హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ 2023 జులైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. వీటి మొత్తం విలువ రూ. 2,878 కోట్లు. గతేడాది ఇదే నెలతో పోల్చితే రిజిస్ట్రేషన్ల సంఖ్య 26 శాతం, ఆస్తుల విలువ 35 శాతం పెరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో 2023 జూలైలో 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదయ్యాయి.
“హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్ ఊపు కొనసాగుతోంది. 1,000, 2,000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 2023 ఏప్రిల్ నుంచి ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం కూడా కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను పెంచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో మరింత విస్తీర్ణం, ఆధునిక సౌకర్యాలతో అపార్ట్‌మెంట్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ అన్నారు.
అత్యధిక వాటా వాటిదే..
హైదరాబాద్‌లో 2023 జులైలో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌లలో అత్యధికం రూ. 25 లక్షలు నుంచి రూ. 50 లక్షల విలువున్నవే. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో వీటి వాటా 52 శాతం. ఇక రూ. 25 లక్షల కంటే తక్కువ విలువున్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతం ఉన్నాయి. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 2023 జులైలో 9 శాతం. 2022 జులైతో పోలిస్తే ఇది కూడా కొంచెం ఎక్కువ. ఇక విస్తీర్ణం పరంగా చూసుకుంటే 2023 జులైలో 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌లే అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో ఇవి 67 శాతంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్‌బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్
Comments
Please login to add a commentAdd a comment