Prateek
-
ఇళ్ల ధరలు కాదు... ఇళ్లే ఆకాశాన్ని అంటాయి!
‘ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి’ అంటుంటారు. ఈ ఆర్టిస్ట్ మాత్రం ‘ధరలు కాదు ఇళ్లే ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది!’ అనుకొని మాయజాలాన్ని సృష్టించాడు. మహా పట్టణాలు భవంతులతో కిక్కిరిసిపోతున్నాయి. నిర్మాణాలతో నేల నిండిపోయింది. పైన ఆకాశం మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ‘ఫ్లోటింగ్ బిల్డింగ్స్’ ఏఐ ఆర్ట్ సిరీస్‌ను సృష్టించాడు. వీటికి ముంబై మహానగరాన్ని నేపథ్యంగా తీసుకొని ‘ముంబై సర్రియల్ ఎస్టేట్’ అనే కాప్షన్ ఇచ్చాడు. ‘మీరు సరదాకు ఇలా చేశారు గానీ ఆకాశం కూడా బిల్టింగ్లతో కిక్కిరిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు’ అని భవిష్యవాణి చెప్పాడు ఒక నెటిజనుడు. -
2043లో ఒక వానాకాలం
అదేమిటో...వర్షాకాలం రాగానే రోడ్లు మాట తప్పకుండా చెరువులు అవుతాయి. బైక్లేమో ‘నేనేమైనా బోట్ అనుకున్నావా’ అంటూ ముందుకు వెళ్లడానికి మొరాయిస్తాయి. వర్షాకాలంలో రోడ్లు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ఫ్యూచరిస్టిక్ రెయిన్వేర్, రోడ్ల చెరువులపైనా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయే అత్యాధునిక ఆటోల ఏఐ ఇమేజ్‌లను సృష్టించి ‘ఇవి నిజమైతే ఎంత బాగుంటుంది!’ అనిపించాడు. సైన్స్–ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్‌ను ఏఐకి జోడించి ‘ఔరా’ అనిపిస్తున్నాడు ప్రతీక్. ‘వానకాలంలో ముంబై రోడ్లు హారర్ సినిమాల్లా భయపెడతాయి. టెక్నాలజీతో కూడిన ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక వాహనాలు ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. మీ ఇమేజ్‌లు నిజం కావాలి’ అంటూ నెటిజనులు స్పందించారు. -
జూనియర్ ఎన్బీఏ టోర్నీకి ప్రతీక్, హర్ష్
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జూనియర్ ఎన్బీఏ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ‘స్లేట్ ది స్కూల్’ విద్యార్థులు గోన ప్రతీక్, హర్ష్ కర్వా ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని జేపీ అట్లాంటిస్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇదే కాకుండా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగే బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపుకు కూడా ప్రతీక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్లేట్ ది స్కూల్ చైర్మన్ అమర్నాథ్ వాసిరెడ్డి ప్రతీక్‌ను అభినందించారు. జట్ల వివరాలు పురుషులు: జి. ప్రతీక్, హర్ష్, హరిద్వారకేశ్, సిద్ధార్థ్ గంగరాజు, కె. సర్దానా, సాయి కిషోర్, అక్షిత్ రెడ్డి, అన్మోల్ పవార్, భవాని ప్రసాద్, ఎమ్మాన్యుయేల్, పి. నవీన్ కుమార్ (కోచ్). మహిళలు: అర్షియా త్యాగి, కె. శ్రీయ, రేఖ, అమూల్య, అసలత్ సుల్తానా, యశస్విని, లోరెట్టా శరణ్ రాబర్ట్, జియా ధావల్ సుతార్, శ్రేయ, పాల్య గుడిపాడి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతి
చింతకొమ్మదిన్న: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని క్విన్టాల్స్ ఫాంకో విజిలెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే నలుగురు ఉద్యోగులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు కడపకు వస్తుండగా మార్గమధ్యంలో వీరి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతీక్(25), అమృత్(25) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. రవితేజ, సంతోష్ మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేనిప్పటికీ సింగిల్‌నే
నేనిప్పటికీ సింగిల్నేనంటోంది ఇంగ్లీష్ దొరసాని ఎమిజాక్సన్. మదరాసు పట్టణం చిత్రం తో కోలీ వుడ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి తొలిచిత్రం మినహా విజయాలేమీ లేవు. బాలీవుడ్లో నటించిన ఏక్ దివానా చిత్రం ఆమెను నిరాశపరచింది. అంతేకాదు ఆ చిత్ర హీరో ప్రతీక్‌తో లవ్ బ్రేక్ అప్ అయి మరో షాక్ తింది. సరిగ్గా అలాంటి సమయంలోనే విక్రమ్ సరసన ఐ చిత్రంలో నటించే అవకాశం ఆమెను సంతోషంలో ముంచెత్తింది. ఈ చిత్రం తరువాత తన రేంజే వేరంటున్న ఎమిజాక్సన్ మాట్లాడుతూ ఐ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్, ధనుష్‌తో నటించే చిత్రాలను అంగీకరించానని చెప్పింది. ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది. తమిళంలో చాలా చిత్రాలు చేయాలని కోరిక ఉందని చెప్పింది. అందుకే తమిళభాష కూడా నేర్చుకుంటున్నానని అంది. ఉదయనిధి స్టాలిన్ సరసన లంగా, ఓణీ, చీర అంటూ గ్రామీణ యువతిగా నటించనున్నట్లు వెల్లడించింది. నటనతోపాటు ఇంకేమి తెలుసని అడుగుతున్నారని తాను వంట బాగా చేస్తానని చెప్పింది. దోసెలు సూపర్‌గా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనేనని సినిమాలో తనకు మంచి భవిష్యత్ ఉంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. గతం గురించి ఏమీ అడగొద్దు దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే జీవిస్తున్నాను ఎవరినీ ప్రేమించడం లేదు అని ఎమిజాక్సన్ అంటోంది. -
పీయూసీ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతం
బెంగళూరు : నగరంలో కళాశాల విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ఛేదించి యువకుడిని క్షేమంగా విడిపించినట్లు డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అయితే పరారీలో ఉన్న నిందితులు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేవయ్య పార్కు సమీపంలో నివాసముంటున్న రమేష్ కుమారుడు ప్రతీక్ (18) ప్రతీక్ సెయింట్ జోసెఫ్ కళాశాలలో పీయుసీ చదువుతున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రతీక్ స్కూటర్లో ఇంటికి ఇంటికి బయలుదేరాడు. మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తుండగా ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం వేగం తగ్గించడంతో దాని వెనుకనే వస్తున్న ప్రతీక్ కూడా స్కూటర్ వేగాన్ని తగ్గించాడు. వారి వెనుకనే మారుతి వ్యాన్‌లో వస్తున్న దుండగులు ప్రతీక్‌ను పట్టుకుని వ్యాన్ లోపలికి లాగేసుకుని వేగంగా వెళ్లిపోయారు. అనంతరం రమేష్‌కు ఫోన్ చేసి కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు. రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళన చెందిన రమేష్ హుటాహుటిన సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా డీసీపీ సందీప్ పాటిల్ రంగంలోకి దిగి ఏడుగురు సీఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిటీ మొత్తం జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కిడ్నాపర్లతో మాటలు కలపాలని రమేష్‌కు పోలీసులు సూచించారు. రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రాత్రంతా దుండగులు ప్రతీక్‌ను కారులో నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. కిడ్నాపర్లు మొదట లాల్బాగ్ ఈస్ట్‌గేట్ దగ్గరకు నగదు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. రమేష్ నగదు తీసుకుని అక్కడి చేరుకున్నాడు. పోలీసులు కూడా వచ్చారని గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిమ్హాన్స్, కిద్వాయ్ ఆస్పత్రికి వద్దకు రావాలని చెప్పి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. మంగళవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో బెంగళూరు- హొసూరు రోడ్డులోని డెయిరీ సర్కిల్ దగ్గరకు రావాలని చెప్పారు. రమేష్ నగదు బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడికి బైక్‌లో వచ్చిన నిందితుడు నగదు బ్యాగ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట కుమారుడిని చూపించాలని రమేష్ అన టంతో కిడ్నాపర్ బ్యాగ్ లాక్కొటానికి యత్నించాడు. ఇదే సమయంలో పోలీసులు వచ్చారని తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి వేగంగా వాహనంలో వెళ్లిపోయారు. వెనుకాలే పోలీసులు వస్తున్నట్లు గ్రహించిన కిడ్నాపర్లు లక్కసంద్ర వద్ద ప్రతీక్‌ను వదిలి పరారయ్యారు. కిడ్నాపర్లు కన్నడలోనే మాట్లాడారని ప్రతీక్ తెలిపారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.