుల జాబితా దేశాల్లో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, కెన్యాలు సైతం ఉండగా.. భారత్ 22వ స్థానం దక్కించుకుంది. ►ప్రపంచంలోనే అత్యంత సంపన్నులున్న మొనాకో 25 దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ఆ దేశంలో 12.4 మిలియన్లు (రూ.102 కోట్లు) ఉంటే ఒక్క శాతం ధనవంతుల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించవచ్చు. ►ఇక, స్విట్జర్లాండ్‌లో 6.6 మిలియన్లు, సింగపూర్‌లో 3.5 మిలియన్లు, హాంగ్ కాంగ్లో 3.4 మిలియన్లు ఉండాలి ►మిడిల్ ఈస్ట్ దేశాలైన బ్రెజిల్ 1.6మిలియన్లు, లాటిన్ అమెరికాలో 430,000 డాలర్లు ఉండాలి. ► అల్ట్రా హై నెట్ వర్త్ జాబితాలో భారత్‌లో 30 మిలియన్ల నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో 58.4 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ (పార్ట్ 1, 2) ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు. కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్–30 కోసం నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్కతా పార్క్ స్ట్రీట్ అండ్ కామెక్ స్ట్రీట్ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, చర్చి రోడ్ టాప్ 10లో ఉన్నాయి. వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ వసతులకు సంబంధించినది. ఈ టాప్–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. -
వామ్మో! ఇళ్లకి హైదరాబాద్‌లో ఇంత డిమాండా? కళ్లు చెదిరే సేల్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ జోరుగా హుషారుగా కొనసాగుతోంది. మార్చిలో నమోదైన రూ.3,352 కోట్ల విలువైన ఇళ్ల కొనుగోలు డీల్స్ ఈ జోష్‌కు అద్దం పడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) నివేదిక ప్రకారం హైదరాబాద్, మేడ్చెల్ మల్కజ్గిరీ, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలు ఎంతైనా సరే.. తగ్గేదేలే అన్నట్టు కొనుగోలుకు ఎగబడుతున్నారు జనం. క్క మార్చి నెలలోనే 6,414 అపార్ట్మెంట్లు బుకింగ్స్ జరిగాయంటేనే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రితం నెలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఆర్బీఐ (ఈసారి యథాతథమే) వడ్డీరేట్ల ప్రకారం గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు మార్చిలో బలంగా కొనసాగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?) నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి 2023లో నమోదైన మార్చి మొత్తం ఇళ్లలో 53 శాతం ధర రూ. 25 లక్షల-50 లక్షల మధ్య ఉండగా, నమోదైన మొత్తం విక్రయాల్లో 70 శాతం 1,000 చ.అ.ల నుంచి 2వేల మధ్య ఉన్న ఇళ్లకు సంబంధించినవి. రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు 29 శాతంగా ఉన్నాయి. మార్చి 2023లో రూ. 25 లక్షల కంటే తక్కువున్న ఇళ్ల డిమాండ్ వాటా 18 శాతంగా ఉంది. 'లార్జర్ టికెట్ సైజ్ హోమ్స్ కు డిమాండ్ మరింత పెరుగుతోందని రూ.1 కోటి, ఆపైన విలువ గల ఇళ్లకు డిమాండ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఏడాది మార్చిలో 6 శాతంగా ఉన్న డిమాండ్ 2023 నాటికి 10 శాతానికి పెరిగింది. మొత్తం విక్రయాలు జరిగిన ఇళ్లలో వీటి షేరు 70 శాతం ఎక్కువని శాంసన్ ఆర్థుర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వినియోగదారులు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులపై, ప్రయోజనాలపై బలమైన విశ్వాసంతో ఉన్నారని, నగరంలో అప్బీట్ అవుల్ లుక్‌ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా) -
ఆఫీస్ లీజింగ్ 5.1 కోట్ల చదరపు అడుగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2022లో ప్రధాన నగరాల్లో 5.1 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. పరిమాణం పరంగా ఇది రెండవ అత్యుత్తమ రికార్డు. హైదరాబాద్, పుణే, బెంగళూరులో లక్షకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాలకు అత్యధిక డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. డీల్స్‌లో ఒక లక్షకుపైగా చదరపు అడుగుల స్థలం కలిగినవి హైదరాబాద్, పుణే లో 53 శాతం, బెంగళూరులో 51% ఉన్నాయి. అంతర్జాతీయ ఐటీ, తయారీ కంపెనీలు ఈ డిమాండ్‌ను నడిపించాయి. 50,000 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవి కోల్‌కతలో 70 %, చెన్నైలో 57 శాతం నమోదయ్యాయి. 50,000– 1,00,000 చదరపు అడుగుల విభాగంలో అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలో డీల్స్ 30 శాతంపైగా ఉన్నాయి’ అని వివరించింది. -
విలాస నివాసాల్లో ముంబై టాప్
న్యూఢిల్లీ: విలాసవంత ఇళ్ల ధరల వృద్ధిలో ముంబై స్థానం అంతర్జాతీయంగా మరింత మెరుగుపడింది. ప్రపంచవ్యాప్త జాబితాలో 92వ స్థానం నుంచి (2021లో) ఏకంగా 37కు చేరుకుంది. 2022 సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. ఫలితంగా ముంబై 37వ ర్యాంక్‌కు చేరుకున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అంతేకాదు ముంబై ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్‌గా 18వ స్థానంలో నిలిచింది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ని నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిని ట్రాక్ చేసే ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పిరి100) 2022లో 5.2 శాతమే పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఈ సూచీ కంటే ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు ఎక్కువ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 పట్టణాల్లోని విలాసవంతమైన ఇళ్ల ధరలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ముంబైలో ప్రధాన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు 3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. బెంగళూరులో విలాసవంతమైన ఇళ్ల ధరలు గతేడాది 3 శాతం పెరగడంతో, 2022లో ప్రపంచవ్యాప్తంగా 63వ ర్యాంక్ దక్కించుకుంది. ఢిల్లీలో ఖరీదైన ఇళ్ల ధరలు 1.2 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఢిల్లీ 77వ స్థానంలో ఉంది. 2021లో 93వ ర్యాంకులో ఉండడం గమనించాలి. దుబాయి చిరునామా.. దుబాయిలో అత్యధికంగా ఖరీదైన ఇళ్ల ధరలు 20 22లో 44.2% పెరిగాయి. నైట్ ఫ్రాంక్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కేంద్రంగా దుబాయి నిలిచింది. ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధి పరంగా రియాద్, టోక్యో, మియా మి, ప్రాగ్యూ, అల్గర్వే, బహమాస్, అథెన్స్, పోర్టో 2వ స్థానం నుంచి వరుసగా జాబితాలో ఉన్నాయి. -
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది. ► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం. ► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి. ► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి. ► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి. ► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది. -
హైదరాబాద్‌లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. ఎందుకు తగ్గాయంటే.. ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని వివరించారు. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్‌హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్‌హౌసింగ్‌కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్‌హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి. 2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్‌లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి. -
హైదరాబాద్ రియల్టీలో 6% పెరిగిన ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. చదరపు అడుగు ధర సగటున 6 శాతం పెరిగి రూ.4,977కు చేరినట్టు తెలిపింది. ఇక కార్యాయల అద్దెలను చూస్తే హైదరాబాద్ మార్కెట్లో సగటు నెలవారీ అద్దె 7 శాతం పెరిగి చదరపు అడుగుకు 65కు చేరింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 3–10 శాతం మధ్య పెరిగాయి. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ’ఇండియా రియల్ ఎస్టేట్ – ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్’ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి ఇందులో గణాంకాలను పొందుపరిచింది. పట్టణాల వారీగా.. ►బెంగళూరు మార్కెట్లో ఇళ్ల ధరలతోపాటు, కార్యాలయ అద్దెల పరంగా మంచి వృద్ధి నమోదైంది. ఇళ్ల ధర చదరపు అడుగుకు 10 శాతం పెరిగి రూ.5,428కి చేరింది. కార్యాలయ అద్దెలు 13 శాతం పెరిగి చదరపు అడుగునకు రూ.81కి చేరింది. ►ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 8 శాతం పెరిగింది. చదరపు అడుగు ధర రూ.4,489గా ఉంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడునకు (నెలకు) 81.90గా ఉంది. ►ముంబై మార్కెట్లో ఇళ్ల ధర చదరపు అడుగుకు 6 శాతం పెరిగి రూ.7,170గా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు 4 శాతం పెరిగి రూ.110కి చేరుకుంది. ►పుణె మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,250గా ఉంది. ఇదే పట్టణంలో కార్యాలయ అద్దె నెలకు చదరపు అడుగునకు 9 శాతం పెరిగి రూ.71గా నమోదైంది. ►చెన్నై మార్కెట్లో ఇళ్ల ధరలు 6 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.4,300కు చేరింది. చెన్నైలో కార్యాలయ అద్దె 5 శాతం పెరిగి 61కి చేరింది. ►కోల్‌కతా పట్టణంలో ఇళ్ల ధర సగటున 4 శాతం పెరిగి.. చదరపు అడుగునకు రూ.3,350కు చేరుకుంది. కార్యాలయ అద్దె స్థిరంగా చదరపు అడుగుకు 34.7వద్దే ఉంది. ►అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల ధర 3 శాతం పెరిగి రూ.2,885గా ఉంటే, కార్యాలయ అద్దె చదరపు అడుగుకు ఏ మాత్రం మార్పు లేకుండా రూ.40.1 వద్ద ఉంది. ►ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కార్యాలయ స్థలాలకు డిమాండ్ నెలకొంది. ►కార్యాలయ స్థలం సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 29 శాతం పెరిగి 16.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్ ఎస్టేట్‌పై తగ్గిన ఆసక్తి!
న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్ ఫ్రాంక్ ఇండియా, నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది మే, జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్‌లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ♦రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. ♦కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. -
గత 4 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇళ్ల విక్రయాలు..! హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో 78,627 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9 శాతం ఎగిశాయి. ఒక త్రైమాసికంలో ఇంత అత్యధికంగా విక్రయాలు నమోదు కావడం గత నాలుగేళ్లలో ఇదే ప్రథమం. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీంతో వరుసగా మూడో క్వార్టర్లో కూడా కరోనా పూర్వపు త్రైమాసిక సగటు అమ్మకాల పరిమాణాన్ని గణనీయంగా అధిగమించినట్లయిందని నివేదిక వివరించింది. దేశవ్యాప్తంగా డిమాండ్ నిలకడగా రికవర్ అవుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. ఎకానమీ పటిష్టమవుతుండటం, అలాగే వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక సామర్థ్యాలపై భరోసా పెరుగుతుండటం తదితర అంశాలతో గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయంగా కీలక మార్కెట్లలో నివాస గృహాల విక్రయాలు పుంజుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ‘తక్కువ వడ్డీ రేట్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత, వేతనాల వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, మహమ్మారి తగ్గుముఖం పడుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. డెవలపర్లపై ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కొనుగోళ్ల లావాదేవీలు పుంజుకునే కొద్దీ క్రమంగా ధరలు పెరగవచ్చని, తద్వారా సిమెంటు.. స్టీల్ వంటి ముడి ఉత్పత్తుల ధరల భారాన్ని అధిగమించేందుకు వారికి కొంత వెసులుబాటు లభించవచ్చని బైజల్ వివరించారు. మరో రెండు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు అనరాక్, ప్రాప్‌టైగర్ కూడా ఇటీవలే రెసిడెన్షియల్ మార్కెట్లకు సంబంధించిన డేటా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనరాక్ నివేదిక ప్రకారం ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తొలి త్రైమాసికంలో 71 శాతం పెరిగి 99,550 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రాప్‌టైగర్ డేటా ప్రకారం ఎనిమిది ప్రధాన నగరాల్లో హౌసింగ్ విక్రయాలు 7 శాతం పెరిగి 70,623 యూనిట్లకు చేరాయి. నైట్ ఫ్రాంక్ నివేదికలో మరిన్ని అంశాలు.. ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో అమ్మకాలు రెట్టింపై 15,019 యూనిట్లుగా నమోదయ్యాయి. బెంగళూరులో 34 శాతం వృద్ధి చెంది 13,663 గృహాలు అమ్ముడయ్యాయి. అహ్మదాబాద్‌లో విక్రయాలు 35 శాతం పెరిగి 4,105 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం అమ్మకాలు ఒక్క శాతమే పెరిగి 6,993 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్‌కతాలో కూడా స్వల్పంగా ఒక్క శాతం వృద్ధితో 3,619 గృహాలు అమ్ముడయ్యాయి. ముంబైలో 9 శాతం క్షీణించి 21,548 ఇళ్లు అమ్ముడయ్యాయి. అటు పుణెలోనూ రికార్డు స్థాయిలో 25 శాతం క్షీణించి 10,305 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. ఇక చెన్నైలో 17 శాతం తగ్గి 3,376 యూనిట్లు అమ్ముడయ్యాయి. వివిధ మార్కెట్లలో హౌసింగ్ ధరలు 1–7 శాతం శ్రేణిలో పెరిగాయి. చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం -
కొనుగోలు దారులకు షాక్! పెరిగిన ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో గృహాల ధరలు 2.1 శాతం మేర పెరిగాయి. దీంతో అంతర్జాతీయంగా గృహాల ధరల పెరుగుదలకు సంబంధించిన జాబితాలో భారత్ 56వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎగబాకింది. ’గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ – క్యూ4 2021’ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఈ విషయాలు వెల్లడించింది. 2020 క్యూ4లో భారత్ 56వ ర్యాంకులో ఉంది. వార్షిక ప్రాతిపదికన టర్కీలో గృహాల రేట్లు అత్యధికంగా 59.6 శాతం మేర పెరిగాయి. న్యూజిలాండ్ (22.6 శాతం), చెక్ రిపబ్లిక్ (22.1 శాతం), స్లొవేకియా (22.1 శాతం), ఆస్ట్రేలియా (21.8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక మలేషియా, మాల్టా, మొరాకో మార్కెట్లలో హౌసింగ్ ధరలు 0.7–6.3 శాతం మేర తగ్గాయి. అధికారిక గణాంకాల ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు, ప్రాంతాల్లో ఇళ్ల ధరల వివరాలను క్రోడీకరించి నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. ►డేటా ప్రకారం 56 దేశాలు, ప్రాంతాల్లో రేట్లు సగటున 10.3 శాతం మేర పెరిగాయి. ►2020 జనవరి–మార్చి త్రైమాసికంలో 2% పెరగ్గా, క్యూ2లో 1.9%, క్యూ3లో 2.4%, క్యూ4లో 3.6%, 2021 తొలి త్రైమాసికంలో 1.6 శాతం, రెండో త్రైమాసికంలో 0.5% మేర తగ్గాయి. దాదా పు అయిదు త్రైమాసికాల తర్వాత హౌసింగ్ రేట్లు 2021 క్యూ3లో 0.1%, క్యూ4లో 2.1% పెరిగాయి. ►అంతర్జాతీయంగా ప్రభుత్వాల విధానపరమైన చర్యల తోడ్పాటు తదితర అంశాలతో హౌసింగ్ ధరలు మెరుగుపడ్డాయి. -
ఎగబడి కొంటున్న జనం! హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు యమ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది. క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్‌లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి. 16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి. చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్ -
సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్!
నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లో హైదరాబాద్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తుల ఉన్న వ్యక్తుల ఆధారంగా దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఓ నివేదికను తయారు చేసింది. ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివ్యూజివల్స్-2021 పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో ధనికుల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్‌లో హైదరాబాద్ లో 467 మంది వ్యక్తులు రూ.225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల జాబితా 56శాతం వృద్దితో 728కి చేరనున్నట్లు హైలెట్ చేసింది. ఇక ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పూణేలు ఉన్నాయి. ఈ సందర్భంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ..హైదరాబాద్ టెక్నాలజీ తో పాటు, డిజిటల్ ఎకానమీ తోడ్పాటు కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2016 నుంచిలో 28.4 నుంచి అనూహ్యంగా 39శాతం వృద్దితో ధనవంతుల జాబితా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా 2021లో ఐటీ,ఫార్మాసిట్యూకల్స్, బయోటెక్నాలజీ వంటి వ్యాపార రంగాల్లో హైదరాబాద్ కీ రోల్ ప్లే చేస్తుందని, కాబట్టి అనేక మంది ఆర్ధికంగా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులతో పోటీ పడుతున్నారని రజనీ సిన్హా అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: భారత్‌కు బైబై!! సర్వేలో ఆసక్తికర విషయాలు! -
Hyderabad: ఇళ్ల రిజిస్ట్రేషన్లలో రికార్డ్! డిసెంబరులో రూ.2,340 కోట్లు
కరోనా కష్టాలు చుట్టుముట్టినా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. 2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచింది. ఏడాది చివరన డిసెంబరులో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో తగ్గుదల కనిపించినా.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో తగ్గేదేలే అనిపించింది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగర పరిదిలో 3,931 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ విలువ ఏకంగా రూ.2,340 కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే 16 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబరులో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 2,693, హైదరాబాద్ 1,180, సంగారెడ్డి 66 ఇళ్లుగా ఉన్నాయి. గతేడాది హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం 44,278 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరగగా వాటి విలువ రూ.25,330 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం చుట్టుముట్టినా రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. చదవండి: ఇకపై అపార్ట్మెంట్లలో మరిన్ని లిఫ్టులు? కొత్త చర్చకు తెర తీసిన హైదరాబాద్ ఘటన! -
రియల్టీకి కలిసొచ్చిన 2021.. హైదరాబాద్ తర్వాతే ముంబై
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 8 ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు అధికంగా నమోదయ్యాయి. 2020లో విక్రయాలతో పోలిస్తే గతేడాది 51 శాతం పెరిగాయి. 2020లో 1.54,534 యూనిట్లు అమ్ముడుపోగా, 2021లో 2,32,903 యూనిట్లు విక్రయమయ్యాయి. కానీ, 2019లో విక్రయాలతో పోలిస్తే గతేడాది అమ్మకాలు 5 శాతం తక్కువగానే ఉన్నాయి. 2011లో నమోదైన గరిష్ట విక్రయాలతో పోలిస్తే 37 శాతం తక్కువ. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా ‘ఇండియా రియల్ ఎస్టేట్ 2021’ నివేదిక రూపంలో విడుదల చేసింది. ఆఫీస్ స్పేస్ కార్యాలయ స్థలాల విభాగంలో స్థూల లీజు (ఆఫీసు స్పేస్ కిరాయికి ఇవ్వడం) పరిమాణం 38.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2020లో ఇది 39.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ‘‘కార్యాలయ స్థలాల మార్కెట్‌పై కరోనా రెండో విడత ప్రభావం పడింది. 2019లో లీజు స్థలం 60.6 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే గతేడాది తక్కువగానే నమోదైంది. కరోనా కల్పించిన అసాధారణ పరిస్థితులు, లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2021లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలమైన పనితీరు చూపించింది’’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రెట్లు అధిక విక్రయాలు హైదరాబాద్ మార్కెట్లో 2021లో 24,318 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు అధికం. కార్యాలయ స్థలాల లీజు మార్పు లేకుండా(ఫ్లాట్‌గా) 6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ముంబై మార్కెట్లో ఇళ్ల విక్రయాలు 29 శాతం పెరిగి 62,989 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో విక్రయాలు 48,688 యూనిట్లు కావడం గమనార్హం. చదవండి:హైదరాబాద్‌కి షాకిచ్చిన జేఎల్ఎల్ ఇండియా వార్షిక ఫలితాలు -
ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా..
కోవిడ్ కారణంగా సామాన్యుల్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరిక పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో గృహాల కొనుగోళ్లు, అదే సమయంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సైతం ఇదే విషయం వెల్లడైంది. అంతేకాదు గృహాల ధరల పెరుగుదలలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఏడాదిలో భాగ్యనగరిలో ఇళ్ల ధరలు 2.5 శాతం అధికం అయ్యాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. చెన్నై 131, కోల్‌కత 135, అహ్మదాబాద్ 139వ స్థానంలో ఉంది. ఈ మూడు నగరాల్లో ఇళ్ల ధరలు 0.4–2.2 శాతం పెరిగాయి. బెంగళూరు 140, ఢిల్లీ 142, పుణే 144, ముంబై 146 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నగరాల్లో ధరలు 0.2–1.8% తగ్గాయి. జాబితాలో టర్కీలోని ఇజ్మీర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి?