ఫస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌తోనే అమీ జాక్సన్‌ రీఎంట్రీ..  | Amy Jackson To Make Her Comeback In Tamil Cinema With Al Vijay | Sakshi
Sakshi News home page

Amy Jackson : ఫస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌తోనే అమీ జాక్సన్‌ రీఎంట్రీ.. 

Published Sat, Oct 8 2022 8:50 AM | Last Updated on Sat, Oct 8 2022 8:54 AM

Amy Jackson To Make Her Comeback In Tamil Cinema With Al Vijay - Sakshi

విక్రమ్‌ ‘ఐ’, రజనీకాంత్‌ ‘2.ఓ’, రామ్‌ చరణ్‌ ‘ఎవడు’ చిత్రాలతో అమీ జాక్సన్‌ సుపరిచితురాలే. 2019లో ఇంగ్లీష్‌ వ్యాపారవేత్త జార్జ్‌ను పెళ్లాడారామె. అమీ ఓ బాబుకు జన్మనిచ్చారు. మూడేళ్ల్ల బ్రేక్‌ తర్వాత ఆమె తిరిగి నటిగా మేకప్‌ వేసుకోనున్నారు. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా రూపొంధనున్న ‘అచ్చమ్‌ ఎన్బదు ఇల్లయే’ అమీ రీ ఎంట్రీ మూవీ కానుంది. ఈ చిత్రంలో ఓ బ్రిటిష్‌ యువతి పాత్రలో కనిపించనున్నారు అమీ.

కాగా అమీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రం ‘మద్రాస పట్టినమ్‌’కు దర్శకుడు అయిన ఏఎల్‌ విజయ్‌నే ఆమె రీ ఎంట్రీ ఫిల్మ్‌కు దర్శకుడు కావడం విశేషం. అంతేకాదు.. ‘మద్రాస పట్టినమ్‌’లో బ్రిటిష్‌ యువతిగా నటించిన అమీ ఇప్పుడు అదే దర్శకుడు తీస్తున్న ‘అచ్చమ్‌ ఎన్బదు..’లో కూడా సేమ్‌ బ్రిటిష్‌ యువతి పాత్రే చేస్తుండటం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement