‘ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి’ అంటుంటారు. ఈ ఆర్టిస్ట్ మాత్రం ‘ధరలు కాదు ఇళ్లే ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది!’ అనుకొని మాయజాలాన్ని సృష్టించాడు. మహా పట్టణాలు భవంతులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మాణాలతో నేల నిండిపోయింది. పైన ఆకాశం మాత్రం ఖాళీగా కనిపిస్తుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ‘ఫ్లోటింగ్ బిల్డింగ్స్’ ఏఐ ఆర్ట్ సిరీస్‌ను సృష్టించాడు. వీటికి ముంబై మహానగరాన్ని నేపథ్యంగా తీసుకొని ‘ముంబై సర్రియల్ ఎస్టేట్’ అనే కాప్షన్ ఇచ్చాడు. ‘మీరు సరదాకు ఇలా చేశారు గానీ ఆకాశం కూడా బిల్టింగ్‌లతో కిక్కిరిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’ అని భవిష్యవాణి చెప్పాడు ఒక నెటిజనుడు.
Comments
Please login to add a commentAdd a comment