Richest Indians
-
అంబానీ.. అదానీ ఓకే.. మరి మనం?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా.. అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్. చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ -
దేశంలోని 1 శాతం ధనవంతుల్లో ఒకరిగా ఉండాలంటే.. ఎంత డబ్బుండాలి?
ఫోర్బ్స్ ఇండియా -2023 నివేదిక ప్రకారం..భారత్‌లో మొత్తం 169 మంది (ఏప్రిల్ 5 నాటికి) బిలియనీర్లు ఉన్నారు. వారి వద్ద 675 బిలియన్ల డాలర్ల ధనం ఉంది. అయితే వారితో సమానంగా మేం కూడా ధనవంతులమే అని నిరూపించుకోవాలంటే సామాన్యుల వద్ద ఎంత డబ్బు ఉండాలి? అసలు ఎంత డబ్బు ఉంటే ధనవంతులని పరిగణలోకి తీసుకుంటారు? అని ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? అవును! ప్రపంచంలోని 25 దేశాల్లో ఆయా దేశాల్ని బట్టి ధనవంతుల సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. మరి మన దేశంలో మొత్తం కాకపోయినా కనీసం 1 శాతం ధనవంతుల్లో మనమూ ఒకరిగా పేరు సంపాదించాలంటే మన వద్ద కనీసం రూ.1.44 కోట్లు ఉండాలి. ఆ మొత్తం ఉంటే ఆ ఒక్క శాతం కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా - 2023 రూపొందించిన తాజా నివేదికలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్ (uhnwi) ఈ విషయాన్ని వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ధనవంతుల జాబితా దేశాల్లో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, కెన్యాలు సైతం ఉండగా.. భారత్ 22వ స్థానం దక్కించుకుంది. ►ప్రపంచంలోనే అత్యంత సంపన్నులున్న మొనాకో 25 దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ఆ దేశంలో 12.4 మిలియన్లు (రూ.102 కోట్లు) ఉంటే ఒక్క శాతం ధనవంతుల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించవచ్చు. ►ఇక, స్విట్జర్లాండ్‌లో 6.6 మిలియన్లు, సింగపూర్‌లో 3.5 మిలియన్లు, హాంగ్ కాంగ్లో 3.4 మిలియన్లు ఉండాలి ►మిడిల్ ఈస్ట్ దేశాలైన బ్రెజిల్ 1.6మిలియన్లు, లాటిన్ అమెరికాలో 430,000 డాలర్లు ఉండాలి. ► అల్ట్రా హై నెట్ వర్త్ జాబితాలో భారత్‌లో 30 మిలియన్ల నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో 58.4 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. చదవండి👉 అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్! -
నాడు వీధి వ్యాపారి.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!
కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి.. యూఏఈలో అత్యంత ధనవంతులైన భారతీయల్లో ఆయన ఒకరు. డానుబే గ్రూప్ అధినేత, ముంబైకి చెందిన రిజ్వాన్ సజన్ స్ఫూర్తివంతమైన విజయగాథ ఇది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) తన తండ్రి మరణించినప్పుడు రిజ్వాన్ సజన్ వయసు కేవలం 16 సంవత్సరాలు. ముగ్గురు సంతానంలో రిజ్వాన్ పెద్దవాడు కావడంతో కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. దీంతో రిజ్వాన్ వీధుల్లో పుస్తకాలు, స్టేషనరీ అమ్మాడు. అదనపు ఆదాయం కోసం మిల్క్ డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశాడు. 1981లో 18 ఏళ్లు నిండిన రిజ్వాన్‌కు ఆయన మామ కువైట్‌లో ఉద్యోగం ఇప్పించి ఆయన ఎదుగుదలలో తోడ్పాటు అందించారు. కువైట్‌లో రిజ్వాన్ ప్రారంభంలో సేల్స్ ట్రెయినీగా 150 దినార్లు అంటే అప్పట్లో రూ.18 వేల జీతానికి పనిచేశారు. అలా ఎనిమిదేళ్లు పనిచేశాక సేల్స్ మేనేజర్ అయ్యారు. కానీ 1990లో గల్ఫ్ యుద్ధం తర్వాత సజన్ ముంబైకి తిరిగి వచ్చి మళ్లీ ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ సారి దుబాయ్‌లో బిల్డింగ్ మెటీరియల్స్ బ్రోకరేజ్ వ్యాపారంలో చేరాడు. ఒక రోజు రిజ్వాన్ ఆ ఉద్యోగం మానేసి తన సొంత నిర్మాణ సామగ్రి వ్యాపార సంస్థను స్థాపించారు. అలా పుట్టుకొచ్చింది డానుబే గ్రూప్. (ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) బాల్యంలో తాను అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని, తన తండ్రి ఓ స్టీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారని, నెలకు రూ. 7వేల జీతంతో ఇల్లు గవడం చాలా కష్టంగా ఉండేదని, స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు పడినట్లు రిజ్వాన్ గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ రిజ్వాన్ సజన్ పట్టు వదలలేదు. 1993లో డానుబే గ్రూప్‌ను ప్రారంభించేంత వరకూ అనేక కష్టాలు పడ్డారు. 2019 నాటికి డానుబే గ్రూప్ వార్షిక టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) -
ఫోర్బ్స్ రిచెస్ట్ బిజినెస్ విమెన్ లిస్ట్.. దివ్య సంపద ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: గుర్తుపెట్టుకో. నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ.. నీ టార్గెట్ పదో మైల్ అయితే.. పదకొండో మైల్‌పై గురిపెట్టు అంటాడు బిజినెస్ మ్యాన్ సినిమా హీరో. సరిగ్గా ఇదే థీరీని తన జీవితానికి అన్వయించుకుందీ యువ మహిళా పారిశ్రామిక వేత్త దివ్య గోకుల్ నాథ్. తన ధ్యేయం, లక్ష్య సాధన వైపు దివ్యమైన అడుగులు వేస్తూ సంపదలో రివ్వున దూసుకుపోయింది. ఫలితంగా దేశంలోనే 100 మంది మహిళా ధనవంతులైన ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది దివ్యగోకుల్‌నాథ్. ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్ సహ వ్యవస్థాపకురాలైన దివ్య గోకుల్‌నాథ్ కేవలం 35 ఏళ్ల వయసులో ఈ లిస్ట్‌లో ఆరుగురు దిగ్గజ మహిళా పారిశ్రామికవేత్తల సరసన దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ చదువులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో గోకుల్‌నాథ్ సంపద గత సంవత్సరంలో దాదాపు రూ. 7,477 కోట్లు పుంజుకుని ప్రస్తుతం ఏకంగా సుమారు రూ. 3.02 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా ధనవంతుల జాబితాలో 47వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి 71 ఏళ్ల సావిత్రీ జిందాల్, హ్యావెల్స్ ఇండియా అధినేత్రి 76 ఏళ్ల వినోద్ రాయ్ గుప్తా, యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత్రి లీనా తివారి, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్‌షా, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అధినేత్రి మల్లికా శ్రీనివాసన్ లాంటి లెజెండ్స్‌తో పోటీపడ్డారు. దివ్య అంతకుముందు కూడా అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఉమెన్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2020 ఫెమినా పవర్ లిస్ట్. ఫోర్బ్స్ ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ , ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డుతోపాటు, 2021 మేకర్స్ ఇండియా కాన్ఫరెన్స్, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. 1987లో బెంగళూరులో బెంగళూరులో జన్మించింది దివ్య. తండ్రి అపోలో హాస్పిటల్స్‌లో నెఫ్రాలజిస్ట్, ఆమె తల్లి దూరదర్శన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్. ఏకైక సంతానమైన దివ్యకు చిన్నతనంనుంచే సైన్స్, గణితం శ్రద్ధగా నేర్పించారు. కష్టపడే తత్వాన్ని, లక్ష్యాల్ని సాధించే కమిట్మెంట్ను అమ్మానాన్నల నుంచి అలవర్చుకున్న దివ్య చదువులో బాగా రాణించింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి పైచదువులకు విదేశాలకు వెళ్లేందుకు 2007లో జీఆర్ఈ కోచింగ్ సందర్భంలో బైజూస్ రవీంద్రన్తో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే టీచింగ్ వృత్తిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్తో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఇద్దరుబిడ్డలకు జన్మనిచ్చింది. బోధనలో కొత్త పద్ధతులు అవలంబించాలనే కోరికతో 2011లో, దివ్య తన భర్తతో కలిసి బైజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌కు నాంది పలికింది. సింపుల్ లెర్నింగ్ టెక్నిక్స్‌తో విద్యార్థుల విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం బైజూస్‌లో ఏడున్నర కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. -
Leena Gandhi Tewari: మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం.. 3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో
Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా? ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది. ‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా. ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం... ‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట -
అతని ఆలోచనలతో ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక వేత్తలే వెనుకడుగు..!
IIFL Wealth Hurun India 2021: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021గాను హరూన్ ఇండియా-ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక భారత సంపన్నుల నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది. ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెనకబడ్డారు..! ఇదిలా ఉండగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రముఖ స్టార్టప్ బైజూస్ రవీంద్రన్ రికార్డు సృష్టించాడు. రాకేశ్ జున్‌జున్‌వాలా, నందన్ నీలేకని, భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా ఇతర సంపన్నుల కంటే రవీంద్రన్ ముందునిలిచాడు. బైజూస్ రాకతో విద్యారంగంలో గణనీయమైన మార్పులకు ఒక్కింతా రవీంద్రన్ కారణమయ్యాడు అనడంలో సందేహమే లేదు. 2015లో స్థాపించిన బైజూస్‌కు ఇప్పటివరకు 40 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందులో 2.8 మిలియన్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్. బైజుస్ రవీంద్రన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ .24,300 కోట్లు. ఇది గత ఏడాది కంటే 19 శాతం ఎక్కువ. రాకేశ్ జున్‌జున్‌వాలా కుటుంబ సంపద విలువ రూ. 22,300 కోట్లు, ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద విలువ రూ. 22,000 కోట్లు, నందన్ నీలేకని కుటుంబ విలువ రూ. 20,900 కోట్లు, రాజన్ భారతి మిట్టల్ కుటుంబ ఆస్తుల విలువ రూ. 20,500 కోట్లు. ఈ ఏడాది బైజుస్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సింగపూర్ ఆధారిత డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం, గ్రేట్ లెర్నింగ్, కాలిఫోర్నియాకు చెందిన ఎపిక్‌ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ డీల్స్‌తో రవీంద్రన్ భారత్‌లో 67వ ధనవంతుడిగా నిలిచేందుకు సహాయ పడింది. ఈ ఏడాది పలు సంస్థలను కొనుగోలు చేయడానికే సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా బైజూస్ ఖర్చు చేసింది. ఐదేళ్ల వ్యవధిలో, రవీంద్రన్ 504 ర్యాంకులను అధిగమించాడు. స్టార్టప్స్ దూకుడు...! భారత్‌లో యూనికార్న్ స్టార్టప్స్ గణనీయమై సంపదును సృష్టిస్తున్నాయి. హురూన్ జాబితా ప్రకారం.. సంపన్నులు లిస్ట్‌లో 46 మంది యునికార్న్స్ స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు స్టార్టప్ విప్లవం భారత్‌లో ఊపందకుంది. పలు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతున్నారు. -
దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?
దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. ఆయన మొత్తం సంపద విలువ 1.52 లక్షల కోట్లు అని ఫోర్బ్స్ తాజా జాబితా తెలిపింది. గడిచిన సంవత్సరం ఆయన సంపద రూ. 1.26 లక్షల కోట్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గడిచిన ఏడాది కాలంలో 21% పెరిగాయని, అందుకే అంబానీ సంపద కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది. అంబానీ తర్వాత రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ నిలిచారు. ఆయన మొత్తం సంపద రూ. 1.13 లక్షల కోట్లుగా తేలింది. సన్ ఫార్మా షేర్ల విలువ తగ్గడంతో గత ఏడాది కంటే ఆయన సంపద కొంత తగ్గిందని ఫోర్బ్స్ తేల్చింది. మూడో స్థానంలో హిందూజా సోదరులు నిలిచారు. శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్, అశోక్.. ఈ నలుగురు సోదరులూ కలిసి మొత్తం హిందూజా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలుగా విప్రోను ముందుండి నడిపిస్తున్న ఆ గ్రూపు అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి నాలుగో స్థానానికి పడిపోయారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో సిమెంటు, పెయింటు కంపెనీల వాళ్లు బాగుపడ్డారు. వేణుగోపాల్ బంగూర్ తొలిసారిగా టాప్ 20 జాబితాలో చోటు సంపాదించారు. ఆయనకు ఈ జాబితాలో 14వ స్థానం లభించింది. అలాగే ఏషియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్వినీ దాని కూడా 34వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది భారత దేశంలో దాదాపు 6700 కోట్లకు పైగా సంపద పెంచుకున్నవాళ్లు మొత్తం 15 మంది ఉన్నారు. వాళ్లలో వీళ్లిద్దరికీ స్థానం లభించింది. భారతదేశంలో టాప్ టెన్ కుబేరులు వీళ్లే.. 1. ముకేష్ అంబానీ - 1.52 లక్షల కోట్లు 2. దిలీప్ సంఘ్వీ - 1.13 లక్షల కోట్లు 3. హిందూజా సోదరులు - 1.02 లక్షల కోట్లు 4. అజీం ప్రేమ్‌జీ - లక్ష కోట్లు 5. పల్లోంజీ మిస్త్రీ - 93వేల కోట్లు 6. లక్ష్మీ మిట్టల్ - 84వేల కోట్లు 7. గోద్రెజ్ కుటుంబం - 83 వేల కోట్లు 8. శివనాడార్ - 76వేల కోట్లు 9. కుమార్ బిర్లా - 59వేల కోట్లు 10. సైరస్ పూనావాలా - 57వేల కోట్లు -
దేశంలో అత్యంత ధనవంతుడు మళ్లీ ముకేషే
-
దేశంలో అత్యంత ధనవంతుడు మళ్లీ ముకేషే
ఒక్క ఏడాదిలో దాదాపు 31 వేల కోట్ల రూపాయల సంపద కరిగిపోయినా కూడా.. దేశంలో అత్యంత ధనవంతుడిగా వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ముకేష్ అంబానీయే నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 1,25,222 కోట్ల రూపాయలని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు తొలిసారిగా దేశంలోని వందమంది అత్యంత సంపన్నవంతుల జాబితాలో చోటు సంపాదించుకోగలిగారు. అంబానీ తర్వాత రెండో స్థానంలో 1,19,259 కోట్ల సంపదతో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, మూడో స్థానంలో 1,05,345 కోట్ల సంపదతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్, బిన్నీ బన్సల్ తొలిసారిగా 86వ స్థానంలోకి ప్రవేశించారు. వీళ్ల ఒక్కొక్కరి సంపద 8613 కోట్ల రూపాయలుగా నిర్ధరించారు. మొత్తం వంద మంది సంపద కలిపి 22,85,797 కోట్ల రూపాయలు అయ్యింది. అయితే గత సంవత్సరం కంటే మాత్రం ఇది దాదాపు వంద కోట్ల రూపాయలు తక్కువ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 7 శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్తోందని, అయితే దేశంలోని వందమంది ధనవంతుల సంపద మాత్రం గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి విలువ తగ్గడంతో కొంతమేర కరిగిపోయిందని ఫోర్బ్స్ విశ్లేషించింది. టాప్ టెన్ ధనవంతులు వీరే.. ముకేష్ అంబానీ - 1,25,222 కోట్లు దిలీప్ సంఘ్వీ - 1,19,259 కోట్లు అజీమ్ ప్రేమ్‌జీ - 1,05,345 కోట్లు హిందూజా సోదరులు - 1,05,345 కోట్లు పలోంజీ మిస్త్రీ - 97,394 కోట్లు శివ్ నాడార్ -85,469 కోట్లు గోద్రెజ్ కుటుంబం - 75,530 కోట్లు లక్ష్మీ మిట్టల్ - 74,205 కోట్లు సైరస్ పూనావాలా- 52,341 కోట్లు కుమార మంగళం బిర్లా-51,679 కోట్లు -
కుబేర సంపద సగం వీరిదే
న్యూఢిల్లీ: టాప్ 5 భారతీయ కుబేరుల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 8,550 కోట్ల డాలర్లు! మన కరెన్సీలో రూ.5,23,897 కోట్లు. భారత్‌లో 100 కోట్ల డాలర్లకుపైగా వ్యక్తిగత సంపద ఉన్న శ్రీమంతుల మొత్తం ఆస్తుల విలువలో ఇది దాదాపు సగమని వెల్త్ రీసెర్చ్ కంపెనీ వెల్త్-ఎక్స్ విశ్లేషించింది. దేశంలోని కుబేరుల సిరిసంపదలపై కంపెనీ ఇటీవలే అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించింది. ముకేశ్ అంబానీదే అగ్రస్థానం... రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2,440 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,49,474 కోట్లు) సంపదతో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఉక్కు రంగ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విలువైన ముంబై ఇండియన్స్ టీమ్ ముకేశ్ అంబానీకి చెందినదే. ఈ టీమ్ విలువ 11.20 కోట్ల డాలర్లుంటుందని అంచనా. స్టీల్ టైకూన్ మిట్టల్... ప్రపంచంలో ఉక్కును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ నెట్‌వర్త్ 1,720 కోట్ల డాలర్లు. ఆర్సెలర్ మిట్టల్లో 38 శాతం షేరుతో పాటు క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్లో 33 శాతం వాటా మిట్టల్‌కు ఉంది. అత్యంత సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీకి 1,563 కోట్ల డాలర్లు, నాలుగో స్థానంలోని విప్రో ప్రేమ్‌జీకి 1,490 కోట్ల డాలర్లు, ఐదో ర్యాంకులోని పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీకి 1,270 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు ఇతోధిక తోడ్పాటు అందించేందుకు ఈ ఐదుగురు కుబేరులూ ఫౌండేషన్లను ఏర్పాటు చేశారని వెల్త్-ఎక్స్ తెలిపింది. బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్‌కు 60 కోట్ల డాలర్లు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 16 కోట్ల డాలర్ల ఆస్తులున్నాయని పేర్కొంది.