చెన్నైలోనే ఎమీజాక్సన్‌ | Amy jackson has a home in Chennai's Besant Nagar | Sakshi
Sakshi News home page

చెన్నైలోనే ఎమీజాక్సన్‌

Mar 12 2017 3:43 AM | Updated on Sep 5 2017 5:49 AM

చెన్నైలోనే ఎమీజాక్సన్‌

చెన్నైలోనే ఎమీజాక్సన్‌

ఇతర భాషా నటీమణులు తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తుంటారు. ఇక నటి నయనతార లాంటి టాప్‌ హీరోయిన్లు నక్షత్ర హోటళ్లలో ఉండే వారి ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది.

ఇతర భాషా నటీమణులు తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నక్షత్ర హోటళ్లలోనే బస చేస్తుంటారు. ఇక నటి నయనతార లాంటి టాప్‌ హీరోయిన్లు నక్షత్ర హోటళ్లలో ఉండే వారి ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. నిర్మాతలకు భారం తగ్గించాలన్న ఆలోచనతో నయనతార చెన్నైలో స్వంత నివాసం ఏర్పరచుకున్నారు. స్థానిక ఎగ్మూర్‌లో ఒక అధునాతన ఫ్లాట్‌ను కొనుగోలు చేసి అందులో నివశిస్తున్నారు.ఆమె ప్రేమికుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివ కూడా ఆ ఫ్లాట్‌లోనే నివశిస్తున్నట్లు సమాచారం.

 నటి ఎమీజాక్సన్‌ కూడా నయనతార బాటలోనే పయనిస్తున్నారు.మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ ఇంగ్లీష్‌ బ్యూటీ ఇప్పటివరకూ స్టార్‌ హోటల్‌నే బస చేస్తూవచ్చారు. మధ్యలో హిందీ చిత్రాలపై దృష్టి సారించిన ఎమీ అక్కడ సక్సెస్‌ దరిచేరకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌కు జంటగా 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఈ భామ ఇకపై చెన్నైలోనే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారట.

దీంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోదలచిన ఎమీ స్థానిక బీసెంట్‌ నగర్‌ సముద్రతీర ప్రాతంలో ఒక అందమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దానికి తనకు నచ్చిన విధంగా పాశ్చాత్యం సొబగులను అందించుకునే పనిలో ఉన్నారట. త్వరలోనే ఆ ఫ్లాట్‌లో మకాం పెట్టనున్న ఎమీజాక్సన్‌ తనకు తోడుగా తను తల్లి మార్గెట్‌ను తీసుకురావాలని భావిస్తున్నారట. మరో రక్షణగా ఒక విదేశీ శునకాన్ని దిగుమతి చేసుకోనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement