మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌? | Anushka Shetty Again Team Up With AL Vijay For a Tamil Movie | Sakshi
Sakshi News home page

Anushka Shetty: మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌?

Published Thu, Feb 23 2023 8:56 AM | Last Updated on Thu, Feb 23 2023 9:15 AM

Anushka Shetty Again Team Up With AL Vijay For a Tamil Movie - Sakshi

అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్‌ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్‌ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్‌కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు.

చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్‌ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్‌కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి.

కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో దైవతిరుమగళ్‌ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్‌ రష్మీ

కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్‌ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్‌ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement