దేశంలో 2030 నాటికి దాదాపు రూ.67 లక్షల కోట్లు విలువ చేసే గృహాల కొరత ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలకు 3.12 కోట్ల కొత్త ఇళ్లు అవసరం అవుతాయని ఇండస్ట్రీ బాడీ సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం జరిగిన ఒక సమావేశంలో సంయుక్తంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి.
నివేదికలోని వివరాల ప్రకారం..
పెరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల 2030 నాటికి దేశంలోని వివిధ పట్టణ కేంద్రాల్లో 2.2 కోట్ల గృహాలు అవసరం అవుతాయి.
ఇందులో 2.1 కోట్ల గృహాలు(95.2 శాతం) ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందుబాటులో ఉండాలి.
ప్రస్తుతం 1.1 కోట్ల యూనిట్ల ఇళ్ల కొరత ఉంది. మొత్తంగా 2030 నాటికి వీటి డిమాండ్ 3.2 కోట్లకు చేరనుంది.
ఈమేరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ .67 లక్షల కోట్ల రియల్టీ వ్యాపారం జరుగుతుందని అంచనా.
ప్రస్తుతం గృహాల కొనుగోలు రుణ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీ) రూ.6.9 లక్షల కోట్లు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌సీబీ) రూ .6.2 లక్షల కోట్ల రుణ విలువను కలిగి ఉన్నాయి.
భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు అందజేసే గృహ రుణ వాటా మరింత పెరగనుంది.
కొత్తగా ఇళ్లు కొనేవారు దాదాపు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని అంచనా.
మొత్తం రూ.67 లక్షల కోట్ల మార్కెట్‌లో దాదాపు రూ.45 లక్షల కోట్లు బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీలు ప్రజలకు ఫైనాన్సింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!
నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..‘2030 నాటికి దేశంలో పెద్దమొత్తంలో గృహాలు అవసరం అవుతాయి. అప్పటివరకు చాలా ఇళ్ల కొరత కూడా ఏర్పడనుంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ ఏర్పడుతుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment