న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్‌కతాలో 11 శాతం, అహ్మదాబాద్లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్‌హెచ్‌బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?)
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్–50లో అత్యధికంగా గాంధీనగర్‌లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది.
ఇదీ చదవండి: 1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు
మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment