హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్‌తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.
పట్టణాల వారీగా విక్రయాలు..
బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.
చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కోల్‌కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.
ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.
పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.
“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment