సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో రెసిడెన్షియల్ హౌసింగ్ డిమాండ్ జోరుగా హుషారుగా కొనసాగుతోంది. మార్చిలో నమోదైన రూ.3,352 కోట్ల విలువైన ఇళ్ల కొనుగోలు డీల్స్ ఈ జోష్‌కు అద్దం పడుతున్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) నివేదిక ప్రకారం హైదరాబాద్, మేడ్చెల్ మల్కజ్‌గిరీ, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల ధరలు ఎంతైనా సరే.. తగ్గేదేలే అన్నట్టు కొనుగోలుకు ఎగబడుతున్నారు జనం. క్క మార్చి నెలలోనే 6,414 అపార్ట్‌మెంట్లు బుకింగ్స్ జరిగాయంటేనే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రితం నెలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఆర్బీఐ (ఈసారి యథాతథమే) వడ్డీరేట్ల ప్రకారం గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు మార్చిలో బలంగా కొనసాగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. (Vinod Rai Gupta Net Worth: వయసు 78, రూ. 32 వేలకోట్ల సంపద, ఆమె బిజినెస్ ఏంటి?)
నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి 2023లో నమోదైన మార్చి మొత్తం ఇళ్లలో 53 శాతం ధర రూ. 25 లక్షల-50 లక్షల మధ్య ఉండగా, నమోదైన మొత్తం విక్రయాల్లో 70 శాతం 1,000 చ.అ.ల నుంచి 2వేల మధ్య ఉన్న ఇళ్లకు సంబంధించినవి. రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లు 29 శాతంగా ఉన్నాయి. మార్చి 2023లో రూ. 25 లక్షల కంటే తక్కువున్న ఇళ్ల డిమాండ్ వాటా 18 శాతంగా ఉంది. 'లార్జర్ టికెట్ సైజ్ హోమ్స్ కు డిమాండ్ మరింత పెరుగుతోందని రూ.1 కోటి, ఆపైన విలువ గల ఇళ్లకు డిమాండ్ బాగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఏడాది మార్చిలో 6 శాతంగా ఉన్న డిమాండ్ 2023 నాటికి 10 శాతానికి పెరిగింది. మొత్తం విక్రయాలు జరిగిన ఇళ్లలో వీటి షేరు 70 శాతం ఎక్కువని శాంసన్ ఆర్థుర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వినియోగదారులు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులపై, ప్రయోజనాలపై బలమైన విశ్వాసంతో ఉన్నారని, నగరంలో అప్‌బీట్ అవుల్ లుక్‌ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. (15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా)
Comments
Please login to add a commentAdd a comment