అమెరికా అంటేనే వలస దేశం. వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో నిండిపోయిన దేశం. కొత్తగా వలస వస్తున్న వారు తగ్గిపోయారు కానీ అమెరికా జనాభాలో ఇతర దేశాల వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందులో మన దేశానిదే అగ్రభాగం. అగ్రరాజ్యానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని సంతానాన్ని పెంచుకోవడంతో విదేశీ జనాభా పెరుగుతోంది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ది సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఈఎస్) అంచనాల ప్రకారం అమెరికాలో గత తొమ్మిదేళ్లలో భారతీయుల సంఖ్య ఏకంగా 49 శాతం పెరిగింది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ఏసీఎస్) 2018, జూలై 1 నాటికి అమెరికా జనాభా, అందులో విదేశీ ప్రజలు ఎంత మంది ఉన్నారు వంటి వివరాలతో ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం అమెరికా జనాభా 32.7 కోట్లు ఉంటే, వారిలో 4.47 కోట్ల మంది విదేశీయులే. అంటే మొత్తం జనాభాలో 13.7 శాతం విదేశీయులన్న మాట. 2010లో 4 కోట్ల మంది విదేశీయులు ఉంటే, ఎనిమిదేళ్లలో వారి సంఖ్య 11.8% అధికమైంది.
భారతీయుల జనాభా
2010లో 18 లక్షలు
2018లో 27 లక్షలు
పెరుగుదల 49%
► 1990 నుంచి చూస్తే మొత్తంగా భారతీయుల సంఖ్య పెరిగింది 500%
► 2018 జూలై ఒకటి నాటికి అమెరికాలో భారతీయులు 27 లక్షల మంది వరకు ఉన్నారు. అంతకు ముందు ఏడాది 26.1 లక్షల మంది ఉన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 1.5% పెరుగుదల కనిపించింది.
చైనా జనాభా
2010లో 22 లక్షలు
2018లో 29 లక్షలు
పెరుగుదల 32%
అమెరికాలో భారతీయం!
Published Sun, Dec 1 2019 4:17 AM | Last Updated on Sun, Dec 1 2019 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment