దివాలీ ఆన్‌లైన్ | Diwali festival offers for E-shopping | Sakshi
Sakshi News home page

దివాలీ ఆన్‌లైన్

Published Thu, Oct 23 2014 2:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

దివాలీ ఆన్‌లైన్ - Sakshi

దివాలీ ఆన్‌లైన్

పండుగ ఏదైనా.. హైదరాబాద్ ఆన్‌లైన్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటోంది. నట్టింటి నుంచి కాలు కదపకుండానే, నెట్టింట్లో విహరిస్తూ షాపింగ్ ఎంజాయ్ చేస్తోంది. హైదరాబాదీలు అసలే షాప్‌హాలిక్స్.. ఆపై అందుబాటులో అరచేత ఇమిడిపోయే స్మార్ట్ గాడ్జెట్స్.. ఇక ఆన్‌లైన్ జోష్ 24X7 ఫార్మేట్‌లో నడుస్తోంది. షాపింగ్ వూల్స్‌కి వెళ్లాలంటే ట్రా‘ఫికర్’..బోర్. అదే ఆన్‌లైన్‌లోనైతే ఫుల్ హ్యాపీ. ఈ-టెయిలింగ్ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్లతో ఊరిస్తుండటంతో ‘ఈ’షాపింగ్ ట్రెండ్ హైఎండ్‌కు చేరుకుంటోంది. హైదరాబాద్‌లో దసరా ముందు మొదలైన ఆన్‌లైన్ హంగామా దీపావళి ముందు ధన్‌తెరాస్ నాటికల్లా తారస్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి ‘ఈ’ షాపింగ్ 350 శాతం పెరిగింది. అదే టైమ్‌లో షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలు 40 శాతం మేరకు పడిపోయినట్లు తాజా సర్వేల అంచనా.            
 - సిటీప్లస్ డెస్క్
 
 సిటిజన్ల లైఫ్‌స్టైల్‌లో ‘షాపింగ్’ ఓ ప్రెట్టీ థింగ్. గాడ్జెట్లు, ఫ్యాషన్.. కొత్త ట్రెండ్ ఏదొచ్చినా.. వెంటనే దాన్ని సెట్ చేసేసుకోవాల్సిందే. ఇందుకోసం గతంలో మాల్స్ చుట్టూ రౌండ్‌‌స వేసేవారు. ఇప్పుడు మంచి డీల్ ఆఫర్ చేసే ఈ-టెయిలర్‌‌స కోసం నెట్‌లో సెర్‌‌చ చేస్తున్నారు. చివరకు దీపావళికి ఇంటి ముంగిట కాంతులీనే దీపాల నుంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్, క్రాకర్‌‌స, టీవీలు, ఇంటీరియర్, ఫర్నిచర్ ఐటెమ్స్‌ను చిన్న ‘క్లిక్’ లేదా ‘టచ్’తో దరి చేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం.. ఆయా పోర్టల్స్ ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలే. ‘నేను మంచి సౌండ్ సిస్టమ్ కోసం సిటీలోని ఎలక్ట్రానిక్స్ షోరూంలు తిరిగాను. రేటు విని వెనక్కి వచ్చేశా. ఫ్రెండ్ సలహాతో ఆన్‌లైన్ పోర్టల్స్ చూస్తే.. తక్కువ రేటుకే ఆఫర్ కనిపించింది. వెంటనే డీల్ ఓకే చేశా’నని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సిద్ధార్థ చెప్పాడు. బంజారాహిల్స్‌లోని బ్యాంకు ఉద్యోగిని ప్రియాంకా ముఖర్జీదీ ఇదే అనుభవం. ‘నాకు ఫొటోగ్రఫీ హాబీ. మంచి కెమెరా కోసం రిటైల్ షాపులు తిరిగాను. రూ.38 వేలకు తక్కువ ఎక్కడా లేవు. ఆన్‌లైన్‌లో సెర్‌‌చ చేస్తే దాదాపు రూ.27 వేలకే ఇష్టమైన కెమెరా సొంతమైంది’ అని ఫేస్‌బుక్‌లో కెమెరాతో సహా కామెంట్ పోస్ట్ చేసింది.
 
 మోర్ అండ్ మోర్ చాయిసెస్..
 ‘ఆన్‌లైన్‌లో అంతా మన ఇష్టమే. చాన్స్‌లూ మనవే, చాయిస్‌లూ వునవే! కస్టమర్స్ రివ్యూలు గైడ్ చేస్తాయి. ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ముఖ్యంగా టైమ్ సేవ్’.. ఇదీ సిటీ నెటిజనుల కామెంట్. ‘షాపింగ్ స్టైల్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు మార్చేశాయి. నా దీపావళి షాపింగ్ ‘స్మార్ట్’గా జరిగిపోయింది’ అని మాదాపూర్‌కి చెందిన టెకీ అజిత ట్వీట్ చేసింది. షోరూమ్స్‌లో ఇచ్చే డిస్కౌంట్లకు విశ్వసనీయత లేదు. అదే ఆన్‌లైన్ పోర్టల్స్ విషయానికొస్తే.. రెంటల్స్, ఉద్యోగుల జీతభత్యాలు, షోరూమ్ నిర్వహణ వ్యయాలు లేవు.
 
 ఈ మిగులునంతా అవి కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో అందిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని ప్రొడక్ట్‌లు, వెరైటీ గిఫ్ట్ ప్యాక్స్ కొన్ని సిటీల్లోనే లభిస్తున్నాయి. వాటిని పొందడం ఆన్‌లైన్‌లోనే సాధ్యం. ఇక రిప్లేస్ సౌకర్యం ఉంది. ఇదొకటి అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది ఆన్‌లైన్ కొనుగోళ్లలో ఆరు డీల్స్ స్మార్ట్‌ఫోన్, ట్యాబెట్ల నుంచే జరుగుతున్నాయని మార్కెటింగ్ రంగ నిపుణులైన కలిశెట్టి పద్మభూషణ్ చెప్పారు. సిటీలో దాదాపు 55 శాతం మంది పురుషులు, 45 శాతం మంది మహిళలు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్‌ల నుంచే ఆన్‌లైన్ పర్చేజెస్ నిర్వహిస్తున్నారన్నారు.
 
 అరగంటకే కంప్లీట్..
 ఒక అంచనా ప్రకారం.. హైదరాబాదీలు 30 నిమిషాల్లోనే సింపుల్‌గా ఆన్‌లైన్ షాపింగ్ కానిచేస్తున్నారు. ఐటెమ్స్ ఎంపికలోనూ గందరగోళం తక్కువేనట. ప్రత్యేకించి దీపావళి సామగ్రి కొనుగోలులో పర్యావరణహిత ఐటెమ్స్ ఏవో, ఎలాంటివో బయటి దుకాణాల్లో తెలియదు. అదే ఆన్‌లైన్ పోర్టల్స్‌లో వాటిని ఎకో-ఫ్రెండ్లీ క్యాటగిరీ కింద ఉంచుతున్నారు. ఎంచుకోవడం ఈజీ. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం.. కరెక్ట్ టైమ్‌కి డెలివరీ, వస్తువు నాణ్యత, నమ్మకం.. నగరవాసులను ఆన్‌లైన్ వైపు నడిపిస్తున్నారుు.
 
 హ్యాపీ.. అన్‌లిమిటెడ్
 ఈసారి ఫెస్టివ్ సేల్స్ ఆన్‌లైన్ బిజినెస్ ఎంతో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దివాలీ షాపింగ్ ఆన్‌లైన్ ట్రెండ్ నడుస్తోంది. పెన్‌డ్రైవ్స్ మొదలుకుని అత్యాధునిక బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లు ఆన్‌లైన్ ప్రమోషన్స్‌తో అమ్మకాలు పెంచుకోవడం ఈసారి విశేషం. షోరూమ్స్‌లో లిమిటెడ్ ఆఫర్లు, లిమిటెడ్ స్టాక్ సమస్య.. ఆన్‌లైన్‌లో అన్‌లిమిటెడ్. నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్స్ రోజుకు రూ.లక్ష బిజినెస్ చేస్తే.. ఆన్‌లైన్‌లో అంతకు ముఫ్పై ఇంతలు జరుగుతోంది. ముంబైలో ఈరోజు రిలీజైన ఓ బ్రాండెడ్ జీన్స్‌ని సిటీ యువత వెంటనే సొంతం చేసుకోగలుగుతోంది. ఇదే ఆన్‌లైన్‌లోని ప్రత్యేకత. ఇక డిస్కౌంట్ ఆఫర్లు కస్టమర్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.
 - కలిశెట్టి పద్మభూషణ్
 యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డైరెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement