న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ (కేఎఫ్‌ఎల్‌ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది.
► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం.
► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి.
► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి.
► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి.
► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది.
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
Published Thu, Mar 2 2023 3:56 AM | Last Updated on Thu, Mar 2 2023 3:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment