IIFL Wealth Hurun India 2021: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021గాను హరూన్ ఇండియా-ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ నివేదిక భారత సంపన్నుల నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2021లో భారత్‌లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది.
ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెనకబడ్డారు..!
ఇదిలా ఉండగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రముఖ స్టార్టప్ బైజూస్ రవీంద్రన్ రికార్డు సృష్టించాడు. రాకేశ్ జున్‌జున్‌వాలా, నందన్ నీలేకని, భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా ఇతర సంపన్నుల కంటే రవీంద్రన్ ముందునిలిచాడు. బైజూస్ రాకతో విద్యారంగంలో గణనీయమైన మార్పులకు ఒక్కింతా రవీంద్రన్ కారణమయ్యాడు అనడంలో సందేహమే లేదు. 2015లో స్థాపించిన బైజూస్‌కు ఇప్పటివరకు 40 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందులో 2.8 మిలియన్ల మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్స్.
బైజుస్ రవీంద్రన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ .24,300 కోట్లు. ఇది గత ఏడాది కంటే 19 శాతం ఎక్కువ. రాకేశ్ జున్‌జున్‌వాలా కుటుంబ సంపద విలువ రూ. 22,300 కోట్లు, ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద విలువ రూ. 22,000 కోట్లు, నందన్ నీలేకని కుటుంబ విలువ రూ. 20,900 కోట్లు, రాజన్ భారతి మిట్టల్ కుటుంబ ఆస్తుల విలువ రూ. 20,500 కోట్లు.
ఈ ఏడాది బైజుస్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సింగపూర్ ఆధారిత డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం, గ్రేట్ లెర్నింగ్, కాలిఫోర్నియాకు చెందిన ఎపిక్‌ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ డీల్స్‌తో రవీంద్రన్ భారత్‌లో 67వ ధనవంతుడిగా నిలిచేందుకు సహాయ పడింది. ఈ ఏడాది పలు సంస్థలను కొనుగోలు చేయడానికే సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా బైజూస్ ఖర్చు చేసింది. ఐదేళ్ల వ్యవధిలో, రవీంద్రన్ 504 ర్యాంకులను అధిగమించాడు.
స్టార్టప్స్ దూకుడు...!
భారత్‌లో యూనికార్న్ స్టార్టప్స్ గణనీయమై సంపదును సృష్టిస్తున్నాయి. హురూన్ జాబితా ప్రకారం.. సంపన్నులు లిస్ట్‌లో 46 మంది యునికార్న్స్ స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు స్టార్టప్ విప్లవం భారత్‌లో ఊపందకుంది. పలు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment