హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2022లో ప్రధాన నగరాల్లో 5.1 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. పరిమాణం పరంగా ఇది రెండవ అత్యుత్తమ రికార్డు. హైదరాబాద్, పుణే, బెంగళూరులో లక్షకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాలకు అత్యధిక డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
డీల్స్‌లో ఒక లక్షకుపైగా చదరపు అడుగుల స్థలం కలిగినవి హైదరాబాద్, పుణే లో 53 శాతం, బెంగళూరులో 51% ఉన్నాయి. అంతర్జాతీయ ఐటీ, తయారీ కంపెనీలు ఈ డిమాండ్‌ను నడిపించాయి. 50,000 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవి కోల్‌కతలో 70 %, చెన్నైలో 57 శాతం నమోదయ్యాయి. 50,000– 1,00,000 చదరపు అడుగుల విభాగంలో అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలో డీల్స్ 30 శాతంపైగా ఉన్నాయి’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment