
డే అండ్ నైట్ బజార్
పగలంతా కష్టపడి క్షణం తీరిక లేకుండా ఉండేవారి కోసం ఓ సరికొత్త షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది ‘ఆకృతి డే అండ్ నైట్ బజార్’. సోమాజిగూడ ది పార్క్ హోటల్‌లో సోమవారం ప్రారంభమైన ఈ బజార్‌లో ప్రముఖ డిజైనర్లు, చేనేత కళాకారులు రూపొందించిన వస్త్ర శ్రేణులు కొలువుదీరాయి. వీజే, ముద్దుగుమ్మ మధులత సంప్రదాయ దుస్తుల్లో హొయలొలికించింది. రానున్న దీపావళి పండుగకు కావల్సిన సంప్రదాయ దుస్తులు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటితోపాటు హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్‌వేర్, క్రోకరీ, వాచీలవంటివెన్నో ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటల వరకు ఈ బజార్ కొనసాగుతుంది.