best city
-
ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాదించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నగరాలకు ర్యాంక్ ఇస్తున్నారు.టాప్ 10 నివాసయోగ్యమైన నగరాలు ఇవే..1. వియన్నా, ఆస్ట్రియా2. కోపెన్హాగన్, డెన్మార్క్3. జ్యూరిచ్, స్విట్జర్లాండ్4. మెల్బోర్న్, ఆస్ట్రేలియా5. కాల్గరీ, కెనడా6. జెనీవా, స్విట్జర్లాండ్7. సిడ్నీ, ఆస్ట్రేలియా8. వాంకోవర్, కెనడా9. ఒసాకా, జపాన్10. ఆక్లాండ్, న్యూజిలాండ్జాబితాలో దిగువన ఉన్న 10 నగరాలు1. కారకాస్, వెనిజులా2. కీవ్, ఉక్రెయిన్3. పోర్ట్ మోర్స్బీ, పపువా న్యూ గినియా4. హరారే, జింబాబ్వే5. ఢాకా, బంగ్లాదేశ్6. కరాచీ, పాకిస్థాన్7. లాగోస్, నైజీరియా8. అల్జీర్స్, అల్జీరియా9. ట్రిపోలీ, లిబియా10. డమాస్కస్, సిరియా -
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
ఆఫీస్ లీజింగ్ 5.1 కోట్ల చదరపు అడుగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2022లో ప్రధాన నగరాల్లో 5.1 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. పరిమాణం పరంగా ఇది రెండవ అత్యుత్తమ రికార్డు. హైదరాబాద్, పుణే, బెంగళూరులో లక్షకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలాలకు అత్యధిక డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. డీల్స్‌లో ఒక లక్షకుపైగా చదరపు అడుగుల స్థలం కలిగినవి హైదరాబాద్, పుణే లో 53 శాతం, బెంగళూరులో 51% ఉన్నాయి. అంతర్జాతీయ ఐటీ, తయారీ కంపెనీలు ఈ డిమాండ్‌ను నడిపించాయి. 50,000 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవి కోల్‌కతలో 70 %, చెన్నైలో 57 శాతం నమోదయ్యాయి. 50,000– 1,00,000 చదరపు అడుగుల విభాగంలో అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబైలో డీల్స్ 30 శాతంపైగా ఉన్నాయి’ అని వివరించింది. -
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్‌కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
నంబర్ వన్‌గా హైదరాబాద్!
హైదరాబాద్: ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లు అయినా, జాతీయ స్థాయి సర్వేల్లోనైనా విశ్వనగరం హైదరాబాద్‌కు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందనే విషయం మరోసారి నిరూపితమైంది.ఇటీవల జేఎల్ఎల్(జోన్స్ ల్యాంగ్ లస్యాలే) సిటీ మొమెంటం ఇండెక్స్ 2020లో ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా ఎన్నికైన భాగ్యనగర మణిహారంలో మరో మణిపూస చేరింది. హాలిడిఫై.కామ్ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ పట్టణాలలో నంబర్ వన్‌గా నిలిచింది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొంటూ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వే తెలిపింది. (చదవండి: ఎస్ఐ.. మై హీరో ఆఫ్ ది డే) ఇక పర్యాటకులు, ప్రయాణీకులకు సరైన గమ్యస్థానాన్ని సూచించే ఈ వెబ్సైట్.. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలకు స్థానం కల్పిస్తూ, విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు పేర్కొంది. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరావృద్ధి, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాల ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్‌కు 5 పాయింట్లకు గానూ 4 పాయింట్లు లభించినట్లు వెల్లడించింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి పలు ప్రధాన పట్టణాలను వెనక్కినెట్టి భాగ్యనగరం ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. (చదవండి: శానిటైజర్ కొంటలేరు... ) అదే విధంగా హైదరాబాద్‌లో పర్యటించేందుకు సెప్టెంబరు- మార్చి మధ్య కాలం అనువైనదని, చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటతో పాటు అనేకానేక గొప్ప గొప్ప ప్రదేశాలను సందర్శించవచ్చని తెలిపింది. దక్షిణ భారతదేశ న్యూయార్క్ సిటీగా రూపాంతరం చెందే దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోందని కితాబిచ్చింది. తెలంగాణలో ఉన్న అత్యంత గొప్ప ప్రదేశమని పేర్కొంది. ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన పట్టణమని పలువురు అభిప్రాయపడినట్లు తెలిపింది. భద్రతాపరంగా, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అంశాల పరంగా హైదరాబాద్ అత్యుత్తమమైందని నవతే తులసీ దాస్ వ్యాఖ్యానించారని పేర్కొంది. ఇక వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో 2020లో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో హైదరాబాద్ నగరం అగ్రస్థానం పొందడంతో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగా గుర్తింపు పొందింది. -
ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్
ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ అడ్వాంటేజెస్! సాక్షి, హైదరాబాద్: 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురానుంది. వినూత్న నిర్మాణాలతో స్వాగతం.. కాస్మోపాలిటన్ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో బెంగళూరు బీట్.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్ ఎండీ ఎస్ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. -
భాగ్యనగరం.. ఉక్కునగరం!
హైదరాబాదే ఎందుకంటే.. హైదరాబాద్‌కు వలసల తాకిడి పెరిగేందుకు భిన్నసంస్కృతుల మేళవింపే ప్రధాన కారణం. దక్కన్ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం, ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ. నేరాలు రేటు అంతంతే. ఆధునిక జీవన శైలి.. ఐటీ హబ్, బహుళ జాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాలప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు సాప్‌్టవేర్ నిపుణులు, మానవవనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో అంకుర పరిశ్రమల రాకకు దోహదపడుతున్నాయి. ఇవేగాకుండా లైఫ్‌స్టైల్ తగ్గట్టుగా వినోద, రవాణా సౌకర్యాలు కలిగిఉండటం కూడా హైదరాబాద్‌కు ప్లస్‌పాయింట్‌గా మారింది. విశాఖకు కూడా.. మహానగరాలతో విశాఖపట్నం కూడా పోటీ పడుతోంది. సుదూర సముద్రతీరం.. నౌక వాణిజ్యం, పర్యాటక రంగానికి వైజాగ్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న రియల్‌రంగం.. సినీ స్టూడియోల నిర్మాణంతో నగరం బ్రాండ్ విలువ క్రమంగా పెరిగేందుకు కారణమవుతుంది. అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, రామకృష్ణ, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగానికి అనువైన ప్రాంతంగా సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు భావిస్తుండటం కూడా స్టార్టప్ కంపెనీల రాకకు ఊతమిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : వాతావరణం, భిన్న సంస్కృతులు, భాషలు, తక్కువ క్రైం రేట్, క్రమంగా ఊపందుకుంటున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, విశాఖపట్నం వైపు చూసేలా చేస్తున్నా యి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన భాగ్యనగరంతో పాటు విశాఖపట్నం జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఓ ఆర్థిక సంస్థ నిర్వహించిన సర్వేలో నివాసానికి, వ్యాపారానికి అనువైన నగరాల్లో ఈ రెండూ ఉన్నాయని తేల్చింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు చూపు.. మహా నగరాల్లో నివసించడం అంటే ఒకప్పుడు అందరికీ క్రేజ్. అదే ఇప్పుడు ఆ నగరాల నుంచి ఎప్పుడు బయటపడుదామనే చూపులు. దీనికి ప్రధాన కారణం మెట్రో నగరాల్లో పెరిగిన జీవన వ్యయం, కాలుష్యం, ఆరోగ్య సమస్యలే. దీంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణేల నుంచి ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన ఇండోర్, కొచ్చి, సూరత్, భువనేశ్వర్, నాసిక్, విశాఖపట్నం వంటి నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. నివాసానికేగాకుండా.. అంకుర పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు ఈ నగరాలు కూడా అనువైనవిగా భావిస్తుండటమే దీనికి కారణం. మరీ ముఖ్యంగా జీవనవ్యయం కూడా చాలా తక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఇక్కడికి రెక్కలు కట్టుకుని వాలేందుకు రెడీ అవుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ నగరాలను ఎంచుకోవడం వల్ల సంపాదించిన దాంట్లో కాస్తో కూస్తో వెనకేసుకోవచ్చనే ఆలోచన కూడా వలసల తాకిడి పెరిగేందుకు కారణమవుతోంది. మరో ముఖ్యమైన విషయమేమంటే.. బడా నగరాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవడం కష్టంగా మారిన క్రమంలో రెండో కేటగిరీ నగరాలకు మళ్లేందుకు దారితీస్తోంది. కేవలం సొంతిల్లే కాదు.. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది. -
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లండన్
లండన్: ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి వరుసగా రెండోసారి విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ నగరాలైన టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితాను బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) బుధవారం విడుదల చేసింది. ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది. మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకులను విడుదల చేయగా.. భారత్ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై–85, ఢిల్లీ–113, చెన్నై–115వ స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న భారతీయ విద్యార్థులు.. భారతదేశం నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017–18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017–18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016–17లో ఆ సంఖ్య 4,545గా ఉంది. అయితే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం వీసా జారీ ప్రక్రియ నిబంధనలు కొంతమేర కు కఠినతరంగా ఉండటంతో భారతీయ విద్యార్థులు లండన్ వైపు మొగ్గు చూపట్లేదని నివేదిక పేర్కొంది. అందుకే అగ్రస్థానం లండన్‌లోని విద్యార్థుల హర్షం విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ ఎంపిక కావడం పట్ల అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉత్తమ నగరంగా లండన్ ఎంపిక సరైనదేనంటున్నారు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు, వైవిధ్యభరితమైన విద్యార్థి సంఘాలు వంటివి లండన్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టాయని వివరిస్తున్నారు. యూరప్ ఆధిపత్యం టాప్–120 సిటీల్లో యూరప్ నగరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జర్మనీలోని మ్యూనిచ్ 4, బెర్లిన్ 5వ స్థానాల్లో నిలిచాయి. పారిస్ 7వ స్థానం, జ్యూరిచ్(స్విట్జర్లాండ్) 8వ స్థానం దక్కించుకున్నాయి. మాంట్రియల్ (కెనడా) 6వ స్థానం, సిడ్నీ(ఆస్ట్రేలియా) 9వ స్థానం, సియోల్(దక్షిణ కొరియా) 10వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్–30లో మరో రెండు బ్రిటిష్ నగరాలైన ఎడిన్బర్గ్ 15వ ర్యాంకు, మాంచెస్టర్ 29వ ర్యాంకు పొందాయి. -
మెర్సర్ సర్వేలో బెస్ట్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన మెర్సర్ సంస్థ సర్వేలో వరుసగా నాలుగో ఏడాది ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఎంపికైందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన మెర్సస్ సంస్థ నగరంలోని శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకుని దేశంలోనే బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిటీగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ఘనత సాధించడంలో సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలదే కీలక పాత్రని కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ గుర్తింపును దృష్టిలో పెట్టుకుని నగర పోలీసు విభాగం మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. -
సొంతమైనా... అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్..!
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా హైదరాబాద్ అత్యుత్తమ నగరం. ఆస్తిని కొనుగోలు చేయడానికైతే మాత్రం అహ్మదాబాద్ది రెండో స్థానం. అదే కేవలం ఇల్లు అద్దెకివ్వడానికే అయితే మాత్రం ఢిల్లీ చాలా బెటర్. ఇక ఇల్లు కొనేందుకైనా, అద్దెకిచ్చేందుకైనా అత్యంత ఖరీదైన నగరం మాత్రం ముంబై..’ ఇదీ... వ్యక్తిగత ఆర్థిక సేవల కంపెనీ అయిన అర్థయంత్ర.కామ్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు. ఇల్లు కొనడం, అద్దెకివ్వడం అనే అంశాలపై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె వంటి ఎనిమిది నగరాల్లో సర్వే చేసి ‘బై వర్సెస్ రెంట్ రిపోర్ట్-2014’ సెకండ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. నివేదికలో హైదరాబాద్‌కు సంబంధించిన మరిన్ని విషయాలివీ... దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే రెండేళ్లుగా ధరలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వెయ్యి చ.అ.లకు రూ. 41.75 లక్షలు పలుకుతోంది. గతేడాది రూ. 37.64 లక్షలుగా ఉంది. అంటే ఏడాదిలో రూ. 4.11 లక్షలు పెరిగింది. రూ. 10 లక్షల నుంచి రూ. 11 లక్షల ఆదాయం గల వారు హైదరాబాద్‌లో తేలికగా ఇల్లు కొనుక్కోవచ్చు. కాకపోతే ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే చాలు. హైదరాబాద్‌లో సగ టు అద్దె ధర రూ. 12 వేలుగా ఉంది. అద్దె కోసం ఆస్తిని కొనాలనుకునేవారికి కూడా హైదరాబాదే మంచి ప్రాంతం. ఎందుకంటే నగరంలో ఈ ఏడాది అద్దె విలువలు 15 శాతం మేర పెరిగాయి. గతేడాది 11 శాతం మేర ఆస్తుల విలువలు వృద్ధి చెందాయి. మెరుగైన కార్పెట్ ఏరియా అందించడంలో కూడా హైదరాబాదే మెరుగైంది. ముంబై, ఢిల్లీలో ప్రతి ఏటా కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గిపోతోంది. రూ. లక్ష పెట్టుబడికి హైదరాబాద్‌లో ఈ ఏడాది గరిష్టంగా 23.95 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. ఇదే గతేడాది 26.57 చ.అ.లుగా ఉంది. అహ్మదాబాద్‌లో ఈ ఏడాది 20.18 చ.అ., పూణేలో గతేడాది 18.55 చ.అ., ఈ ఏడాది 23.39 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చు. బెంగళూరులో గతేడాది 16.01 చ.అ., ఈ ఏడాది 18.39 చ.అ., కోల్‌కత్తాలో గతేడాది 15.69 చ.అ., ఈ ఏడాది 19.52 చ.అ., కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా చెన్నైలో గతేడాది 13.16 చ.అ., ఈ ఏడాది 13.96 చ.అ., ఢిల్లీలో గతేడాది 8.55 చ.అ., ఈ ఏడాది 9.19 చ.అ., ముంబైలో గతేడాది 7.50 చ.అ., ఈ ఏడాది 9.15 చ.అ. స్థలం కొనుగోలు చేయవచ్చని అర్థయంత్ర.కామ్ సర్వేలో తేలింది. ఇల్లు కొనేందుకు అహ్మదాబాద్ 2వ స్థానం, అద్దెకుండేందుకు మాత్రం 5వ స్థానంలో నిలిచింది. ఇల్లుకొనేందుకు బెంగళూరు 4వ స్థానం, అద్దెకుండేందుకు 3వ స్థానంలో ఉంది. ఇల్లు కొనేందుకైనా, అద్దెకివ్వడానికైనా అత్యంత ఖరీదైన నగరం ముంబై. ఢిల్లీ నగరం కేవలం అద్దెకుమాత్రమే అనువైందని సర్వేలో తేలింది. లాభనష్టాలు తెలుసుకోవచ్చు.. ఇల్లు కొనడం లేదా అద్దెకివ్వడం వ్యక్తి ఆర్థిక అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. అద్దె విలువ, ఆస్తి ధర, స్థూల ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే సాగింది. బడ్జెట్‌కు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకున్నాకే ఇల్లు కొనుగోలు చేయడంలో నిర్ణయం తీసుకోవాలి. సర్వేలోని అన్ని వివరాలను నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నప్పుడు మేలు జరుగుతుంది. - నితిన్ బీ వ్యాకరణం, అర్థయంత్ర ఫౌండర్, సీఈఓ