
లండన్: ప్రపంచంలో అత్యుత్తమ నగరాల జాబితాలో వరసగా పదోసారి లండన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత టాప్–10 స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నిలిచాయి. 2025 ఏడాదికి సంబంధించిన టాప్–100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం.
అయితే కనీసం టాప్–100 కూడా భారతీయ నగరాలకు చోటు దక్కకపోవడం విచారకరం. సహజసిద్ధ వాతావరణం, ఇక్కడే జీవించాలనేంతగా జీవన అనుకూల పరిస్థితులు, సంప్రదాయాలు, రాత్రి జీవితం తదితరాలను పరిగణనలోకి తీసుకుని రీసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్పోస్‌లు సంయుక్తంగా 2025 ఏడాదికి అత్యుత్తమ నగరాల జాబితాను సిద్ధంచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment