అమీ.. ఏమాత్రం తగ్గడం లేదుగా! | Netizens Troll Amy Jackson For Her Photo On Social Media | Sakshi
Sakshi News home page

అందులో అమీ ఏ మాత్రం తగ్గడం లేదు!

Published Sun, Feb 2 2020 9:04 AM | Last Updated on Sun, Feb 2 2020 9:11 AM

Netizens Troll Amy Jackson For Her Photo On Social Media - Sakshi

హాట్‌ ఫొటోలతో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నటి అమీజాక్సన్‌. కోలీవుడ్‌లో మదరాసు పట్టణం చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటీష్‌ బ్యూటీ ఆ తరువాత ఇక్కడ వరుసగా చిత్రాల్లో నటించింది. ఆర్యకు జంటగా నటనకు శ్రీకారం చుట్టిన అమీజాక్సన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 2.ఓ చిత్రం వరకూ ఏకధాటిగా సాగింది. ఇక తెలుగు, హిందీ భాషల్లోనూ పరిచయం అయ్యింది. అయితే ఈ రెండు భాషల్లో పెద్దగా రాణించలేదు గానీ, తమిళంలో క్రేజీ హీరోయిన్‌గానే వెలిగింది. అలాంటిది ఇక్కడ రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రమే చివరిదిగా నమోదైంది. 

కారణం లండన్‌కు చెందిన జార్జ్‌ ఫెర్నాండ్‌ అనే వ్యాపారవేత్త ప్రేమలో పడింది. అలా పెళ్లి కాకుండానే తల్లి కూడా అయిపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ 23న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి ఆండ్రియోస్‌ అని నామకరణం చేసింది. ఇకపోతే గర్భవతి అయిన తరువాత నటనకు స్వస్తి చెప్పిన అమీజాక్సన్‌ తన గ్లామరస్‌ ఫొటోలను మాత్రం మీడియాకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటూనే ఉంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుటి దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తన పొత్తికడుపుతో ఉన్న బిడ్డను కూడా ప్రపంచానికి పరిచయం చేసేసింది. 

అంతటితో ఆగలేదు ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఒక బిడ్డకు తల్లినన్న విషయాన్ని కూడా మరిచి తాజాగా ఈత దుస్తులతో వర్షంలో నిలబడ్డ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. నటనకు గుడ్‌బై చెప్పినా అమీజాక్సన్‌ గ్లామర్‌ను ప్రదర్శించడంలో అసలు తగ్గడం లేదుగా అని ఒక వర్గం కామెంట్స్‌ చేస్తుంటే, మరి కొందరు ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫొటోలను సోషల్‌ మీడియాకు విడుదల చేస్తోంది, మళ్లీ నటించాలని కోరుకుంటోందా? అని అంటున్నారు. ఏదేమైనా ఎమీ మాత్రం ఏదో విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది.  
 

Just to ‘simply’ wake up and see my son lying next to me is a blessing. To be able to walk outside on my own two legs and hear the waves with my own two ears is a blessing. To have the chance to speak to my best friends and family so I can tell them I love them is a blessing. If you opened your eyes today and took another breath - you’re winning!! With everything that’s happening across the world right now... just to LIVE another day is truly a gift!! I’m going into my 28th year on this planet with a whole new perspective and a heart filled with gratitude anddddd I’m gonna start with this little rain dance!! Yes it’s p*ssing down on my birthday and there’s not an ounce of sun to be seen BUT on the plus side, the plants are happy 🙃

A post shared by Amy Jackson (@iamamyjackson) on

చదవండి:
అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు! 

అమలాపాల్‌-విజయ్‌ విడిపోడానికి ధనుషే కారణం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement