క్లోన్ ఫెస్ట్...
కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లో నిర్వహించిన క్లోన్ ఫెస్టివల్ శనివారం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలను వీక్షించి సరికొత్త అనుభూతికి లోనయ్యారు. ఈ నెల 23 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన క్లోన్ ఎఫైర్‌లో భాగంగా అంతర్జాతీయ కళాకారులు విచిత్ర వేషాలతో వినూత్నంగా ప్రదర్శించిన నాట్యం పిల్లల మోముల్లో నవ్వులు పూయించింది. - కేపీహెచ్‌బీ కాలనీ