E Shopping
-
గొల్లభామ చీరలు.. ఇంటి నుంచే కొనేయచ్చు
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఇకపై ఆ చీరలు కొనాలంటే సిద్దిపేటకు వెళ్లక్కర్లేదు. మరేషాప్కి పోనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఏంచక్కా ఆ చీరలను పొందవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఈ షాప్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ చీరలను బుక్ చేసుకుని హోం డెలివరీ పొందవచ్చు. ఈ షాప్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్లతోపాటు ఆ శాఖ ఈ కామర్స్ వెబ్‌పోర్టల్ ‘ఈ–షాప్’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏచ్పాటు చేసిన ప్రత్యేక ఈ కామర్స్ పోర్టల్ (www.eshop.tsposts.in) ను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ చేసిన కృషిని గవర్నర్ అభినందించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, వరంగల్ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్ కవర్లను గవర్నర్ తాజాగా ఆవిష్కరించారు. ప్రస్తుతం జీఐ ట్యాగ్‌కి సంబంధించి గొల్లభామ చీరలు ఈ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ కవర్లు భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ హోదా లభించగా, ఇందులో ఐదు ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్ కవర్లను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. -
ఈ సేల్స్.. సూపర్ !
మెట్రో నగరాల ర్యాంకులిలా.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, నాగపూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం నగరాలపై ఈ సర్వే చేశారు. ఆయా మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని పేర్కొంది. సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాల్లో ఆన్లైన్ కొనుగోళ్లు అదరగొడుతున్నాయి. నచ్చిన వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో మెట్రో సిటీజన్లు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఈ విషయంలో గ్రేటర్ సిటీజన్లు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆరోస్థానంలో నిలిచారు. స్మార్ట్ జనరేషన్గా మారుతున్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం. ప్రధానంగా 18– 35 ఏళ్ల మధ్యనున్న యువతరంలో సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్ పేర్కొంది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా రెండు నెలలుగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ డీల్స్ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేయడం విశేషం. ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి అందరికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం ఈ కామర్స్ ఇండస్ట్రీకి ఊతమిచ్చిందని సర్వేలో పేర్కొంది. ఏంకొంటున్నారంటే.. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెట్‌జన్లు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. వీటిలోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. పండగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్‌చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, ధమాకా సేల్స్‌తో సుమారు 20 ఈ– కామర్స్ సంస్థల సైట్లకు వ్యాపార డీల్స్ పంట పండినట్లు పేర్కొంది. పురుషులే అధికం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని వెల్లడైంది. వీరి వాటా 65 శాతం ఉండగా.. మహిళలు 35 శాతం మంది ఉన్నారు. పండగల సీజన్లో 18– 35 ఏళ్ల మధ్య మహిళలు, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్నట్లు తేలింది. వయసుల వారీగాకొనుగోళ్లు ఇలా.. నిత్యం ఆన్లైన్లో జరిగే కొనుగోళ్లలో యువతరమే అగ్రస్థానంలో నిలిచారు. 18– 35 వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది ఈ కొనుగోళ్లలో భాగస్వామ్యులవుతున్నారట. ఇక 36–45 ఏళ్ల వారు 8 శాతం, 45– 60 ఏళ్లున్నవారు కేవలం రెండు శాతం మాత్రమే ఆన్లైన్లో కొనుగోళ్లుజరుపుతున్నారట. -
దివాలీ ఆన్లైన్
పండుగ ఏదైనా.. హైదరాబాద్ ఆన్లైన్లోనే సెలబ్రేట్ చేసుకుంటోంది. నట్టింటి నుంచి కాలు కదపకుండానే, నెట్టింట్లో విహరిస్తూ షాపింగ్ ఎంజాయ్ చేస్తోంది. హైదరాబాదీలు అసలే షాప్హాలిక్స్.. ఆపై అందుబాటులో అరచేత ఇమిడిపోయే స్మార్ట్ గాడ్జెట్స్.. ఇక ఆన్లైన్ జోష్ 24X7 ఫార్మేట్లో నడుస్తోంది. షాపింగ్ వూల్స్కి వెళ్లాలంటే ట్రా‘ఫికర్’..బోర్. అదే ఆన్‌లైన్‌లోనైతే ఫుల్ హ్యాపీ. ఈ-టెయిలింగ్ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్లతో ఊరిస్తుండటంతో ‘ఈ’షాపింగ్ ట్రెండ్ హైఎండ్కు చేరుకుంటోంది. హైదరాబాద్‌లో దసరా ముందు మొదలైన ఆన్లైన్ హంగామా దీపావళి ముందు ధన్‌తెరాస్ నాటికల్లా తారస్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి ‘ఈ’ షాపింగ్ 350 శాతం పెరిగింది. అదే టైమ్‌లో షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలు 40 శాతం మేరకు పడిపోయినట్లు తాజా సర్వేల అంచనా. - సిటీప్లస్ డెస్క్ సిటిజన్ల లైఫ్స్టైల్లో ‘షాపింగ్’ ఓ ప్రెట్టీ థింగ్. గాడ్జెట్లు, ఫ్యాషన్.. కొత్త ట్రెండ్ ఏదొచ్చినా.. వెంటనే దాన్ని సెట్ చేసేసుకోవాల్సిందే. ఇందుకోసం గతంలో మాల్స్ చుట్టూ రౌండ్స వేసేవారు. ఇప్పుడు మంచి డీల్ ఆఫర్ చేసే ఈ-టెయిలర్స కోసం నెట్లో సెర్చ చేస్తున్నారు. చివరకు దీపావళికి ఇంటి ముంగిట కాంతులీనే దీపాల నుంచి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్, క్రాకర్స, టీవీలు, ఇంటీరియర్, ఫర్నిచర్ ఐటెమ్స్‌ను చిన్న ‘క్లిక్’ లేదా ‘టచ్’తో దరి చేర్చుకుంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం.. ఆయా పోర్టల్స్ ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలే. ‘నేను మంచి సౌండ్ సిస్టమ్ కోసం సిటీలోని ఎలక్ట్రానిక్స్ షోరూంలు తిరిగాను. రేటు విని వెనక్కి వచ్చేశా. ఫ్రెండ్ సలహాతో ఆన్లైన్ పోర్టల్స్ చూస్తే.. తక్కువ రేటుకే ఆఫర్ కనిపించింది. వెంటనే డీల్ ఓకే చేశా’నని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సిద్ధార్థ చెప్పాడు. బంజారాహిల్స్‌లోని బ్యాంకు ఉద్యోగిని ప్రియాంకా ముఖర్జీదీ ఇదే అనుభవం. ‘నాకు ఫొటోగ్రఫీ హాబీ. మంచి కెమెరా కోసం రిటైల్ షాపులు తిరిగాను. రూ.38 వేలకు తక్కువ ఎక్కడా లేవు. ఆన్లైన్లో సెర్చ చేస్తే దాదాపు రూ.27 వేలకే ఇష్టమైన కెమెరా సొంతమైంది’ అని ఫేస్బుక్లో కెమెరాతో సహా కామెంట్ పోస్ట్ చేసింది. మోర్ అండ్ మోర్ చాయిసెస్.. ‘ఆన్లైన్లో అంతా మన ఇష్టమే. చాన్స్‌లూ మనవే, చాయిస్‌లూ వునవే! కస్టమర్స్ రివ్యూలు గైడ్ చేస్తాయి. ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ముఖ్యంగా టైమ్ సేవ్’.. ఇదీ సిటీ నెటిజనుల కామెంట్. ‘షాపింగ్ స్టైల్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు మార్చేశాయి. నా దీపావళి షాపింగ్ ‘స్మార్ట్’గా జరిగిపోయింది’ అని మాదాపూర్‌కి చెందిన టెకీ అజిత ట్వీట్ చేసింది. షోరూమ్స్‌లో ఇచ్చే డిస్కౌంట్లకు విశ్వసనీయత లేదు. అదే ఆన్లైన్ పోర్టల్స్ విషయానికొస్తే.. రెంటల్స్, ఉద్యోగుల జీతభత్యాలు, షోరూమ్ నిర్వహణ వ్యయాలు లేవు. ఈ మిగులునంతా అవి కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో అందిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని ప్రొడక్ట్‌లు, వెరైటీ గిఫ్ట్ ప్యాక్స్ కొన్ని సిటీల్లోనే లభిస్తున్నాయి. వాటిని పొందడం ఆన్లైన్లోనే సాధ్యం. ఇక రిప్లేస్ సౌకర్యం ఉంది. ఇదొకటి అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది ఆన్లైన్ కొనుగోళ్లలో ఆరు డీల్స్ స్మార్ట్‌ఫోన్, ట్యాబెట్ల నుంచే జరుగుతున్నాయని మార్కెటింగ్ రంగ నిపుణులైన కలిశెట్టి పద్మభూషణ్ చెప్పారు. సిటీలో దాదాపు 55 శాతం మంది పురుషులు, 45 శాతం మంది మహిళలు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్‌ల నుంచే ఆన్లైన్ పర్చేజెస్ నిర్వహిస్తున్నారన్నారు. అరగంటకే కంప్లీట్.. ఒక అంచనా ప్రకారం.. హైదరాబాదీలు 30 నిమిషాల్లోనే సింపుల్‌గా ఆన్లైన్ షాపింగ్ కానిచేస్తున్నారు. ఐటెమ్స్ ఎంపికలోనూ గందరగోళం తక్కువేనట. ప్రత్యేకించి దీపావళి సామగ్రి కొనుగోలులో పర్యావరణహిత ఐటెమ్స్ ఏవో, ఎలాంటివో బయటి దుకాణాల్లో తెలియదు. అదే ఆన్లైన్ పోర్టల్స్‌లో వాటిని ఎకో-ఫ్రెండ్లీ క్యాటగిరీ కింద ఉంచుతున్నారు. ఎంచుకోవడం ఈజీ. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం.. కరెక్ట్ టైమ్‌కి డెలివరీ, వస్తువు నాణ్యత, నమ్మకం.. నగరవాసులను ఆన్లైన్ వైపు నడిపిస్తున్నారుు. హ్యాపీ.. అన్లిమిటెడ్ ఈసారి ఫెస్టివ్ సేల్స్ ఆన్లైన్ బిజినెస్ ఎంతో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం దివాలీ షాపింగ్ ఆన్లైన్ ట్రెండ్ నడుస్తోంది. పెన్‌డ్రైవ్స్ మొదలుకుని అత్యాధునిక బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లు ఆన్లైన్ ప్రమోషన్స్‌తో అమ్మకాలు పెంచుకోవడం ఈసారి విశేషం. షోరూమ్స్‌లో లిమిటెడ్ ఆఫర్లు, లిమిటెడ్ స్టాక్ సమస్య.. ఆన్లైన్లో అన్లిమిటెడ్. నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్స్ రోజుకు రూ.లక్ష బిజినెస్ చేస్తే.. ఆన్లైన్లో అంతకు ముఫ్పై ఇంతలు జరుగుతోంది. ముంబైలో ఈరోజు రిలీజైన ఓ బ్రాండెడ్ జీన్స్‌ని సిటీ యువత వెంటనే సొంతం చేసుకోగలుగుతోంది. ఇదే ఆన్లైన్లోని ప్రత్యేకత. ఇక డిస్కౌంట్ ఆఫర్లు కస్టమర్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. - కలిశెట్టి పద్మభూషణ్ యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డైరెక్టర్