Knight Frank
-
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2024)లో ఇప్పటివరకూ 4.15 బిలియన్ డాలర్లు లభించాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం వార్షికంగా ఇవి 32 శాతం అధికం. పెట్టుబడుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి ప్రవహించినట్లు తెలియజేసింది. 2024 ఇండియాలో పీఈ పెట్టుబడుల ట్రెండ్ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ రియల్టీలో పీఈ పెట్టుబడులు 415 కోట్ల డాలర్లను అధిగమించాయి.వేర్‌హౌసింగ్ ఆధిపత్యంరియల్టీ రంగ మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్ 45 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా.. రెసిడెన్షియల్ విభాగం 28 శాతం వాటాను ఆక్రమించింది. కార్యాలయ విభాగం 26 శాతం పెట్టుబడులను ఆకట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ విభాగం రెట్టింపునకుపైగా వృద్ధితో 117.7 కోట్ల డాలర్లు అందుకుంది. గృహ కొనుగోళ్లలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతోంది. కాగా.. వేర్‌హౌసింగ్‌కు 187.7 కోట్ల డాలర్లు అందితే.. ఆఫీస్ ప్రాపర్టీలకు 109.8 కోట్ల డాలర్లు లభించాయి. పదేళ్లుగా పెరుగుదల..ప్రధానంగా భారత్‌లో గత దశాబ్ద కాలం నుంచి పెట్టుబడులు పుంజుకుంటున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్థిక సుస్థిరత, నిరవధిక వృద్ధి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈకామర్స్, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో వేర్‌హౌసింగ్‌కు భారీ డిమాండ్ నెలకొన్నట్లు వివరించారు. వెరసి వేర్‌హౌసింగ్ విభాగం అత్యధిక పెట్టుబడులకు నెలవుగా మారినట్లు తెలియజేశారు. ఈ బాటలో గృహ రంగం సైతం ప్రస్తావించదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?ఆఫీసులు కళకళపీఈ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగం కొంతమేర నీరసించినప్పటికీ ఉద్యోగులు తిరిగి వర్క్‌ప్లేస్‌లకు రావడం, ఆఫీసులు పెరగడం, అద్దెలు బలపడటం వంటి అంశాలు అండగా నిలుస్తున్నట్లు శిశిర్ వివరించారు. ఇక దేశీయంగా మొత్తం రియల్టీ పీఈ పెట్టుబడుల్లో ముంబై 50 శాతం వాటాను ఆక్రమించడం గమనార్హం! మొత్తం పెట్టుబడుల్లో 42 శాతం వాటాకు సమానమైన 1.7 బిలియన్ డాలర్లు యూఏఈ నుంచి లభించాయి. దేశీ పీఈ ఇన్వెస్టర్లు 32 శాతం వాటాకు సమానమైన 1.3 బిలియన్ డాలర్లు సమకూర్చారు! సింగపూర్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 63.37 కోట్ల డాలర్లు ప్రవహించాయి. -
రియల్ ఎస్టేట్ ఆఖరి ఆరు నెలలూ సానుకూలం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) సానుకూల పనితీరు చూపించనుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్‌ను నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా విడుదల చేశాయి.ఏప్రిల్–జూన్ క్వార్టర్‌కు సెంటిమెంట్ స్కోరు 65గా ఉంటే, జూలై–సెప్టెంబర్‌లో 64కు తగ్గింది. అయితే భవిష్యత్ సెంటిమెంట్ స్కోర్ మాత్రం 65 నుంచి 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో రియల్టీ పరిశ్రమ వృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్, నరెడ్కో నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి సరఫరా వైపు భాగస్వాములు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అంచనాలు, ఆర్థిక వాతావరణం, నిధుల లభ్యతను ఈ సూచీ తెలియజేస్తుంది.స్కోర్ 50గా ఉంటే తటస్థంగా, 50కి పైన సానుకూలంగా, 50కి దిగువన ప్రతికూల ధోరణిని ప్రతిఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సెంటిమెంట్ రెండూ సానుకూల శ్రేణిలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని, పరిశ్రమ దీర్ఘకాల సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. ఇళ్ల మార్కెట్లోనూ సానుకూలత: ఇళ్ల మార్కెట్లో భవిష్యత్ సెంటిమెంట్ సానుకూలంగా నమోదైంది. ధరలు పెరుగుతాయని 62 శాతం మంది అంచనా వేస్తుంటే, అమ్మకాలు పెరుగుతాయని 40 శాతం మంది భాగస్వాములు అంచనా వేస్తున్నారు. 38 శాతం మంది మార్కెట్ స్థిరంగా ఉంటుందని భాస్తున్నారు. ఆఫీస్ మార్కెట్లో లీజింగ్, సరఫరా, అద్దెల పరంగా బలమైన సానుకూలత కనిపించింది. రానున్న నెలల్లో ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరు చూపిస్తుందన్న అంచనాలున్నట్టు నివేదిక తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలంగా ఉండడడాన్ని సెంటిమెంట్ సూచీ తెలియజేస్తోందని నరెడ్కో ప్రెసిడెంట్ హరిబాబు పేర్కొన్నారు. ‘‘2024–25 సంవత్సరానికి జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. స్థిరమైన వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత బలపడుతుంది. స్థిరమైన వృద్ధికి గాను ఈ రంగం సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలి’’అని వివరించారు. -
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉద్భవించింది. పుణె, కోల్‌కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్‌లో 5% నుంచి హైదరాబాద్‌లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్‌కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్‌సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్‌లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్‌కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్‌తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపు! భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ 2023 జులైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. వీటి మొత్తం విలువ రూ. 2,878 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోల్చితే రిజిస్ట్రేషన్ల సంఖ్య 26 శాతం, ఆస్తుల విలువ 35 శాతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 2023 జూలైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదయ్యాయి. “హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ ఊపు కొనసాగుతోంది. 1,000, 2,000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 2023 ఏప్రిల్ నుంచి ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో మరింత విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలతో అపార్ట్మెంట్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ అన్నారు. అత్యధిక వాటా వాటిదే.. హైదరాబాద్‌లో 2023 జులైలో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అత్యధికం రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువున్నవే. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 52 శాతం. ఇక రూ. 25 లక్షల కంటే తక్కువ విలువున్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 2023 జులైలో 9 శాతం. 2022 జులైతో పోలిస్తే ఇది కూడా కొంచెం ఎక్కువ. ఇక విస్తీర్ణం పరంగా చూసుకుంటే 2023 జులైలో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లే అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి 67 శాతంగా ఉన్నాయి. ఇదీ చదవండి: అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్ -
అంబానీ.. అదానీ ఓకే.. మరి మనం?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా.. అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్. చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ -
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు డబుల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఈ ఏడాది మంచి జోరు చూపించింది. చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ఇళ్ల విక్రయాలు ఏకంగా రెట్టింపై 10,330 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,280 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొత్తం మీద హైదరాబాద్‌లో మార్కెట్లో 35,370 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021లో అమ్మకాలు 22,240 యూనిట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. 2021 చివరి మూడు నెలలతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ డాట్ కామ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎనిమిది పట్టణాల్లో మొత్తం మీద 80,770 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 67,890 యూనిట్లుగా ఉన్నాయి. ఇక 2022 మొత్తం మీద ఈ ఎనిమిది పట్టణాల్లో 3,08,940 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2021లో అమ్మకాలు 2,05,940 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 50 శాతం వృద్ధి నమోదైంది. పట్టణాల వారీగా అమ్మకాలు ► అహ్మదాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం అధికంగా 6,640 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది మొత్తం మీద 62 శాతం అధికంగా 27,310 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► బెంగళూరులో అమ్మకాలు డిసెంబర్ క్వార్టర్లో 30 శాతం తగ్గి 6,560 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది మొత్తం మీద 22 శాతం వృద్ధితో 30,470 యూనిట్లు విక్రయమయ్యాయి. ► చెన్నైలో డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం తగ్గి 3,160 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం అధికంగా 14,100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 3 శాతం తగ్గి డిసెంబర్ త్రైమాసికంలో 4,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధితో 19,240 ఇళ్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. ► కోల్‌కతా మార్కెట్లో 18 శాతం క్షీణించి ఇళ్ల అమ్మకాలు 2,130 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏడాది మొత్తం మీద 8 శాతం పెరిగి 10,740 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో 40 శాతం పెరిగాయి. 31,370 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 87 శాతం అధికంగా 1,09,680 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ► పుణెలో క్యూ4లో ఒక శాతం పెరిగి 16,300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఏడాది మొత్తం మీద అమ్మకాలు 62,030 యూనిట్లుగా ఉన్నాయి. కొనుగోలు శక్తిపై ధరల ప్రభావం: నైట్‌ఫ్రాంక్ దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో గృహ రుణ రేట్లు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు శక్తి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. అయితే సగటు కుటుంబ ఆదాయం ప్రకారం చూస్తే.. ఇప్పటికీ గృహ రుణాలు పొందే శక్తి వారికి ఉన్నట్టు పేర్కొంది. వార్షిక ప్రాపర్టీ అధ్యయన నివేదికను ‘ద అఫర్డబులిటీ ఇండెక్స్ 2022’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసింది. సగటు కుటుంబ ఆదాయంతో ఈఎంఐ మొత్తం నిష్పత్తిని ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుంటుంది. అలాగే, ఇళ్ల ధరలు, గృహ రుణాల వడ్డీ రేట్లు, కుటుంబ ఆదాయాన్ని విశ్లేషించి ఏటా గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది మొత్తం మీద ఆర్బీఐ 2.25 శాతం రెపో రేటు పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీని కారణంగా గృహ రుణాల రేట్లు పెరగడం, నిర్మాణ సామాగ్రి వ్యయాలు అధికం కావడం వల్ల పెరిగిన ప్రాపర్టీ ధరలతో కొనుగోలు శక్తి క్షీణించినట్టు వివరించింది. కాకపోతే కరోనా ముందు 2019తో పోలిస్తే కొనుగోలు శక్తి ఇప్పటికీ మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. ఎనిమిది పట్టణాల్లో ఒక్క ముంబై ఈ విషయంలో బలహీనంగా ఉంది. -
ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! అక్కడేమో..!
కోవిడ్-19 రాకతో రియాల్టీ రంగం పూర్తిగా దెబ్బతింది. వరుస లాక్‌డౌన్స్‌తో ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. కరోనా ఉదృత్తి కాస్త తగ్గడంతో మళ్లీ రియల్ బూమ్ పట్టాలెక్కింది. కరోనా మహమ్మారి భూముల ధరలు, గృహ నిర్మాణ రంగంపై కొంతమేర ప్రభావం చూపాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో ఇండ్ల ధరలు భారీగానే పెరిగాయి. కాగా అత్యంత తక్కువ ధరలకే ఇళ్లు వచ్చే నగరాల జాబితాను ప్రముఖ రియాల్టీ సంస్థ నైట్ ఫ్రాంక్ ‘ అఫర్డబిలిటీ ఇండెక్స్-2021’ జాబితాను విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అగువకే ఇండ్లు..! నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం భారత్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలిచింది. ఈ నగరంలో ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. అయితే ముంబై మహానగరంలో సొంత ఇళ్లును సొంతం చేసుకోవాలంటే భారీగా వెచ్చించాల్సి వస్తోందని తెలిపింది. నైట్ ఫ్రాంక్ ఆయా నగరాల్లోని గృహ ఈఎంఐ, మొత్తం ఆదాయ నిష్పత్తి దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను విడుదల చేసింది. నివేదికలోని కొన్నిముఖ్యాంశాలు..! 2021లో అహ్మదాబాద్ 20 శాతం, పుణె 24 శాతంతో దేశంలోనే అత్యంత సరసమైన గృహా రంగ మార్కెట్‌గా అవతరించాయి. ముంబైలో మినహా 53 శాతం స్థోమత నిష్పత్తితో భారత్‌లోనే అత్యధిక ధరలు గల నగరంగా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో స్థోమత నిష్పత్తి గరిష్టంగా 2020లో 38 శాతం నుంచి 2021లో 28 శాతానికి మెరుగుపడిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ స్థోమత నిష్పత్తి 29 శాతం, బెంగళూరు 26 శాతం, చెన్నై, కోల్‌కతా 25 శాతంగా నమోదైనాయి. అంటే బెంగళూరు, చెన్నె, కోల్కత్తా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త గృహాల కోసం ఎక్కువ డబ్బులను వెచ్చించాల్సి వస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు... నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ 2021 నివేదిక ప్రకారం.... ఈ ఏడాదిలో గృహాల ధరలలో క్షీణత , చాలా కాలంగా వస్తోన్న తక్కువ వడ్డీరేట్లు ఆయా నగరాల్లో కొత్త ఇంటిని సొంతం చేసుకునే వారి స్థోమత గణనీయంగా పెరగడానికి సహాయపడిందని పేర్కొంది. అఫర్డబిలిటీ సూచిక ..! స్థోమత సూచిక అనేది ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ ఈఎంఐకు నిధులు సమకూర్చడానికి ఒక కుటుంబానికి అవసరమయ్యే ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. కాబట్టి, ఒక నగరం స్థోమత సూచిక స్థాయి 40 శాతం ఉంటే ఆ నగరంలోని కుటుంబాలు ఇంటి కోసం నిధులు సమకూర్చడానికి వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 50 శాతం కంటే ఎక్కువ ఉంటే ఇంటి ధరలు భరించలేనిదిగా పరిగణించబడుతుంది. చదవండి: ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా.. -
ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా..
కోవిడ్ కారణంగా సామాన్యుల్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరిక పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో గృహాల కొనుగోళ్లు, అదే సమయంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సైతం ఇదే విషయం వెల్లడైంది. అంతేకాదు గృహాల ధరల పెరుగుదలలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఏడాదిలో భాగ్యనగరిలో ఇళ్ల ధరలు 2.5 శాతం అధికం అయ్యాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. చెన్నై 131, కోల్‌కత 135, అహ్మదాబాద్ 139వ స్థానంలో ఉంది. ఈ మూడు నగరాల్లో ఇళ్ల ధరలు 0.4–2.2 శాతం పెరిగాయి. బెంగళూరు 140, ఢిల్లీ 142, పుణే 144, ముంబై 146 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నగరాల్లో ధరలు 0.2–1.8% తగ్గాయి. జాబితాలో టర్కీలోని ఇజ్మీర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి? -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సర్వేను డెవలపర్లు, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థల సరఫరా మీద ఆధారపడి జరుగుతుంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్ధిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో 2020 అక్టోబరు-డిసెంబరు కాలంలో టాప్-150 గ్లోబల్ అర్బన్ సిటీస్ జాబితాలో భారతీయ నగరాలు వెనుకంజలో ఉన్నాయి.నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ 4 2020’ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో గృహాల ధరలు 2020 లో సగటున 5.6శాతం పెరిగాయి. ఇది 2019 లో 3.2శాతం మాత్రమే. ముఖ్యంగా 2020 క్యూ 4 లో ఇళ్ల ధరలు పుంజుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ కావడం విశేషం. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. జాబితాలో చోటు సంపాదించుకున్న ఎనిమిది భారతీయ నగరాల్లో హైదరాబాద్ మాత్రమే 0.2 శాతం వార్షిక వృద్ధి సాధించి 122 ర్యాంకును దక్కించుకుంది. 150వ ర్యాంకు సాధించిన చెన్నైలో గృహాల ధరలు 9 శాతం తగ్గాయి. బెంగళూరులో 0.8 శాతం, అహ్మదాబాద్ 3.1, ముంబై 3.2, ఢిల్లీ 3.9, కోల్‌కత 4.3, పుణేలో 5.3 శాతం తగ్గాయి. తొలి ర్యాంకు కైవసం చేసుకున్న టర్కీలోని అంకారాలో ఇళ్ల ధరలు 30.2 శాతం అధికమయ్యాయి. 2019తో పోలిస్తే అంతర్జాతీయంగా గతేడాది 150 నగరాల్లో గృహాల ధరల సగటు వృద్ధి 5.6 శాతం నమోదైంది. 2019లో ఈ వృద్ధి 3.2 శాతంగా ఉంది. 2020లో 81 శాతం నగరాల్లో ధరలు పెరిగాయి. -
పుంజుకోని రియాల్టీ అమ్మకాలు : నైట్ ఫ్రాంక్
-
10 రెట్లు పెరగనున్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆన్ైలైన్ రిటైల్ మార్కెట్ కొనుగోళ్లు దాదాపు 10 రెట్లు పెరగనున్నాయి. గతేడాది 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి 14 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాల్లో గతేడాది ఉన్న 59.8 బిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం రిటైల్ మార్కెట్ విలువ 2019 నాటికి రెట్టింపు సంఖ్యతో 127.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని నైట్ ఫ్రాంక్ తన ‘థింక్ ఇండియా- థింక్ రిటైల్’ అనే నివేదికలో పేర్కొంది. అలాగే గతేడాది 2 శాతంగా ఉన్న ఆన్లైన్ రిటైల్ మార్కెట్ వాటా 2019 నాటికి 5 రెట్లు పెరిగి 11 శాతానికి చేరుతుందని తెలిపింది. ఇదే సమయంలో సాంప్రదాయక కిరాణ షాపుల మార్కెట్ వాటా మాత్రం 17 శాతం నుంచి 13 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. గత దశాబ్ద కాలం నుంచి వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు రావటంతో షాపింగ్ అనే భావనలో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ చెప్పారు. ఊహించని వృద్ధి కారణంగా రిటైల్ మార్కెట్ స్టాక్ హోల్డర్లను, పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. -
పదేళ్లలో బిలియనీర్లు డబుల్
న్యూయార్క్: భారత్‌లో రానున్న పదేళ్లలో కుప్పలు తెప్పలుగా సంపద పోగుపడుతుందని, కుబేరుల సంఖ్య పెరుగుతుందని అంతర్జాతీయ ప్రోపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ 2014 వెల్త్ రిపోర్ట్ పేర్కొంది. 2023 కల్లా బిలియనీర్ల సంఖ్య విషయమై నాలుగో అతి పెద్ద దేశంగా భారత్ అవతరిస్తుందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..., గత ఏడాది 60గా ఉన్న భారత్ బిలియనీర్ల సం ఖ్య 2023కల్లా 98% వృద్ధితో 119కు చేరుతుంది. 2023 కల్లా అమెరికా, చైనా, రష్యాల తర్వాత అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. {పపంచంలో మూడో పెద్ద వేగవంత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో సంపద సృష్టి మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. పదేళ్లలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య రెట్టింపవుతుంది. 2013లో 1,576గా ఉన్న వీరి సంఖ్య 3,130కు పెరుగుతుంది. గత ఏడాది 383గా ఉన్న 10 కోట్ల డాలర్లకు పైగా ఆస్తులున్న కుబేరుల సంఖ్య 2023 నాటికి 99 శాతం వృద్ధితో 761కు పెరుగుతుంది. పదేళ్లలో యూరప్ కన్నా ఆసియాలోనే కుబేరుల సంఖ్య అధికంగా ఉంటుంది. కుబేరుల సంఖ్య వృద్ధి విషయంలో అత్యధిక వృద్ధి ఉండే నాలుగో నగరంగా ముంబై నిలిచింది. ఈ సంఖ్య 577 నుంచి 126% వృద్ధితో 1,302కు పెరుగుతుంది. ముంబై తర్వాత 118% వృద్ధితో ఢిల్లీ నిలిచింది. 2024 నాటికల్లా టాప్ 10 గ్లోబల్ సిటీల్లో ముంబై చోటు సాధిస్తుంది.