handbags
-
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది. ► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం. ► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి. ► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి. ► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి. ► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది. -
హ్యాండ్ బ్యాగ్ నిండా డబ్బు! డబ్బు! డబ్బు!
‘నేను బిజినెస్ చేస్తాను’’ అంది రీతూ. కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు. ‘‘కుదురుతుందా!’’ అన్నాడు కౌశిక్.నిజానికైతే వాళ్లుంటున్న ప్రాంతాన్ని బట్టి, వాళ్లు పెట్టి పెరిగిన కుటుంబాల వాతావరణాన్ని బట్టి, అతడు ‘‘ఏం అక్కర్లేదు. ఇంట్లో పడుండు’’ అనే మాట అనాలి.హరియాణా.. మిగతా దేశానికి కొంచెం డిఫరెంట్. అక్కడి మగాళ్లు ‘మగపుట్టక పుట్టాం’ అన్నట్లు ఉంటారు. ఆడవాళ్లు ‘ఆడజన్మ’ అని సరిపెట్టుకునేలా ఉంటారు. రీతూ, కౌశిక్లది హరియాణాలోని సోనీపత్. గ్రామమే కానీ, మరీ పల్లెలా ఉంటుంది. కుదురుతుందా అన్నాక, ‘‘పల్లెలో ఏం బిజినెస్ నడుస్తుంది రీతు’’ అని నవ్వాడు కౌశిక్.రీతూకు హ్యాండ్‌బ్యాగులు డిజైన్ చెయ్యడం వచ్చు. ఎప్పుడో టెన్త్‌లో ఉండగా నేర్చుకుంది. ఊళ్లోకి ఎవరో వచ్చారు.. విద్య నేర్చుకుంటే ఉపాధి ఉంటుందని ఏవో రెండు మూడు పనులు ఊళ్లో ఆడవాళ్లకు నేర్పించి వెళ్లారు. నేర్చుకున్న వాళ్లలో రీతూ కూడా ఉంది. పదహారేళ్లకే పెళ్లి కావడంతో రీతూ లోపల ఆ విద్య అలా మెలకువగా ఉంది.ఇప్పుడు ఆమె వయసు 31. ఇద్దరు పిల్లలు. ఇప్పుడామె బిజినెస్ ఉమన్. నెలకు ఇంతని సంపాదిస్తోంది. ఎంత సంపాదిస్తోందో తర్వాత. సంపాదన ఎలా మొదలైందో తెలిస్తే భలే వింతగా ఉంటుంది. అమ్మాయిల్లోని ఆసక్తికి, నైపుణ్యానికి కాస్త హెల్పింగ్ హ్యాండ్ దొరికితే ఇట్టే అల్లుకునిపోతారని తెలిసి ముచ్చటేస్తుంది. ఈ ముచ్చటకేం గానీ.. రీతూ లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా మొదలైందో చూడండి. ‘‘నేను బిజినెస్ చేస్తాను’’ అని అడిగిందని కదా రీతూ గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఐదేళ్ల నాటి సంగతి. ‘‘కుదురుతుందా’’ అని భర్త అడిగిన తర్వాత, ‘కుదుర్చుకుంటాను’’ అని చెప్పిన తర్వాత.. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ల డిజైనింగ్‌లు చెయ్యడం, వాటిని కుట్టి, ఫినిషింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటి కస్టమర్ ఒక పురుషుడు. ఎవరంటే.. ఆమె భర్తే. ‘‘రీతూ మేడమ్ ఎంతకు అమ్ముతారు?’’ అని సరదాగా అడిగాడు. తర్వాత వాళ్ల ఆఫీస్‌లోని వాళ్లకు చెప్పాడు. తర్వాత చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. వారిలో.. చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా.. వారు రీతూకు గైడెన్స్ ఇచ్చారు. ‘‘అక్కా.. బాగుంది, అయితే డిగ్రీ చదివితే.. నీకు బాగా పనికొస్తుంది’ అని చెప్పారు. ‘‘డిగ్రీలో చేరేదా’’ అని భర్తను అడిగింది రీతూ... ‘బిజినెస్ చేసేదా?’ అని అడిగిన విధంగానే. ‘‘కష్టమవదు కదా..’’ అన్నాడు. నవ్వింది. అతడిని ఆఫీస్‌కి, పిల్లల్ని స్కూల్‌కి పంపి తనూ, ప్రైవేట్ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఎంట్రన్స్ టెస్ట్ రాసి, నేరుగా డిగ్రీలో చేరి చదివింది. పాసైంది. 2016లో పట్టా చేతికొచ్చింది. ‘‘అక్కా.. ఇప్పుడు చూస్కో నీ బిజినెస్ ఎలా డెవలప్ అవుతుందో. ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ అవ్వు’’ అని సలహా ఇచ్చారు. అప్పట్నుంచీ రీతూ ప్రాడక్ట్ మొత్తం ఆన్లైన్ అమ్మకాలకే. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌కి. మంచి డిజైన్లు, మంచి క్వాలిటీ ఉండడంతో రీతూ హ్యాండ్ బ్యాగులకు ఫ్లిప్‌కార్ట్‌లో గిరాకీ పెరిగింది. భర్త, చుట్టుపక్కల అమ్మాయిలు, చదివిన డిగ్రీ.. ఇవే కాదు ఫ్లిప్‌కార్ట్‌లోని ‘నైపుణ్యాల అభివృద్ధి విభాగం’ కూడా రీతూకు గైడెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఆదాయం.. (చెబితే బాగుంటుందా? మగవాళ్ల ఇన్కమ్ అడక్కూడదంటారు. ఆడవాళ్ల ఇన్‌కమ్‌ను మాత్రం మనం ఎందుకు చెప్పుకోవాలి? అయినా సరే.. చెప్పుకోవాల్సిందే.) ప్రస్తుతం ఆమె ఆదాయం నెలకు.. ఎనిమిది లక్షల రూపాయలు! ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని జీతాలు కలిపితే ఇంత మొత్తం వస్తుంది! చిన్న టీమ్‌తో కలిసి పనిచేస్తోంది రీతూ. ఆమె పుట్టింటి పేరు రీతూపాల్. ఆ పేరుతోనే ‘రీతూపాల్ కలెక్షన్’తో తన బ్రాండ్‌కు ఒక ఇమేజ్ తెచ్చుకుంది. డబ్బు కాదు కానీ, ‘‘నా పేరు అందరూ చెప్పుకోవాలి’’ అని ఆమె ఆశ. అది పెద్ద ఆశేం కాదు. ఇప్పటికే రీతూపాల్ హ్యాండ్బ్యాగ్స్కి ఒక గుర్తింపు వచ్చింది. ఒక్కో బ్యాగ్ ధర.. ఫీచర్స్‌ని బట్టి 200 నుంచి 15 వందల రూపాయల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మొదటి నెలలో రీతూ సంపాదన 11 లక్షలు! ఆ లెక్క ఆమె చూసుకోలేదు. తర్వాతి నెల నుంచీ ఆమె చేతికొస్తున్న డబ్బు 7 నుంచి 8 లక్షల మధ్య నిలకడగా ఉండడం మొదలైంది. ఆ లెక్కా చూసుకోలేదు రీతూ. మరేం చూసుకుంటోంది. నెలకు కనీసం 20 లక్షలైనా సంపాదించాలని నవ్వుతూ అంటోంది.రీతూ.. బిజినెస్ ప్రయత్నాల్లో ఉందని తెలిసినప్పుడు బంధువులంతా ‘అవ్వ’ అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. ఇప్పుడూ నొక్కుకుంటున్నారు.. ‘అవునా.. మన రీతూ అంత సంపాదిస్తోందా?’ అని. -
లక్షల రూపాయలతో బ్యాగ్ లు కొనేసింది!
నాలుగేళ్ళ క్రితం ఆమెను నడమంత్రపు సిరి వరించింది. ఓ బ్యాంక్ అనుకోకుండా చేసిన తప్పిదం ఆమెను ధనవంతురాల్ని చేసింది. అప్పనంగా వచ్చిన సుమారు ఏభై లక్షల రూపాయలను ఆమె.. మూడో కంటికి తెలియకుండా ఖర్చు చేసేందుకు చూసింది. అయితే ఆ అదృష్టం కేవలం నాలుగేళ్ళే నిలిచింది. ఆరా తీసిన బ్యాంక్ సిబ్బందికి అసలు విషయం తెలియడంతో ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను వలవేసి పట్టుకున్నారు. మిలియనీర్ గా మారిన 21 ఏళ్ళ క్రిస్టీన్ జియాక్సిన్ లీ.. తనకు కలసి వచ్చిన అదృష్టాన్నినాలుగేళ్ళపాటు రహస్యంగానే ఉంచింది. బ్యాంక్ సిబ్బంది చేసిన తప్పుతో ఆమె అకౌంట్ లోకి వచ్చిన సుమారు 46 లక్షల రూపాయలను ఖరీదైన డిజైనర్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ల కొనుగోలుకు ఖర్చు చేసేసింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆమె ఓ ఎమర్జెన్సీ పాస్ పోర్టుతో మలేషియా వెళ్ళేందుకు సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా తన బ్యాంకులో 33 లక్షల రూపాయల వరకూ బ్యాలెన్స్ ఉందని, మిగిలిన డబ్బును తనకిష్టమైన ఖరీదైన వస్తువులు కొనుక్కున్నానని, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జియాక్సిన్ పోలీసులకు తెలిపింది. డబ్బు వచ్చిందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె స్వంత ఖర్చులకు వినియోగించడాన్ని కోర్టు నేర చర్యగా పరిగణించింది. సిడ్నీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న జియాక్సిన్ ను అరెస్టు చేసిన పోలీసులు 2014 జూలై నుంచి, 2015 ఏప్రిల్ మధ్య కాలంలో ఆమె అనేక దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేసినట్లు చెప్తున్నారు. అయితే కనీసం తనకు వచ్చిన డబ్బు ఏ బ్యాంకు నుంచి వచ్చిందన్న విషయాన్నికూడ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే జియాక్సిన్ కు బెయిల్ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం... బ్యాంకు చేసిన పొరపాటు గురించి తనకు ఎటువంటి అవగాహనా లేదని, అయితే ఆమె ఖర్చు చేసినట్లు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించాడు. -
రైలు ఎక్కుతుంటే హ్యాండ్ బ్యాగులు చోరీ
వరంగల్: గోల్కండ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న మహిళల చేతిలోని హ్యాండ్ బ్యాగులను వరంగల్ రైల్వే స్టేషన్లో శుక్రవారం దుండగులు అపహరించి పరారైయ్యారు. దాంతో బాధిత మహిళలు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లో రూ. 4 వేల నగదుతో పాటు రెండు బ్యాంకు ఏటీఎమ్ కార్డులు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘చోరీ’ సొత్తు అప్పగింత
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణికులు పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన సామగ్రిని రైల్వే పోలీసు కమిషనర్ శుక్రవారం బాధితులకు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిత్యం ఉరుకులు, పరుగులతో రాకపోకలు సాగించే ముంబైకర్లు రైలు దిగే హడావుడిలో చేతి బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ సంచులు ఇలా ఏదో ఒక వస్తువు మర్చిపోవడం పరిపాటిగా మారింది. అదేవిధంగా కిక్కిరిసిన రైళ్లలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొరికినంత దోచుకుపోతుంటారు. ఇదే తరహాలో మహిళా బోగీల్లో సైతం విలువైన సామగ్రి, ఒంటిపై ఉన్న బంగారు నగలు తెంచుకుని దొంగలు నడిచే రైలులోంచి దూకి పారిపోవడం పరిపాటిగా మారింది. ఇలా ప్రతిరోజూ పశ్చిమ, సెంట్రల్, హార్బర్ లోకల్ రైల్వే మార్గాల పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతాయి. అయితే పొగొట్టుకున్న వస్తువులపై బాధితులు దాదాపు ఆశలు వదిలేసుకుంటారు. ఒకవేళ ఆ వస్తువులు తిరిగి పొందాలంటే చెప్పులరిగేలా రైల్వే పోలీసు స్టేషన్ల చుట్టు తిరగాల్సిందే. ఇదిలా ఉండగా, కొంతకాలంగా రైల్వే స్టేషన్లలో దొంగలను పట్టుకోవడానికి ఆర్పీఎఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన దొంగల నుంచి రికవరీ చేసిన చోరీ వస్తువులను, తమ వద్ద నమోదైన ఫిర్యాదులను బట్టి బాధితులకు సమాచారమందించి తిరిగి వారికి అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కొందరు బాధితులను పిలిచించి, వారి వస్తువులను తిరిగి అప్పగించారు. -
డే అండ్ నైట్ బజార్
పగలంతా కష్టపడి క్షణం తీరిక లేకుండా ఉండేవారి కోసం ఓ సరికొత్త షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది ‘ఆకృతి డే అండ్ నైట్ బజార్’. సోమాజిగూడ ది పార్క్ హోటల్లో సోమవారం ప్రారంభమైన ఈ బజార్లో ప్రముఖ డిజైనర్లు, చేనేత కళాకారులు రూపొందించిన వస్త్ర శ్రేణులు కొలువుదీరాయి. వీజే, ముద్దుగుమ్మ మధులత సంప్రదాయ దుస్తుల్లో హొయలొలికించింది. రానున్న దీపావళి పండుగకు కావల్సిన సంప్రదాయ దుస్తులు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటితోపాటు హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్రోకరీ, వాచీలవంటివెన్నో ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటల వరకు ఈ బజార్ కొనసాగుతుంది. -
వీళ్లకు అవంటే యమక్రేజ్!
పంచామృతం ప్రతి మనిషికీ ఒక పిచ్చి ఉంటుంది. హాబీ రూపంలో కావొచ్చు, ఆసక్తిగా కావొచ్చు. ఆ పని ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి పిచ్చితో ప్రపంచంతో పనిలేదన్నట్టుగా బతికేయొచ్చనిపిస్తుంది. ఆ పిచ్చిలో ఉన్నప్పుడు మనకు మనమే ముద్దొస్తాం, మనకు మనమే గ్రేటనిపిస్తాం. మరి ఇదే విషయం గురించి కొంతమంది సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారి వ్యక్తిగత ఆసక్తులను గురించి వాకబు చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి... పేరుకైతే ‘దబాంగ్ ఖాన్’ కానీ సల్మాన్‌ది కళాహృదయం. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రసిద్ధ పెయింటర్లు గీసిన వాటిని సేకరిస్తూ ఉంటాడు. అలాగే మనసు స్పందించినప్పుడు తను కూడా బ్రష్‌కు పని చెబుతూ ఉంటాడు. కింగ్‌ఖాన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే మహా ఇష్టం. మార్కెట్లోకి వచ్చే అధునాతన స్మార్ట్‌ఫోన్స్, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్ను కొనేయడం అంటే షారూఖ్‌కు తెగ సంబరమట. ఏదైనా కొత్త గాడ్జెట్ కనిపిస్తే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడు. కొనే సామర్థ్యం ఉంది కాబట్టి ఎంచక్కా కొనేసుకొంటాడు. అలాగే ఆయన కార్ల పిచ్చి కూడా ఉంది. షారూఖ్ గ్యారేజ్‌లో కనీసం ఏడు కార్లు అయినా పార్కింగ్‌లో ఉండాల్సిందే! నటనకు పరిపూర్ణ నిర్వచనంలా కనిపించే విద్యాబాలన్ ఆఫ్ ద రికార్డ్‌లో అచ్చమైన అతివ. ఆమెకు చీరలు సేకరించడం అంటే యమ క్రేజ్! పట్టు చీరలంటే పిచ్చి. విద్యను బాగా ఎరిగిన వారు ఇచ్చే సమాచారం ప్రకారం ఆమె వద్ద వెయ్యికిపైగా వెరైటీ వెరైటీ చీరలున్నాయి! తండ్రి హీరోగా ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తాను హీరోయిన్గా అంతే స్టార్‌డమ్‌ను సంపాదించడం అనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్న సోనమ్ కపూర్ ఒక స్టైల్ దివా. ఆమె వార్డ్రోబ్ బ్రాండెండ్ వేర్‌తో నిండి ఉంటుంది. అలాగే సోనమ్‌కు హ్యాండ్‌బ్యాగ్స్ అంటే కూడా క్రేజే. ఈమెకు సరికొత్త వంటకాల గురించి తెలుసుకొని వండటం అంటే తెగ ఆసక్తి. వంటల పుస్తకాలను సేకరించి అందులోని థియరీని ప్రాక్టికల్ చేసి తనకు తెలిసిన వారికి వండిపెట్టడం అంటే కంగనకు చాలా ఇష్టమట. వంట గురించి మంచి మొబైల్ అప్లికేషన్లు ఉంటే చెప్పరా? అంటూ తన సహచర నటీనటులను అడుగుతూ ఉంటుందట.