అదేమిటో...వర్షాకాలం రాగానే రోడ్లు మాట తప్పకుండా చెరువులు అవుతాయి. బైక్‌లేమో ‘నేనేమైనా బోట్ అనుకున్నావా’ అంటూ ముందుకు వెళ్లడానికి మొరాయిస్తాయి. వర్షాకాలంలో రోడ్లు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ఫ్యూచరిస్టిక్ రెయిన్‌వేర్, రోడ్ల చెరువులపైనా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయే అత్యాధునిక ఆటోల ఏఐ ఇమేజ్‌లను సృష్టించి ‘ఇవి నిజమైతే ఎంత బాగుంటుంది!’ అనిపించాడు.
సైన్స్–ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్‌ను ఏఐకి జోడించి ‘ఔరా’ అనిపిస్తున్నాడు ప్రతీక్.
‘వానకాలంలో ముంబై రోడ్లు హారర్ సినిమాల్లా భయపెడతాయి. టెక్నాలజీతో కూడిన ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక వాహనాలు ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. మీ ఇమేజ్‌లు నిజం కావాలి’ అంటూ నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment