8 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు..ఎంతంటే? | Average Housing Prices Up 5 percent In Top 8 Cities | Sakshi
Sakshi News home page

8 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు..ఎంతంటే?

Published Mon, Nov 21 2022 8:31 PM | Last Updated on Mon, Nov 21 2022 9:30 PM

Average Housing Prices Up 5 percent In Top 8 Cities - Sakshi

కోవిడ్‌-19 కారణంగా  ఇళ్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అదే సమయంలో ఇంటి నిర్మాణ ఇన్‌ పుట్‌ కాస్ట్‌ ధరలు పెరగడం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం నుండి సగటున ఇళ్ల ధరలు దాదాపు 5 శాతం పెరిగాయని ఒక నివేదిక తెలిపింది.
 
ఎనిమిది నగరాల్లోని ప్రైమరీ మార్కెట్‌లో రెసిడెన్షియల్‌ ధరలు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 6,600-రూ 6,800గా ఉన్నాయి. కానీ గతేడాది డిసెంబర్‌ చివరి నాటికి రూ.6,300 - రూ 6,500గా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లోని కీలక మైట్రో మార్కెట్లలో ధరలు అధిక స్థాయిలో పెరిగాయని నివేదిక పేర్కొంది. 

రియల్ ఇన్‌సైట్ నివేదిక ప్రకారం, పూణే 2021 చివరినాటికి చదరపు అడుగుకు రూ. 5,100-రూ. 5,300 నుండి జూలై-సెప్టెంబర్ 2022లో చదరపు అడుగులకు రూ. 5,500-రూ. 5,700 (చదరపు అడుగులు) తో 7 శాతం పెరిగింది.

►  హైదరాబాద్‌లో చదరపు అడుగుల 4శాతం పెరిగి రూ.5900 - 6,100 నుంచి రూ.6,100- రూ.6,300 వరకు పెరిగాయి.  

చెన్నైలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 5,400-రూ 5,600 నుండి రూ. 5,500-రూ 5,700 కి స్వల్పంగా 2 శాతం పెరిగాయి .

బెంగళూరులో  ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 5,900-రూ. 6,100కి చేరుకున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ధరలు చదరపు అడుగుకు రూ.4,400 -రూ. 4,600 నుండి రూ. 4,700- రూ. 4,900కి 5 శాతం పెరిగాయి .

గృహాల ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 6,100-రూ. 6,300కి చేరుకున్నాయి.

కోల్‌కతాలో 3 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 4,400-రూ 4,600కి చేరుకుంది.

ముంబైలో చదరపు అడుగు 3శాతం పెరిగి రూ. 9,900 రూ. 10,100కి చేరుకుంది.   

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగస్టులో మొదటి ఎనిమిది నగరాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ ఇన్వెంటరీ సగటు ధరలు 3-13 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement