నేనిప్పటికీ సింగిల్‌నే | i am Single Amy Jackson | Sakshi

నేనిప్పటికీ సింగిల్‌నే

Jan 13 2015 2:40 AM | Updated on Sep 2 2017 7:36 PM

నేనిప్పటికీ సింగిల్‌నే

నేనిప్పటికీ సింగిల్‌నే

నేనిప్పటికీ సింగిల్‌నేనంటోంది ఇంగ్లీష్ దొరసాని ఎమిజాక్సన్. మదరాసు పట్టణం చిత్రం తో కోలీ వుడ్‌లో అడుగుపెట్టిన

 నేనిప్పటికీ సింగిల్‌నేనంటోంది ఇంగ్లీష్ దొరసాని ఎమిజాక్సన్. మదరాసు పట్టణం చిత్రం తో కోలీ వుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి తొలిచిత్రం మినహా విజయాలేమీ లేవు. బాలీవుడ్‌లో నటించిన ఏక్ దివానా చిత్రం ఆమెను నిరాశపరచింది. అంతేకాదు ఆ చిత్ర హీరో ప్రతీక్‌తో లవ్ బ్రేక్ అప్ అయి మరో షాక్ తింది. సరిగ్గా అలాంటి సమయంలోనే విక్రమ్ సరసన ఐ చిత్రంలో నటించే అవకాశం ఆమెను సంతోషంలో ముంచెత్తింది.
 
 ఈ చిత్రం తరువాత తన రేంజే వేరంటున్న ఎమిజాక్సన్ మాట్లాడుతూ ఐ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్, ధనుష్‌తో నటించే చిత్రాలను అంగీకరించానని చెప్పింది. ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది. తమిళంలో చాలా చిత్రాలు చేయాలని కోరిక ఉందని చెప్పింది. అందుకే తమిళభాష కూడా నేర్చుకుంటున్నానని అంది. ఉదయనిధి స్టాలిన్ సరసన లంగా, ఓణీ, చీర అంటూ గ్రామీణ యువతిగా నటించనున్నట్లు వెల్లడించింది.
 
 నటనతోపాటు ఇంకేమి తెలుసని అడుగుతున్నారని తాను వంట బాగా చేస్తానని చెప్పింది. దోసెలు సూపర్‌గా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనేనని సినిమాలో తనకు మంచి భవిష్యత్ ఉంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. గతం గురించి ఏమీ అడగొద్దు దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే జీవిస్తున్నాను ఎవరినీ ప్రేమించడం లేదు అని ఎమిజాక్సన్ అంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement