
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : విధులు నిర్వహిస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ అకాలమరణం చెందాడు. వేగంగా వచ్చిన ఓ కారు.. బోయనపల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మాన్నూరు హెడ్ కానిస్టేబుల్ మనోహర్(50) మృతి చెందగా.. పోలీస్ జీప్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. మృతుడు కడప జిల్లా చెన్నూరుకు చెందిన వ్యక్తిగా ఎస్సై మహేష్ నాయుడు తెలిపారు. ఢీకొట్టిన వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment