ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా..
అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్.
చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్‌మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ
Comments
Please login to add a commentAdd a comment