ఫోర్బ్స్ ఇండియా -2023 నివేదిక ప్రకారం..భారత్‌లో మొత్తం 169 మంది (ఏప్రిల్ 5 నాటికి) బిలియనీర్లు ఉన్నారు. వారి వద్ద 675 బిలియన్ల డాలర‍్ల ధనం ఉంది. అయితే వారితో సమానంగా మేం కూడా ధనవంతులమే అని నిరూపించుకోవాలంటే సామాన్యుల వద్ద ఎంత డబ్బు ఉండాలి? అసలు ఎంత డబ్బు ఉంటే ధనవంతులని పరిగణలోకి తీసుకుంటారు? అని ఇలా ఎప్పుడైనా ఆలోచించారా?
అవును! ప్రపంచంలోని 25 దేశాల్లో ఆయా దేశాల్ని బట్టి ధనవంతుల సంఖ్య పెరగొచ్చు. తగ్గొచ్చు. మరి మన దేశంలో మొత్తం కాకపోయినా కనీసం 1 శాతం ధనవంతుల్లో మనమూ ఒకరిగా పేరు సంపాదించాలంటే మన వద్ద కనీసం రూ.1.44 కోట్లు ఉండాలి. ఆ మొత్తం ఉంటే ఆ ఒక్క శాతం కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకోవచ్చు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా - 2023 రూపొందించిన తాజా నివేదికలో ఆల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్ (uhnwi) ఈ విషయాన్ని వెల్లడించింది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ధనవంతుల జాబితా దేశాల్లో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, కెన్యాలు సైతం ఉండగా.. భారత్ 22వ స్థానం దక్కించుకుంది.
►ప్రపంచంలోనే అత్యంత సంపన్నులున్న మొనాకో 25 దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ఆ దేశంలో 12.4 మిలియన్లు (రూ.102 కోట్లు) ఉంటే ఒక‍్క శాతం ధనవంతుల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించవచ్చు.
►ఇక, స్విట్జర్లాండ్‌లో 6.6 మిలియన్లు, సింగపూర్‌లో 3.5 మిలియన్లు, హాంగ్ కాంగ్‌లో 3.4 మిలియన్లు ఉండాలి
►మిడిల్ ఈస్ట్ దేశాలైన బ్రెజిల్ 1.6మిలియన్లు, లాటిన్ అమెరికాలో 430,000 డాలర్లు ఉండాలి.
► అల్ట్రా హై నెట్ వర్త్ జాబితాలో భారత్‌లో 30 మిలియన్ల నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య రానున్న ఐదేళ్లలో 58.4 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment