రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతి | 2 software engineers died in road accident at ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతి

Published Thu, Oct 20 2016 10:47 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

2 software engineers died in road accident at ysr district

చింతకొమ్మదిన్న: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని క్విన్‌టాల్స్ ఫాంకో విజిలెన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే నలుగురు ఉద్యోగులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు కడపకు వస్తుండగా మార్గమధ్యంలో వీరి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతీక్(25), అమృత్(25) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. రవితేజ, సంతోష్ మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement