Indian people
-
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
కార్పొరేట్ రంగంలో సాహో భారత్! గ్లోబల్ కంపెనీలను ఏలుతోంది మనోళ్లే..
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్‌బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్! ఇంతకీ ఏంటీ లిస్ట్ అంటారా? వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే! మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్.. రిటైల్.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ లీడర్స్ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!! అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్ పొజిషన్లను చేరుకుని భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది. 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్‌కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్‌కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్‌లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్‌క్లౌడ్ బిజినెస్‌తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి. గత సీఈఓ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ బామర్ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్ బిజినెస్ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్‌కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు. లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ.. ఫార్చూన్-500 ప్రపంచ టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు డబుల్ అన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు). సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్ డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ (మార్కెట్ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 47), టీసీఎస్ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 74), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 96) మాత్రమే ఉన్నాయి. ఏ రంగమైనా సై.. ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన.. మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్. అమ్మకాలపరంగా ఫైజర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్‌కు చెందిన వసంత్ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్‌వన్ కాఫీ రిటైల్ బ్రాండ్‌గా నిలుస్తున్న స్టార్‌బక్స్ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ బెన్కిసర్ సీఈఓగా కూడా పనిచేశారు. ప్రపంచ స్కాచ్ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్ విస్కీ బాటిల్స్‌లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్’ బ్రాండ్‌దే కావడం విశేషం. గ్లోబల్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్ కన్సల్టింగ్ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్‌ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్ రంజన్. బిగ్ అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీల్లో సైతం డెలాయిట్దే పైచేయి. ఇక మరో గ్లోబల్ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్ చీఫ్ రాజ్ సుబ్రమణ్యం, మల్టీనేషనల్ ఇంజినీరింగ్ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ చీఫ్ సురేంద్రలాల్ కర్సన్ భాయ్, గ్లోబల్ టాప్-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్ సారథి అనిల్ వాధ్వానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్ బ్యాంకింగ్ అగ్రగామి డీబీఎస్ గ్రూప్‌సీ ఈఓ పియూష్ గుప్తా, బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సీఎస్ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్‌వేర్ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్ కటారియా, డొమైన్ నేమ్ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్‌గా అవతరించారు. ఇక బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానెల్’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లూయీ విటోన్ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్ శరీన్, నోకియా రాజీవ్ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్ వినోద్ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్ దినేష్ పలివాల్, సిటీ బ్యాంక్ విక్రమ్ పండిట్, ట్విటర్ పరాగ్ అగర్వాల్ కూడా ఈ కోవకు చెందినవారే. మన మూలాలే బలం.. భారతీయులు గ్లోబల్ కంపెనీల్లో లీడర్‌షిష్ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్‌లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేసి, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ సీఈఓ పియూష్ గుప్తా విశ్లేషించారు. చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స. భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్‌లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది. దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు! అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్ పిచాయ్, వసంత్ నరసింహన్, లక్ష్మణ్ నరసింహన్, రాజేష్ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్ మూర్తి, రవి కుమార్, సీఎస్ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్ అష్రాఫ్ అలీ, కెనడా ఆటోమొబైల్ కాంపొనెంట్ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్‌పాల్ సింగ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స సైతం హెచ్‌పీఎస్‌లోనే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఏడాదికి రూ. 2,300 కోట్లు! ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్-10 సీఈఓల్లో సుందర్ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు) పైనే అని అంచనా. ఒక మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుందర్ పిచాయ్ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్‌ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్‌వర్త్ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్ అరవింద్ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్ అరోరా, స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం. అపూర్వసహోదరులు.. ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్ సృష్టించారు. మాస్టర్‌కార్డ్ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్ బంగా కోవిడ్ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాదు, అజయ్ సోదరుడు ఎంఎస్ బంగా సైతం ప్రపంచ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్లో టాప్ పొజిషన్లలో పని చేశారు. అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, కాఫీ కింగ్ స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్ క్లౌడ్ డేటా సర్వీసుల గ్లోబల్ కంపెనీ నెట్‌యాప్ సీఈఓ జార్జ్ కురియన్, గూగుల్‌క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు. -శివరామకృష్ణ మిర్తిపాటి -
వాచీలు, హ్యాండ్ బ్యాగులు అంటే మక్కువ
న్యూఢిల్లీ: దేశంలో అధిక ధనవంతుల్లో (రూ.250 కోట్ల, అంతకంటే ఎక్కువ) సగానికి పైనే ఈ ఏడాది వాచీలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, కళాకృతులను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. తద్వారా తమ అభిరుచులపై పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ద వెల్త్ రిపోర్ట్ 2023’ రూపంలో వెల్లడించింది. పది రకాల విలాసవంతమైన ఉత్పత్తులపై పెట్టుబడులను నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ఏటా ట్రాక్ చేస్తుంటుంది. 2022లో వీటిపై పెట్టుబడులు 16 శాతం పెరిగినట్టు తెలిపింది. ► అన్నింటికంటే కళాకృతులకు డిమాండ్ నెలకొంది. 2022లో వీటిపై రాబడులు 29 శాతంగా ఉండడం ఆసక్తికరం. ► క్లాసిక్ కార్లు (పాతం కాలం నాటి) 25 శాతం రాబడులతో రెండో స్థానంలో ఉన్నాయి. ఈ స్థాయి రాబడులు 9 ఏళ్ల కాలంలోనే అధికం కావడం గమనార్హం. ఉదాహరణకు మెర్సిడెజ్ బెంజ్ ‘ఉహ్లెన్‌హాట్ కూప్’ 2022లో 143 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. క్లాసిక్ కార్లలో ఇప్పటి వరకు గరిష్ట ధర పలికింది ఇదే కావడం గమనించాలి. ► గతేడాది లగ్జరీ వాచీల ధరలు 18 శాతం వృద్ధి చెందడంతో ఇవి మూడో స్థానంలో నిలిచాయి. ► లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, జ్యుయలరీ రాబడుల పరంగా 5, 6, 8వ స్థానాల్లో నిలిచాయి. ► అరుదైన విస్కీ ధరలు 3 శాతం పెరిగాయి. కానీ, గత పదేళ్ల కాలంలో ఈ పది పెట్టుబడుల్లోనూ అరుదైన విస్కీ అత్యధికంగా 373 శాతం రాబడులతో మొదటి స్థానంలో నిలిచింది. -
అమెరికాలో భారతీయం!
అమెరికా అంటేనే వలస దేశం. వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో నిండిపోయిన దేశం. కొత్తగా వలస వస్తున్న వారు తగ్గిపోయారు కానీ అమెరికా జనాభాలో ఇతర దేశాల వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందులో మన దేశానిదే అగ్రభాగం. అగ్రరాజ్యానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని సంతానాన్ని పెంచుకోవడంతో విదేశీ జనాభా పెరుగుతోంది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ది సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఈఎస్) అంచనాల ప్రకారం అమెరికాలో గత తొమ్మిదేళ్లలో భారతీయుల సంఖ్య ఏకంగా 49 శాతం పెరిగింది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ఏసీఎస్) 2018, జూలై 1 నాటికి అమెరికా జనాభా, అందులో విదేశీ ప్రజలు ఎంత మంది ఉన్నారు వంటి వివరాలతో ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం అమెరికా జనాభా 32.7 కోట్లు ఉంటే, వారిలో 4.47 కోట్ల మంది విదేశీయులే. అంటే మొత్తం జనాభాలో 13.7 శాతం విదేశీయులన్న మాట. 2010లో 4 కోట్ల మంది విదేశీయులు ఉంటే, ఎనిమిదేళ్లలో వారి సంఖ్య 11.8% అధికమైంది. భారతీయుల జనాభా 2010లో 18 లక్షలు 2018లో 27 లక్షలు పెరుగుదల 49% ► 1990 నుంచి చూస్తే మొత్తంగా భారతీయుల సంఖ్య పెరిగింది 500% ► 2018 జూలై ఒకటి నాటికి అమెరికాలో భారతీయులు 27 లక్షల మంది వరకు ఉన్నారు. అంతకు ముందు ఏడాది 26.1 లక్షల మంది ఉన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 1.5% పెరుగుదల కనిపించింది. చైనా జనాభా 2010లో 22 లక్షలు 2018లో 29 లక్షలు పెరుగుదల 32% -
500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 12 వేల హెచ్చరికలను పంపింది. అందులో 500 మంది భారతీయులూ ఉన్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడికి గురయ్యే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది. వాట్సాప్ వీడియో కాలింగ్‌లోని లోపం ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌సాయంతో పలు దేశాల ప్రభుత్వాలు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారం హ్యాక్ చేస్తున్నారన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. దాదాపు 50 దేశాలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులైన హ్యాకర్లు 270 మందిని టార్గెట్ చేసినట్లు గూగుల్ తెలిపింది. -
దుర్యోధనుడిదీ ఈ అహంకారమే
అంబాలా/న్యూఢిల్లీ: మహాభారతంలో దుర్యోధనుడిలో ఉన్న అహంకారం ప్రస్తుతం ప్రధాని మోదీలో కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే గత ఐదేళ్లలో రైతుల సంక్షేమం, మహిళల భద్రత, ఉద్యోగకల్పన విషయంలో తీసుకున్న సంస్కరణలపై ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారని ఓ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఈ మేరకు స్పందించారు. హరియాణాలోని అంబాలాలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక, ప్రధాని మోదీని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, రైతుల రుణాలు వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. ‘పొగరుబోతుతనం, అహంకారాన్ని భారతదేశం ఏమాత్రం క్షమించదు. ఇందుకు మహాభారతమే ఉదాహరణ. దుర్యోధనుడికి మోదీలో తరహాలో అహంభావం ఉండేది. వ్యక్తి నాశనమైపోయే సమయం వచ్చినప్పుడు మొట్టమొదట అతని వివేకం నశించిపోతుందని వ్యాఖ్యానించారు. మోదీకి గుణపాఠం తప్పదు.. ‘బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అసలైన సమస్యలపై మాట్లాడరు. తాము ఇచ్చిన హామీల్లో ఏయేవాటిని నెరవేర్చలేకపోయామో చెప్పరు. మోదీజీ.. భారత ప్రజలు చాలా తెలివైనవారు. మీరు వాళ్లను తప్పుదారి పట్టించలేరు. ప్రజలు ప్రతీనేతను జవాబుదారీతనంగా వ్యవహరించేలా చేయగలరు. మోదీని కూడా జవాబుదారీతనంతో ఉండేలా చేస్తారు. ప్రధాని అయిన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే ప్రజలంతా మీకు గుణపాఠం చెప్తారు’ అని హెచ్చరించారు. -
ఢిల్లీ పాలనపై మాదే అధికారం: కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం కేవలం ఢిల్లీ వాసులదే కాదనీ, ఇది మొత్తం భారత ప్రజలందరికీ చెందుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఢిల్లీ పరిపాలనపై అక్కడి ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రభుత్వానికన్నా తమకే ఎక్కువ అధికారాలు ఉన్నాయంటూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనలు వినిపించింది. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరే పరిపాలనాధిపతి అనీ, ముఖ్యమంత్రి కాదంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ అంశంపై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ వాదిస్తూ ‘దేశ రాజధాని దేశ ప్రజలందరికీ చెందుతుంది. వారేమో (ఆప్) అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటారు. మరి కేంద్రం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కూడా కాదు. అది ఒక కేంద్ర పాలిత ప్రాంతమే. ఆ ప్రాంత పరిపాలనపై ఢిల్లీ శాసనసభకన్నా కేంద్రానికే ఎక్కువ అధికారాలుంటాయి. కేంద్రంతోపాటు శాసనసభకూ కూడా ఇక్కడి పాలన విషయంలో సమానాధికారాలు ఉంటాయనడం అప్రజాస్వామికం. ఇలాగైతే జనవరి 26న ఢిల్లీలో కవాతు జరగాలా లేదా అనేది కూడా వారే నిర్ణయిస్తామంటారేమో’ అని అన్నారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది. -
అమెరికన్ల జీవితం విభిన్నం
ఉపాధి కోసం మన భారత ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు విరివిగా వలస వెళుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా దేశానికి వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ వివిధ రంగాల్లో స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ఈ వ్యాసంలో అమెరికన్ల జీవితానికి, మన ప్రజల జీవితానికి గల తేడాలను వివరించేందుకు ప్రయత్నించాను. దీనిని మన ఫ్యామిలీ పేజీలో తప్పకుండా ప్రచురిస్తారని ఆశిస్తున్నాను. అమెరికాలోని ప్రజల జీవన విధానానికి మన ప్రజల జీవన విధానానికి ఎంతో తేడా ఉంది. బిజీ లైఫ్‌లో ఇక్కడి ప్రజలు అన్ని పనులను యంత్రాల ద్వారానే చేసుకుంటున్నారు. ఇక్కడి ఇళ్లల్లో పని చేసేందుకు పని మనుషులు దొరకరు. ఎవరి పనులు వారే చక్కబెట్టు కోవాలి.భార్య భర్తలిద్దరూ ఉద్యోగులైనపుడు సమయం దొరకదు. వీకెండ్ రెండు రోజులను రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగించుకుంటారు. సముద్రపు బీచ్‌లకు ఇతర ప్రాంతాలకు వెళతారు. మరి కొంత మంది దేవాలాయాలకు వెళతారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. మన సంసృ్కతిని, ఆచారాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. రోజూ వారి పనులను ఎవరికీ వారే చేసుకోవాలి. బట్టలు ఉతకడానికి మన వద్ద ఉన్నట్లు వాష్ ఏరియాలు లేవు. ప్రతి అపార్టుమెంట్లో వాషింగ్ మెషిన్లకు ఒక రూంను కేటాయించారు. అక్కడ వాష్ చేసుకునేందుకు కొన్ని బాక్సులను, వాటిని డ్రై చేసేందుకు మరికొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. నెలలో నాలుగు పర్యాయాలు వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లి అందులో 1.25 డాలర్లను వేస్తే, ఆ యంత్రమే చక్కగా ఉతికేస్తుంది.వాటిని వెంటనే ఆరవేసేందుకు మరొక మెషిన్లో ఉంచితే అదే వాటిని డ్రై చేస్తుంది. ఆ మెషన్‌లో కూడా 1.25 డాలర్లను ఉంచాలి. ఒక సారి బట్టలు ఉతికేందుకు మన కరెన్సీలో సుమారు 90 రూపాయలు వ్యయం అవుతుంది. ఇక్కడి ప్రజలు సోమరులు కాదు. 60 సంవత్సరాలకు పై బడిన వారు కూడా సూపర్ మార్కెట్లలో పని చేస్తూ కనిపించారు. మహిళలు ఎక్కువ మంది కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను కూడా నడుపుతున్నారు. అందరికీ కార్లు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సైకిళ్లపై వెళతారు. లేదా సైకిళ్లను తమ కార్లకు కట్టుకుని పట్టణాల బయట సైకిలింగ్ చేస్తారు. రోడ్లపై పాదచారులు ఒక చోట నుంచి మరో చోటికి దాటేందుకు సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఎరుపు రంగులో చేతి గుర్తు చూపినప్పుడు ఆగిపోవాలి. తెల్ల రంగులో వచ్చినప్పుడు రోడ్డు దాటాలి. ప్రతి చోట పాదచారులకు పుట్ పాత్లున్నాయి. మన దేశంలో మాదిరిగా పుట్‌పాత్‌లపై చిన్న చిన్న దుకాణాలు అసలే కనిపించవు. అమెరికాలో క్రమశిక్షణ ఎక్కువ. ఇక్కడికి చదువు కునేందుకు వచ్చిన విద్వార్థి దగ్గర నుంచి లక్షల్లో సంపాదన ఉన్న పారిశ్రామిక వేత్త వరకు ఎవరైనా సరే నిబంధనలు కచ్చితంగా పాటించవలసిందే. సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఖచ్చితంగా సిగ్నల్స్ పాటిస్తారు. మన దేశంలో మాదిరిగా సిగ్నల్స్ జంప్ చేయడం వంటివి ఉండవు. రోడ్లు శుభ్రంగా గతుకులు లేకుండా ఉన్నాయి. ప్రతి ఇంటికి కార్లు ఉన్నాయి. కాబట్టి పార్కింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక స్థలాలను కేటాయించారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అమెరికాలో మంచు విపరీతంగా కురుస్తుంది. ఆ కాలంలో ప్రకృతి అంతా తెల్లని మంచు దుప్పటి కప్పు కుంటుంది. సూర్య రశ్మి రాదు. దీని కోసం ఇక్కడి ప్రజలు తపించి పోతారు. ఎండ వచ్చిన రోజున ఇక్కడి వారికి పండగే. ఇంట్లో కొళాయిల్లో వేడి నీరు, చల్లని నీరు వస్తుంది. మంచు కురుస్తున్న రోజుల్లో రోడ్లపై జన సంచారం చాలా తక్కువగా ఉంటుంది. రోడ్లపై ఏర్పడే మంచును ప్రభుత్వ సిబ్బంది ఎప్పటి కప్పుడు తొలగించినప్పటికీ, కార్లు నడపడం కష్టం. అందువల్ల చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే ఆన్లైన్లో పని చేస్తారు. తమకు కావలసిన సరుకులన్నీ వారానికి ఒక రోజు తీసుకు వస్తారు. ప్రతి ఇంట్లో హీటర్లు తప్పకుండా ఉంటాయి. రోజూ వారీ జీవితం..... సాధారణంగా అమెరికాలో కార్యాలయాలన్నీ ఉదయం 8 గంటలకు లేదా 9 గంటలకు ప్రారంభ మవుతాయి. సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు పని చేస్తాయి. ఇక్కడ ఎండా కాలంలో సూర్యుడు 9 గంటలకు అస్తమిస్తాడు. మళ్లీ 6 గంటలకు ఉదయిస్తాడు. అమెరికాలో పెద్ద నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ప్రజల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, రైళ్లు ఉంటాయి. కొన్ని పట్టణాల్లో సిటీ బస్సులు కేవలం డౌన్ టౌన్ వరకు ఉంటాయి. (అమెరికాలో కార్యాలయాలు ఉండే ప్రాంతాలను డౌన్ టౌన్ అంటారు) మన దేశంలో అధిక జన సాంద్రత కలిగిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,బెంగళూరు, హైదరాబాద్‌లలో అనేక మందికి కార్లు ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగిస్తారు. అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణ కనిపిస్తుంది. అమెరికాలో ప్రతి వారు వారి వారి ఉద్యోగాలకు తమ సొంత కార్లలోనే వెళతారు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు చేరుకావాలంటే ఇంటి నుంచి 7.15 గంటలకే బయలు దేరతారు. మన దేశంలో మాదిరిగా తీరిగ్గా క బుర్లు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేయరు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని, కాఫీ లేదా టీలో బిస్కట్లు వేసుకుని తింటారు. మరికొందరు బ్రేక్ ఫాస్ట్‌లో పాలలో బార్లీ, ఓట్స్ లాంటివి వేసుకుని వాటిని తినేసి హడావుడిగా బయలు దేరుతారు. మన దేశంలో మాదిరిగా ట్రాఫిక్ జామ్లుండవు. కార్యాలయాలకు వెళ్లాక అక్కడున్న చిన్న చిన్న రెస్టారెంట్లలో బ్రెడ్ ముక్కలు, ఆపిల్ పండ్లు, గుడ్లు తింటారు. ఇక మద్యాహ్నాం లంచ్ సమయంలో పిజ్జా లేదా 2 బ్రెడ్ స్లైస్, ఓ కప్ నూడుల్స్, ఒక ప్లేట్ అన్నం, ఒక కర్రీ ఉంటుంది. కొంత మంది ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుని తింటారు. ఆఫీసులో పర్సనల్ కాల్స్ అటెండ్ చేసేందుకు వీల్లేదు. అత్యవసర కాల్స్ మాత్రం అధికారుల అనుమతితో రిసీవ్ చేసుకుంటారు. కారే కీలకం..... కారు లేకుండా అమెరికాలో జీవించడం కష్టం. ప్రతి ఇంటికి కార్లున్నాయి. వాటిని పార్క్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు.చిన్న చిన్న టౌన్ షిప్‌లు, పట్టణాలు నగరాలను చాలా విశాలమైన ప్రదేశాలలో నిర్మించారు. మన హైదరాబాద్ నగరంలో పేటలు, గల్లీలు ఉన్నట్లుగానే ఇక్కడ కౌంటీలుంటాయి. ఉదాహరణకు మనకు తెలిసిన న్యూజెర్సీ అనేది ఒక రాష్ర్టం. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. సోమర్సెట్,బ్రిడ్జ్‌వాటర్,విల్లే, మోర్గాన్, ప్లెన్స్బరో, బ్రౌన్స్వీక్, జెర్సీసిటీ, ఎడిసన్ అనే పట్టణాలున్నాయి. అదే విధంగా శాన్ఫ్రాన్సిస్కో నగరంలో సన్నివేల్, యన్యన్సిటీ, ఫ్రీమాంట్, మిల్పెటాన్, శాన్‌హెసె అనే పట్టణాలున్నాయి. ఈ పట్టణాలన్నీ ఒకదాని కొకటి 15-20 మైళ్ల దూరంలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు, పిల్లలను స్కూల్లో వదిలి పెట్టేందుకు, ఇతర పనులకు సుమారు వంద మైళ్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర పనులపై వేరే నగరాలకు వెళ్లినా ఇక్కడ ఎయిర్‌పోర్టులలో కార్లను అద్దెకు తీసుకుని పనులు ముగించుకుని కార్లను వాపసు ఇచ్చేస్తారు. విద్యార్థిగా ఉన్న వారు కూడా పార్ట్ టైం జాబ్ చేసేందుకు సెకండ్హైండ్ కారు కొనుక్కుంటారు. కారులో నుంచి పనులు చక్కబెట్టుకుంటారు.... కారులోంచి దిగకుండా దారిలోనే రెస్టారెంట్ దగ్గర కాఫీ, లేదా స్నాక్స్ కొనుక్కుని తింటారు. డ్రైవ్ రెస్టారెంట్లలో ఒక కిటికీలో ఆర్ఢర్ ఇస్తారు. మరో కిటికీలో తాము కొనుక్కున్న వస్తువులను తీసుకుంటారు. అదే విధంగా డ్రైవ్ త్రూ బ్యాంక్‌లో చెక్కులు డిపాజిట్ చేస్తారు. డ్రైవ్ త్రూ ఫార్మసీలో తమకు కావలసిన మందులను కొనుక్కుంటారు. కారులోనే కూర్చుని అన్నీ పనులను చక్కబెట్టుకుంటారు. వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యం..... అమెరికన్లు వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తారు. అనేక మంది రోడ్లపై జాగింగ్ చేస్తారు. ప్రతి అపార్టుమెంట్లో స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. ఇతర వ్యాయామాలకు అడుగడుగునా జిమ్స్ ఉన్నాయి. ప్రతి గురువారం సాయంత్రం ఇక్కడ సంగీత కచేరీలు జరుగుతాయి. ఎవరి మడత కుర్చీలను వారే తెచ్చుకుంటారు. స్నాక్స్ తింటూ బీరు తాగుతూ చాలా జాలీగా గడుపుతారు. ఇక బీచుల్లో స్నానం చేసి, ఎండకు శరీరాన్ని ఆరబెట్టుకుంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. జనాభా 31,38,47,465. విస్తీర్ణం-35,39,225 స్కేర్ మైళ్లు. 50 సంవత్సరాలుగా అమెరికా దేశానికి మన దేశ ప్రజలు వలస రావడం ప్రారంభమైంది. ఇక్కడ మన ప్రజలు అన్ని రంగాల్లో స్థిర పడ్డారు. సిలికాన్ వేలీలో కూడా కీలకమైన పదవులు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని ప్రతి పది కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారు. గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇక్కడ అత్యధికంగా నివసిస్తున్నారు. ఎయిర్ ఇండియా ఇక్కడికి రెగ్యులర్‌గా విమానాలను నడుపుతోంది. ఇదిలా ఉండగా భూగోళానికి ఆవలి వైపున, వేల మైళ్ల దూరంలోని తమ బంధువులతో మాట్లాడేందుకు ఇంటర్నెట్లోని ‘స్కైపీ’ని ఉపయోగించుకుంటున్నారు. ఆదునికి సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులోకి వచ్చిన కారణంగా మానసికంగా అమెరికాలోని మన ప్రజలకు, భారత్‌లోని వారి బంధువులకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ప్రతి రోజూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుని తృప్తి పడుతున్నారు. గతంలో ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకునేందుకు వందల రూపాయలు వ్యయం చేయవలసి వచ్చేది. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు 1,13,813 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీటీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. 2,90,133 మంది విద్యార్థులతో చైనా మొదటి స్థానంలో ఉంది. అమెరికా నుంచి-జి.గంగాధర్ (సిర్ప) సీనియర్ సబ్ ఎడిటర్ ‘సాక్షి’