భారతదేశంలో విభిన్న రంగాల్లో (ఆర్థిక పరిస్థితులు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పాలన) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల జాబితాను నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్, ఆర్థిక రంగంలో బెంగళూరు, పాలన, మౌలిక సదుపాయాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నాయి.
➤రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. హైదరాబాద్లో అపార్ట్మెంట్లకు, ఇతర స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో పోలిస్తే ఇక్కడ ధరలు కూడా 11 శాతం పెరిగాయి.
➤ఆర్థిక పరిస్థితుల పరంగా బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉన్నాయి. అత్యధిక శ్రామిక శక్తి కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉంది. బెంగళూరులో వ్యాపార కార్యకలాపాలు అధికంగా జరుగుతాయి.
➤భౌతిక మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ రెండో స్థానంలోనూ.. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయి. భారతదేశపు అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగి ఢిల్లీ మెట్రో రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 68 లక్షల కంటే ఎక్కువే.
➤ఇక చివరిగా పాలన విషయానికి వస్తే.. ఈ విభాగంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ వంటి ఢిల్లీ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, మెరుగైన పబ్లిక్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని నివేదికలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment